S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

01/21/2017 - 21:17

సోషల్ మీడియా అంతా ఇప్పుడు హాట్ హాట్‌గానే హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇదొక సూపర్ సరదాగా మారిందంటే ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. ఇక సినీ తారలకైతే పండగే..పండగ! తమ అభిమానులకు దగ్గరయ్యేందుకు..వారితో ఎన్నో విషయాలను షేర్ చేసుకునేందుకు ఇది బాగా దోహదపడుతోంది. అందుకు దీనిని ఒక వేదికగానే మార్చుకున్నారు.

01/21/2017 - 21:13

బాలీవుడ్‌లో నువ్వా..నేనా? అన్న రీతిలో కెరీర్‌ను కొనసాగించిన అందాల భామలు దీపికాపడుకొనే, ప్రియాంక చోప్రాలకు హాలీవుడ్‌లోనూ ఇదే తంతు కొనసాగుతోందిట. హిందీ చిత్రాల్లో అగ్ర హీరోలనుంచి యువతరం కథానాయకులతో ఆడిపాడిన ఈ సుందరీమణులు నటించిన హాలీవుడ్ సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ‘క్వాంటికో’ టీవీ సీరిస్ ద్వారా ఇప్పటికే హాలీవుడ్ జనాలకు బాగా పరిచయమైంది ప్రియాంక.

01/21/2017 - 21:10

వెండితెరపై వెలిగిపోవాలని ఎన్నో ఆశలు.. మరెన్నో కోరికలు.. అన్నీ నీరుగారిపోయాయి అందాల భామ సలోని విషయంలో. అచ్చ తెలుగమ్మాయికి వుండవలసిన అన్నీ ఫీచర్స్ వున్నా కెరీర్‌ని మాత్రం నిలబెట్టలేకపోయాయి.

01/08/2017 - 05:50

తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న భామ నయనతార. నవతరం హీరోలనుంచి అగ్ర నటులతో ఆడిపాడిన ఈ సుందరాంగి ఇకపై మూస పాత్రల జోలికి వెళ్లకుండా వెరైటీ పాత్రలవైపే మనసు మళ్లించింది. గ్లామర్‌తో పాటు వైవిధ్యమైన పాత్రలు పోషించి నటిగా ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకున్న నయనతార కథానాయికకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించడానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది.

01/08/2017 - 05:48

వెండితెరపై అడుగుపెట్టినప్పటి నుంచి రాధికా ఆప్టే ఎప్పుడూ ఓ సంచలనమే. చేసే చిత్రాలు.. పోషిస్తున్న పాత్రల ద్వారా ఆమె సంచలనానికి కేంద్ర బిందువుగానే మారింది. నటుడు ప్రకాశ్‌రాజ్ నటించి, నిర్మించిన ‘్ధనీ’ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి రాధికాఆప్టే తొలి చిత్రంలోనే ఒక ధనవంతుడికి ఉంపుడుగత్తెగా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

01/08/2017 - 05:47

బాలీవుడ్ గ్లామర్ క్వీన్ కత్రీనాకైఫ్ చేస్తున్న చిత్రాల్లో తనవి అన్నీ గ్లామర్ పాత్రలే. చేస్తున్న చిత్రాలు..పోషిస్తున్న పాత్రలు అన్నీ బిగ్ బ్యానర్లలోనే. ఎప్పుడూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండటం ఈ భామకు బాగా తెలుసు. ఇక రూమర్స్‌గోల అయితే లెక్కేలేదు. ఈ బ్యూటీపై వచ్చినన్ని రూమర్స్ మరే తారపై రాలేదంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఈ విధంగా ఎందుకు జరుగుతోంది అని కత్రీనాను అడిగితే- ‘‘ఎదుగుతున్న తారలపై..

01/08/2017 - 05:46

తెలుగు, తమిళ భాషల్లో యువతరం హీరోలనుంచి అగ్ర హీరోల వరకు ఆడిపాడిన అందాల భామ మిల్క్‌బ్యూటీ తమన్నా బాలీవుడ్‌పై మోజును పెంచుకుంటోంది. ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు విజయవంతంగా నటిగా తన 11ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకుంది. చేసిన చిత్రాలు.. పోషించిన పాత్రలు ఆమెకు ఎనలేని పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి.

12/31/2016 - 18:13

తెలుగు చిత్రసీమలో మలయాళీ భామల హవా జోరుగానే వుంది. అగ్ర హీరోల నుంచి యువతరం హీరోల వరకు ఈ భామలతో నటించడానికి ఉవ్విళ్లూరుతున్నారు. స్టార్ హీరోల నుంచి సైతం వీళ్లకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అలా వచ్చిన అవకాశాలను ఈ భామలు ఏ మాత్రం వృథా చేయకుండా తమ సత్తా చాటుకుంటున్నారు. అదే కోవలో ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కూడా చేరిపోయింది.

12/31/2016 - 18:11

యువతను కైఫ్ ఎక్కించే సోయగాల సుందరి నికిషా పటేల్ గుర్తిందిగా! అవునులే.. అప్పుడే ఎలా మరచిపోతాం. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన ‘కొమురం పులి’లో రెచ్చిపోయిన ఈ భామకు ఆ చిత్రం తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు రాలేదు. పవన్‌కళ్యాణ్ సరసన అనే సరికి అందరూ నికిషాను చిత్రం విడుదలకు ముందు తెగ పొగిడేశారు. కెరీర్‌లో ఎంతో ఎత్తుకు ఎదిగిపోవడం ఖాయం అని అంతా అనుకున్నారు.

12/31/2016 - 18:09

అందాల తార త్రిష వెండితెరపై అడుగుపెట్టి అప్పుడే దాదాపు పదిహేనేళ్లు గడిచిపోయాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన ఈ భామ ఇక మహిళా ప్రధాన చిత్రాలపైనే మక్కువ పెంచుకుందట. ‘మాయ’ చిత్రం నుంచి మరో అగ్రనటి నయనతార సైతం ఇలాంటి చిత్రాలవైపే మొగ్గు చూపిస్తుండటం మనం చూస్తూనే వున్నాం. త్రిష కూడా ఇక ఆమె బాటలోనే పయనించడానికి సిద్ధమయింది.

Pages