S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/30/2016 - 04:00

సూర్యాపేట, మార్చి 29: మైనార్టీవర్గాల విద్యార్థులకు కార్పొరేట్‌కు ధీటుగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు రాష్టవ్య్రాప్తంగా 120 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఎసిబి డైరెక్టర్ జనరల్, మైనార్టీ వెల్ఫేర్ బోర్డు కమిటీ కార్యదర్శి ఎకె.ఖాన్ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం రాష్ట్రంలో 70 పాఠశాలలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

03/29/2016 - 16:42

హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తమను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కొందరు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు వేసిన పిటిషన్‌పై క్యాట్ మంగళవారం తీర్పునిచ్చింది. మొత్తం 15 మంది అధికారులను తెలంగాణలోనే పనిచేయనీయాలని ఆదేశించింది. సోమేశ్‌కుమార్‌, అనంతరాము, శంషేర్‌, ఆమ్రపాలి, రొనాల్డ్‌రోస్‌, వాకాటి కరుణ, రంగనాధ్‌, అంజనికుమార్‌లు తెలంగాణలోనే పనిచేయాలని క్యాట్‌ తీర్పు ఇచ్చింది.

03/29/2016 - 16:45

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రశాంతత నెలకొనేలా విద్యార్థులు, అధ్యాపకులతో సమన్వయ కమిటీని నియమించాలని హైకోర్టులో మంగళవారం ప్రొఫెసర్ వినోద్‌కుమార్ ‘పిల్’ (ప్రజా ప్రయోజన వాజ్యం) దాఖలు చేశారు. దీంతో హెచ్‌సియు వీసీ, రిజిస్ట్రార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్, విద్యార్థి సంఘాల నేతలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. రెండువారాల తర్వాత విచారణ జరుగుతుందని న్యాయస్థానం ప్రకటించింది.

03/29/2016 - 16:36

హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తెరాస అభ్యర్థుల చేత ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయించరాదని, జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రుల ప్రమేయాన్ని తగ్గించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీలో సిఎం కెసిఆర్‌ను కలిసినపుడు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం నిధుల కింద ఎమ్మెల్యేలకు ఇచ్చే మొత్తాన్ని పెంచాలని విపక్ష నేత జానారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సభ్యులు సిఎంను కోరారు.

03/29/2016 - 16:36

దిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచేందుకు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాలని మంత్రి కెటిఆర్ మంగళవారం ఇక్కడ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

03/29/2016 - 16:35

హైదరాబాద్: నియోజకవర్గం అభివృద్ధి నిధుల కింద ఎమ్మెల్యేలకు ఇస్తున్న మొత్తాన్ని కోటిన్నర నుంచి మూడు కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు తెలంగాణ అసెంబ్లీలో సిఎం కెసిఆర్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు వెంటనే ఆదేశాలు ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలకు ఈ నిధులను 5 కోట్లకు పెంచాలని కాంగ్రెస్ సభ్యుడు జానారెడ్డి చేసిన సూచనపై సిఎం స్పందిస్తూ ఈ ప్రకటన చేశారు.

03/29/2016 - 13:06

హైదరాబాద్: ఎమ్మెల్యేల జీతభత్యాల పెంపునకు సంబంధించిన బిల్లును తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం ఆమోదించారు. ఈ బిల్లు ప్రకారం ప్రతి ఎమ్మెల్యేకు ఇకపై అన్ని అలవెన్స్‌లు కలిపి నెలకు రెండున్నర లక్షల రూపాయలు, మంత్రులు, చీఫ్‌విప్, విప్‌లకు నాలుగు లక్షలు అందుతాయి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు మరణిస్తే వారి భార్యలకు జీవితకాలం పాటు ఇచ్చే పెన్షన్‌ను కూడా పెంచారు.

03/29/2016 - 13:05

హైదరాబాద్: సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో మంగళవారం నాడు వివిధ జైళ్ల నుంచి 251 మంది ఖైదీలు విడుదలయ్యారు. వీరిలో 190 మంది జీవిత ఖైదీలున్నారు. వీరిని జనవరి 26న విడుదల చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగింది.

03/29/2016 - 13:04

హైదరాబాద్: తెలుగుదేశం 35వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఇక్కడి ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించారు. పార్టీ ఎపి విభాగం అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.

03/29/2016 - 11:53

హైదరాబాద్: కొద్దిరోజులుగా అగ్నిగుండంగా మారిన ఎపి, తెలంగాణల్లో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేరకు తగ్గాయి. దక్షిణాది నుంచి వస్తున్న గాలులతో పాటు మబ్బు వాతావరణం ఉండడంతో ఈరోజు అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉంది. చత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో వాతావరణం చల్లబడింది. కోస్తా, తెలంగాణ, రాయలసీమలో వేడి తగ్గడంతో పాటు కొన్ని చోట్ల చిరుజల్లులు కురిశాయి.

Pages