S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

11/20/2016 - 00:24

ప్రపంచంలో ఒంటెల క్రయవిక్రయాలు జరిగే అతిపెద్ద ప్రదర్శనల్లో ‘పుష్కర’ ఒకటి. రాజస్థాన్‌లోని ఓ సరస్సు తీరంలో ఈ పట్టణం ఉంది. ఇక్కడ జరిగే ‘ఒంటెల సంత’ను పుష్కర ఫెయిర్‌గా పిలుస్తారు. లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించే ఈ యాత్రలో ఒంటెలే ప్రధాన ఆకర్షణ. వాటిని కొనడం, అమ్మడం ప్రధాన వ్యాపారం. ఇక వాటితో చేసే విన్యాసాలు కనువిందు చేస్తాయి. ఒంటెల పోటీలూ ఆసక్తికలిగించేవే.

11/12/2016 - 20:44

అక్వేరియంలో ఆకర్షణీయ రంగుల్లో కన్పిస్తున్న ఈ చేప నిజానికి ఓ రోబో. సింగపూర్‌లో ఈమధ్యే జరిగిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో దక్షిణ కొరియాకు చెందిన ఓ కంపెనీ ఈ రోబోఫిష్‌ను ప్రదర్శించింది.

11/12/2016 - 20:44

తల్లిప్రేమ ఎలాంటిదో మరోసారి రుజువు చేసింది ఈ చిత్రం. సముద్ర జలాల్లో జీవించే సీఅట్టర్ ఎక్కువకాలం నీళ్లలోనే జీవిస్తుంది. వీజిల్స్ కుటుంబానికి చెందిన ఈ జీవులు వెల్లకిలా కూడా ఈదుతాయి. దట్టమైన బొచ్చుతో ఉండే ఇవి పిల్లల్ని ఇలా బొజ్జపై పడుకోబెట్టుకుని వెల్లకిలా ఈదుతూ గడుపుతాయి. పసిఫిక్ సముద్ర జలాల్లో ఇవి ఎక్కువగా కన్పిస్తాయి.

11/12/2016 - 20:42

కణకణలాడే నిప్పుల్లో కాల్చి కొడితేగానీ ఓ రూపం రాదు కొన్ని లోహాలకు. జర్మనీలోని బెర్లిన్‌లో ఓ వర్క్‌షాప్‌లో కంచుతో తయారు చేస్తున్న ఓ విగ్రహం కేశాలకు అందమైన రూపం ఇచ్చేందుకు తపనపడుతున్న ఓ కళాకారుడు ఇలా నిప్పుతో సిగకు సెగపెడుతున్నాడు.

11/05/2016 - 23:49

ఆకలితో నకనకలాడుతున్న ఈ పులి పేరు సీత. నీళ్లలో వెళుతున్న ఓ చేపను చూసి వేటాడేందుకు చటుక్కున దూకింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ (క్వీన్స్‌లాండ్)లో ఈ అందమైన దృశ్యం కెమేరాకు చిక్కింది.

11/05/2016 - 23:47

అమెరికాలోని నార్త్ డకోటా శివారులో ఏర్పాటు చేసిన ఫైబర్ ఆవు ఇది. ఆ ప్రాంతంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి గుర్తుగా దీనిని ఏర్పాటు చేశారు. 40వేల అమెరికన్ డాలర్ల వ్యయంతో 38 అడుగుల ఎత్తు, 50 అడుగుల పొడవుతో ఫైబర్, గ్లాస్‌ను ఉపయోగించి ఓ ఆవు ప్రతిమను అక్కడ ఏర్పాటు చేశారు. కొన్నిమైళ్ల దూరం నుంచి దీనిని చూడొచ్చు. ఇది ఓ పర్యాటక ఆకర్షణగా మారిపోయింది. క్షీరవిప్లవానికి నిదర్శనంగా.

11/05/2016 - 23:44

లండన్‌లోని లీసెష్టర్‌లో దీపావళి వేడుకలు వారంరోజులపాటు నిర్వహించారు. అక్కడ రంగురంగుల ఎల్‌ఇడి దీపాలు అలంకరించి, అందమైన నృత్యాలతో పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఇప్పుడు దీపావళి కేవలం భారతీయుల పండుగ కాదు. ఇది ప్రపంచం అంతటా నిర్వహించుకుంటున్న దీపాల వేడుక.

10/28/2016 - 23:25

ఎర్రని మోము, నల్లని కలువలతో అందంగా ముస్తాబైన ఈ అమ్మడు మాస్కోలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ఇలా హొయలు పోయింది. ఈ మధ్యే ఇక్కడ నిర్వహించిన మెర్సిడెస్ బెంజ్ ఫ్యాషన్ షోలో ఈ రష్యా అందగత్తె చేసిన క్యాట్‌వాక్ అందరి మతులుపోగొట్టింది.

10/28/2016 - 23:22

థాయ్‌లాండ్ రాజు భూమిబొల్ అదుల్యదెజ్ ఇటీవల మరణించారు. ఆ శోకం నుంచి అక్కడివారు ఇంకా బయటపడలేదు. థాయ్ ప్రజలకు రాజంటే ఎంతో ఇష్టం. అందుకే అనుక్షణం ఆయనను తలుచుకుంటూ పలు రకాలుగా నివాళి అర్పిస్తున్నారు. శిల్పాకోర్న్ యూనివర్శిటీకి చెందిన ఫైన్‌ఆర్ట్స్ విద్యార్థులు ఇలా భూమిబొల్ చిత్రాలను ఆవిష్కరించి నివాళి అర్పించారు.

10/28/2016 - 23:20

ఔను. నిజంగా ఇది బందిఖానాయే. లేకపోతే ఏంటి చెప్పండి. 800 మంది కోసం ఏర్పాటు చేసిన జైలుగదిలో నాలుగువేలమంది ఉండమంటే మాటలా? ఇదిగో ఇక్కడ కన్పిస్తున్న వీరంతా ఏ ప్రయాణికులో, యాత్రికులో కాదుసుమా. ఫిలిప్పీన్స్‌లోని ప్రఖ్యాత ఖ్యూటిన్ సిటీ జైలులో పరిస్థితి. ఉన్న ఆ కాస్త చోటులోనే ఈ ఖైదీలంతా సర్దుకోవలసి వస్తోంది.

Pages