S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/05/2019 - 01:56

హనుమాన్ జంక్షన్, సెప్టెంబర్ 4: బాపులపాడు మండలం రెమల్లెలోని మోహన్ స్పిన్ టెక్ కర్మాగారంలో పనిచేస్తున్న ఓ మహిళపై అక్కడే పనిచేస్తున్న కార్మికుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడనే వదంతులు వ్యాపించాయి. కార్మికుడి దాడిలో గాయపడిన మహిళను పోలీసులు ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.

09/05/2019 - 01:52

పెడన, సెప్టెంబర్ 4: పట్టణంలోని జామియా మసీదుకు సంబంధించిన వక్ఫ్ బోర్డు భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేయాలని టీడీపీకి చెందిన మైనార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ స్థానిక ముస్లిం నాయకులు పెడన పోలీసు స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. టీడీపీ మైనార్టీ నాయకుడు అబ్దుల్ రషీద్, మొహమూద్‌లపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు.

09/05/2019 - 01:47

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 4: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో వాహన తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ అధికారులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బుధవారం నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై ట్రాఫిక్ అధికారులు 80 కేసులు నమోదు చేశారు. పట్టుబడిన 32మందికి ట్రాఫిక్ చట్టాల పట్ల కౌనె్సలింగ్ నిర్వహించారు.

09/05/2019 - 00:52

న్యూఢిల్లీ : వివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు బుధవారం నిర్మోహి అఖారా హక్కులపై వివరణను కోరింది. వివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు ఆవరణ నిర్మోహి అఖారా ఆధీనంలోనే ఉంది. దీనిని రామ్‌లల్లాకు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించింది. అయితే, ఇది వివాదాస్పద ప్రాంతం కావడంతో దానిపై నిర్మోహి అఖారాకు హక్కులు ఉన్నాయా? లేవా?

09/04/2019 - 23:04

తిరుపతి, సెప్టెంబర్ 4: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ మాయలేడి చూపుల వలలో చిక్కిన ఓ వ్యక్తిని తన అనుచరులతో కలిసి నిలువు దోపిడీ చేసేసింది. ఒంటిపైన బట్టలు తప్ప మరేమి మిగలని ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెడితే కడప జిల్లా రాయచోటికి చెందిన రవి శ్రీవారి దర్శనార్థం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో అతని పక్కనే ఉన్న ఓ మహిళను చూసి సర్వం మరచిపోయాడు.

09/04/2019 - 04:56

సింహాద్రిపురం, సెప్టెంబర్ 3: మాజీమంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీనివాసులరెడ్డి (52) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వివేకా హత్య కేసులో సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామానికి చెందిన కె.శ్రీనివాసులరెడ్డిని ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

09/04/2019 - 04:47

వేములవాడ, సెప్టెంబర్ 3: ఏసీబీ వలలో అవినీతి ఉద్యోగులు ఇద్దరు చిక్కారు. న్యాయంగా తనకు రావాల్సిన క్వాంటం పెన్షన్ ఇవ్వడానికి సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగి ఒకరు 15 వేల రూపాయల లంచం ఇస్తేనే ఫైలు కదులుతుందని తెగేసి చెప్పడంతో చేసేది లేక పెన్షన్‌దారు మనవడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ ఆధికారులు ఇచ్చిన 10 వేల రూపాయలు లంచంగా తీసుకుంటూ మంగళవారం ఇద్దరు ఉద్యోగులు పట్టుబడ్డారు.

09/04/2019 - 04:32

వెంకటాపురం (రామప్ప), సెప్టెంబర్ 3: కన్నకొడుకే కాలయముడై తాగిన మైకంలో విచక్షణ రహితంగా కర్రతో దాడి చేసి తల్లిని దారుణంగా హత్యచేసిన సంఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. తాళ్లపాడుకు చెందిన గురుమూర్తి తన మొదటి భార్య రాజేశ్వరికి పిల్లలు కలగకపోవడంతో శాయంపేటకు చెందిన సుశీలను రెండవ వివాహం చేసుకున్నాడు. సుశీలకు వేణు, సింధూజ జన్మించారు. వేణు మద్యానికి బానిసై తరచూ తల్లిదండ్రులతో గొడవపడే వాడు.

09/04/2019 - 04:16

ఖమ్మం, సెప్టెంబర్ 3: లండన్‌లో 12 రోజుల క్రితం గల్లంతయిన ఖమ్మం విద్యార్థి శ్రీహర్ష(21) మృతదేహం లభ్యమైంది. శ్రీహర్ష తండ్రి ఉదయ్‌ప్రతాప్ ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్ళిన శ్రీహర్ష గత నెల 23వ తేదీన అదృశ్యమవ్వగా లండన్‌లోని బీచ్ దగ్గర శ్రీహర్ష సెల్‌ఫోన్, బ్యాగ్, ల్యాప్‌టాప్‌ను పోలీసులు గుర్తించారు.

09/04/2019 - 01:54

మచిలీపట్నం, సెప్టెంబర్ 3: నకిలీ బంగారాన్ని అసలు బంగారం అంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి మంగళవారం స్థానిక సీసీఎస్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మీడియా ముందు హాజరు పరిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్‌ఛార్జి డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలియజేశారు.

Pages