S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/06/2019 - 03:58

సిద్దిపేట/ చేర్యాల, సెప్టెంబర్ 5: బర్త్‌డే వేడుకలు కుటుంబంలో విషాదం నింపింది. విషం కలిసిన బర్త్‌డే కేక్ తిని తండ్రీకొడుకులు మృతి చెందగా తల్లీ, కూతుళ్ల పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

09/06/2019 - 04:53

హైదరాబాద్, సెప్టెంబర్ 5: సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ బాబు హత్య కేసును కేపీహెచ్‌బీ పోలీసులు ఛేదించారు. ప్రియురాలు ప్రియాంక కోసమే సతీష్‌ను హేమంత్ హతమార్చాడని పోలీసులు స్పష్టం చేశారు. గురువారం కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు వివరాలను వెల్లడించారు. సతీష్, హేమంత్‌లు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు.

09/06/2019 - 01:32

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: శ్రీనగర్‌లో గృహ నిర్బంధంలో ఉన్న సీపీఐ(ఎం) నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ యూసుఫ్ తరిగామిని మెరుగయిన వైద్యచికిత్స కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకురావాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది.

09/06/2019 - 01:10

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీ. చిదంబరాన్ని 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీహార్ జైలుకు పంపారు. ఈనెల 19 వరకు ఆయన్ను తీహార్ జైల్లో ఉంచాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజయ్‌కుమార్ కుహర్ గురువారం తీర్పునిచ్చారు. నిందితుడిపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని..

09/06/2019 - 00:44

విజయవాడ: మచిలీపట్నం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వంతో తమ సంస్థ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడం చట్ట విరుద్ధమని, ప్రభుత్వం తన వైఫల్యాన్ని సంస్థ వైఫల్యంగా పేర్కొనడం అన్యాయమంటూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది.

09/06/2019 - 00:40

పరిగి, సెప్టంబర్ 5: గుర్తు తెలియని మహిళను కొందరు హత్య చేసి నిప్పంటించారు. సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగంపల్లి స్టేజీ సమీపంలో హైదరాబాద్ - బీజాపూర్ హైవే రోడ్డు పక్కన బుధవారం రాత్రి జరిగింది. గుర్తు తెలియని గర్భవతి అయిన మహిళ మృతదేహాన్ని కాలిపోయిన స్థితిలో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు.

09/05/2019 - 23:52

కతిహార్ (బిహార్) : బిహార్‌లోని కతిహార్ జిల్లా, సెషన్స్ జడ్జికి కోపమొచ్చింది. కోర్టుకు వెళ్లే తరుణంలో సదరు వాహనం ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో జడ్జి సహనాన్ని కోల్పోయారు. అంతే సెక్యూరిటీ సిబ్బందిలోని ఒక పోలీసుపై తన అసహనాన్ని ప్రదర్శిస్తూ బట్టలు విప్పించి మరీ చితకబాదినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు ఫిర్యాదు లో పేర్కొన్న వివరాలు మేరకు..

09/05/2019 - 04:39

అనంతపురం, సెప్టెంబర్ 4: అనంతపురం నగర సమీపంలోని కళాకారుల కాలనీలో నివాసముంటున్న భాస్కర్ భార్య శ్రీదేవి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు కుమారులను డ్రైనేజీ నీటి కుంటలోకి తోసేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం ఈ విషాద ఘటన వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

09/05/2019 - 04:06

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: అనర్హత వేటు పడిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే కపిల్ మిశ్రా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తనపై వేటు వేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం ఉపసంహరించుకున్నారు. కపిల్ మిశ్రా ఇటీవల ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.

09/05/2019 - 02:27

న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ కేసును ఎదుర్కొంటున్న కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీ కోర్టు ముందు హాజరుపరిచింది. మంగళవారం రాత్రి ఆయనను అరెస్టు చేసిన ఈడీ బుధవారం ఉదయం ఢిల్లీ కోర్టులో న్యాయమూర్తి అజయ్ కుమార్ ముందు ప్రవేశపెట్టింది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు జరిపిన తర్వాత ఈడీ అధికారులు ఆయనను కోర్టుకు తీసుకువచ్చారు.

Pages