S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/31/2019 - 00:19

భువనగిరి, ఆగస్టు 30: నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న భువనగిరి పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది గొలనుకొండ లింగయ్య కూతురు కీర్తన (17) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లుగా స్థానికులు తెలిపారు.

08/31/2019 - 00:18

రామన్నపేట, ఆగస్టు 30: ఆకతాయి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దుబ్బాక గ్రామంలో చోటుచేసుకుంది. మృతురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాధు వివరాల ప్రకారం మండలంలోని దుబ్బాక గ్రామానికి చెందిన ఇట్టె మహిపాల్‌రెడ్డికి నార్కట్‌పల్లి మండలం నెమ్మానీ గ్రామానికి చెందిన శృతితో గత మే 15న వివాహం జరిగింది. వివాహం అనంతరం ఇద్దరు దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు.

08/31/2019 - 00:17

సంస్థాన్‌నారాయణపురం, ఆగస్టు 30: యువకుడి వేధింపులకు ఒక విద్యార్థిని బలైంది. అతడు తరచూ సూటీపోటీ మాటలతో వేధించడం, అసభ్యకరంగా ఫోన్ మెసేజీలు పెట్టడంతో అవమానం భరించలేక గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రంలో జరిగింది.

08/31/2019 - 00:10

ఖమ్మం, ఆగస్టు 30: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిపై వారెంట్ జారీ అయ్యింది. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వైరా టిక్కెట్‌ను తన భర్త డాక్టర్ రాంజీకి ఇప్పిస్తానని మోసం చేశారంటూ రాంజీ భార్య కళావతి కేసు వేసింది. దీనిని కొంత కాలంగా విచారిస్తున్న ఖమ్మం రెండవ అదనపు సివిల్ జడ్జి జయమ్మ సెప్టెంబర్ 26వ తేదిన రేణుకాచౌదరి తప్పనిసరిగా హజరుకావాలని వారెంట్ జారీ చేశారు.

08/31/2019 - 00:06

న్యూఢిల్లీ, ఆగస్టు 30: భూపాలపల్లి జిల్లా కాకతీయ గనిలో మైనింగ్ కార్యకలాపాల మూలంగా పరిసర ప్రాం తాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇబ్బందులు పడుకుండా చూడాలని సింగరేణి కాలరీస్ యాజమాన్యానికి సుప్రీం కోర్టు సూచించింది. ఈ కేసును సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసిన కోర్టు, ప్రజా సమస్యలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. నివాస ప్రాంతాలకు 150 మీటర్లలోపు మైనింగ్

08/30/2019 - 23:53

న్యూఢిల్లీ, ఆగస్టు 30: అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదాస్పద స్థలం కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలలో అలహాబాద్ హైకోర్టు తనకు కేటాయించిన మూడో వంతు వాటాను రామమందిర నిర్మాణం కోసం హిందువులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని షియా వక్ఫ్ బోర్డు శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

08/30/2019 - 23:40

న్యూఢిల్లీ, ఆగస్టు 30: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు స్వామి చిన్మయానంద్ తనను వేధించారని ఆరోపించిన తరువాత అదృశ్యమయి, రాజస్థాన్‌లో ఉన్న ట్టు తేలిన న్యాయశాస్త్ర విద్యార్థినిని ఈ రోజే తన ముందు హాజరు పరచాల్సిందిగా సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

08/30/2019 - 23:09

ఖమ్మం, ఆగస్టు 30: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిపై వారెంట్ జారీ అయ్యింది. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున వైరా టిక్కెట్‌ను తన భర్త డాక్టర్ రాంజీకి ఇప్పిస్తానని మోసం చేశారంటూ రాంజీ భార్య కళావతి కేసు వేసింది. దీనిని కొంత కాలంగా విచారిస్తున్న ఖమ్మం రెండవ అదనపు సివిల్ జడ్జి జయమ్మ సెప్టెంబర్ 26వ తేదిన రేణుకాచౌదరి తప్పనిసరిగా హాజరుకావాలని వారెంట్ జారీ చేశారు.

08/30/2019 - 23:05

పెదవేగి, ఆగస్టు 30: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్‌పై పెదవేగి పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదయ్యింది.

08/30/2019 - 22:48

హైదరాబాద్, ఆగస్టు 30: మహానగరంలో రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టి, వాతావరణాన్ని మరింత పచ్చదనంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని శుక్రవారం హైకోర్టు ఆవరణలో నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ హాజరైన ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.

Pages