S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

10/07/2017 - 23:00

నిన్ను వరించిన
స్వప్నంలోకి
నన్ను లాక్కుపోయావు

10/07/2017 - 22:58

గాలి అలలపై
వేలాడుతున్న మేఘాలను
బహుశా
ఆకాశం
జల్లెడ పట్టిందనుకుంటా..
రాలుతున్న వాన చినుకు
ఆడుకుంటున్న పాప
ముక్కుపుడకపై ముత్యమైతే...
ఆశపెట్టిన పిల్లాడికి
కంటికురుపయింది..
నా కళ్లద్దాలతోనూ
దొంగా పోలీసాటాడింది
ఆకాశం జారుడుబల్ల నుంచి
సాలీడు మైనపు దారాల్లా
చివరలు పేనుకుంటూ
చినుకు చినుకుగా జారుతూ

10/07/2017 - 22:57

చెట్టుకు పురుగు తీరు
కట్టెకు చెదలు తీరు
కట్టకు పుట్ట తీరు
నదులకు ఇసుకాసురులు
వాగులు వంకల్ని కూడా
వదలకుండా తోడేస్తున్నారు
పెద్దపెద్ద వాహనాలతో
పెనుతుఫానులా వస్తున్నారు
మారుమూల పల్లెల్లో
మారణహోమం సృష్టిస్తున్నారు
మనుషుల ప్రాణాలనే కాదు
మట్టి రోడ్లనూ మింగేస్తున్నారు
నదులకన్న ఇసుక ముఖ్యమైంది

10/07/2017 - 22:55

ఒక్క చినుకు రాలాలి..
నా కునుకు వదిలించడానికి.

ఒక్క చురుకు తగలాలి..
నా మత్తును విడిపించడానికి.

ఒక్క పలుకు చెవి తాకాలి..
నా మదిని మధించడానికి.

ఒక్క ఉలుకు కలగాలి..
నా నడకని సవరించడానికి.

ఒక్క తళుకు కావాలి..
నా బ్రతుకుని వెలిగించడానికి. *

10/07/2017 - 22:55

మత్తు కొత్త రూపందాల్చి
ఎప్పుడు తెరకెక్కిందో తెల్వదు

చాప కింద నీరులా
పసిమెదళ్లలో నిషాతో
నర్తిస్తుంది

విసుగు ప్రపంచాన్ని విసిరేసి
కొత్త కష్టాన్ని కొని తెచ్చుకునే
అమాయకత్వం

తోలుబొమ్మల అభినయం
అందమైన అబద్ధమే, నిజమైన జీవితం

చాక్లెట్‌లు మత్తు వాసనతో
పరిమళిస్తున్నాయి

10/07/2017 - 22:54

కల్తీ పంచదార తిన్న కరెంటు చీమ కుట్టినా
కార్పొరేట్ ఆస్పత్రికే పరిగెట్టాలి
తన వీపు తను చూసుకోలేని మనిషిలా
పాపం చీమకి మాత్రం ఏం తెలుసు
ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్లకి
తలా ఓ కార్పొరేట్ ఆస్పత్రి వుందని
వైద్యం అంటే వున్నోళ్లకి ప్రాణం పోసి
లేనోళ్ల వుసురు తీసే కబేళాలై పోయాయని!
గోమాంసం తిన్నాడని అక్లాఖ్‌ని నరికేసిన
మూర్ఖులకేం తెలుస్తుంది మనిషిని

09/23/2017 - 22:38

కాలి బూడిదయిన కన్నీళ్ల మీద
కసి తీర్చుకోవటం పాలకుల సరదా
మన ప్రజాస్వామ్యం మానసిక చిత్రహింసల హారం
మన రాజ్యాంగం పచ్చనోట్ల జైలులో
కేసులేని బందీ

09/23/2017 - 22:37

నీటి బిందువులు
రైతు బాంధవులు
పొలాలకు జీవం అందించే
అమృత బిందువులు
మతాలు కులాలు కల్పితాలు
మానవత్వమే మన మతం
మనమంతా ఈశ్వరుని సేవకులం

అవసరానికి నవ్వులు
అనవసరపు నవ్వులు
జీవంలేని నవ్వులు
గెలుపు కోసం ఓట్లు
గెలిచినాక కోట్లు
ప్రజాస్వామ్యానికి తూట్లు

09/23/2017 - 22:35

నేను ఉద్యోగం చేసే చోట
నేను ఉండే ఊరికి పది కిలోమీటర్లు
ప్రతిరోజూ నా రెండు చక్రాల వాహనంలో
జాతీయ రహదారి మీద వెళుతుంటాను
రోడ్డుకు ఇరుప్రక్కల పచ్చని పరదాల్లా చక్కని చెట్లు
గ్రీష్మం కనుమరుగవగానే
ఉన్నట్లుండి ఒకరోజు జడి పురుగుల రొద మొదలవుతుంది
మైళ్ల పొడవునా చెట్టు చెట్టునా
‘గీయ్’మనే శబ్దం వినబడుతుంటుంది
నిరంతరాయంగా వచ్చేపోయే వాహనాలు చేసే

09/23/2017 - 22:35

సంస్కరించటం
మనతోనే.. మొదలుపెట్టాలి..
అదే గొప్ప సంస్కారం..

ఆచరించి చెప్పే
సంస్కారానికున్న ప్రభావం
వొఠ్ఠి మాటలకుండదు గదా?

చేసిందే చెప్పి..
చెప్పిందే చేసారు వారు
అందుకే మహాత్ములయ్యారు..

Pages