S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/26/2017 - 08:56

భీమవరం, జనవరి 25: ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ఆక్వా ఉత్పత్తులను పెంచాలనే లక్ష్యంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో అంతర్జాతీయ ఆక్వా సదస్సు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 11 నుంచి నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది.

01/26/2017 - 08:56

కాకినాడ, జనవరి 25: ముడి చమురు ఉత్పత్తిలో భారతదేశం పూర్తిగా వెనుకబడి ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్, ఆ సంస్థ చైర్మన్ సీనియర్ అడ్వయిజర్ అతుల్ చంద్ర అన్నారు. ప్రస్తుత అవసరాలకు తగిన చమురును ఉత్పత్తి చేయలేని స్థితిలో ఉన్న మన దేశం.. ఇతర దేశాల నుండి ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని, ఈ కారణంగా ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు.

01/25/2017 - 01:19

ముంబయి, జనవరి 24: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 2 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 258.24 పాయింట్లు ఎగిసి 27,375.58 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 84.30 పాయింట్లు ఎగబాకి 8,400 స్థాయిని అధిగమిస్తూ 8,475.80 వద్ద స్థిరపడింది.

01/25/2017 - 01:17

దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ మంగళవారం హైదరాబాద్‌లో తమ నూతన ఎస్‌యువి హెక్సాను ఆవిష్కరించింది. ఆరు వేరియంట్లలో లభ్యమయ్యే దీని ధర హైదరాబాద్ ఎక్స్‌షోరూం ప్రకారం 12,20,276 రూపాయలుగా ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు

01/25/2017 - 01:15

వరి సస్యరక్షణ మార్కెట్‌లోకి బిఎఎస్‌ఎఫ్ ప్రవేశించింది. దేశీయంగా వరి ప్రధాన పంటగా కొనసాగుతున్న నేపథ్యంలో దిగుబడులను పెంచి రైతుల ఆదాయ వృద్ధికి తోడ్పడేలా సరికొత్త కీటక నాశన మందులను పరిచయం చేసింది. మంగళ వారం హైదరాబాద్‌లో వీటిని సంస్థ ప్రతినిధులు ప్రదర్శించారు

01/25/2017 - 01:13

న్యూఢిల్లీ, జనవరి 24: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. మూడు సరికొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్లను పరిచయం చేసింది. టెలికామ్ రంగంలో ప్రైవేట్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడంలో భాగంగా ఈ నూతన స్కీమ్‌లకు బిఎస్‌ఎన్‌ఎల్ శ్రీకారం చుట్టగా, 26 రూపాయల టారీఫ్ వోచర్‌పై 26 గంటలపాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత లోకల్, ఎస్‌టిడి వాయిస్ కాల్స్‌ను ఇస్తోంది.

01/25/2017 - 01:12

హైదరాబాద్, జనవరి 24: ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సామర్థ్య వినియోగం, పొదుపు, సంరక్షణ అంశాలపై యునైటెడ్ స్టేట్స్ ఏజన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ సలహాదారు కె రంగనాథమ్ తెలిపారు. దేశంలో ఈ అధ్యయనానికి ఒక్క ఆంధ్రానే ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.

01/25/2017 - 01:11

ముంబయి, జనవరి 24: ఐడిబిఐ బ్యాంక్‌లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణ ఎగవేత కేసులో సిబిఐ మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. సోమవారం ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మందిని సిబిఐ అరెస్టు చేసినది తెలిసిందే. వీరిలో ఐడిబిఐ మాజీ చైర్మన్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సిఎఫ్‌ఒలు కూడా ఉన్నారు. ముంబయ సెషన్స్ కోర్టులో వీరిని సిబిఐ హాజరుపరిచింది.

01/25/2017 - 01:11

న్యూఢిల్లీ, జనవరి 24: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో 54 శాతానికిపైగా క్షీణించి 503.7 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 1,108.1 కోట్ల రూపాయలుగా ఉంది.

01/25/2017 - 01:10

న్యూఢిల్లీ, జనవరి 24: దేశీయ నాలుగో అతిపెద్ద ఐటిరంగ సంస్థ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 7.8 శాతం పెరిగి 2,070 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 1,920 కోట్ల రూపాయలుగా ఉంది. ఏకీకృత ఆదాయం కూడా ఈసారి 14.2 శాతం ఎగిసి 11,814 కోట్ల రూపాయలకు చేరింది.

Pages