S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/12/2018 - 23:46

గొలుగొండ, అక్టోబర్ 12: ఆర్టీసి బస్సు ఢీ కొని వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. మండంలోని చీడిగుమ్మల గ్రామంలో పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న వ్యక్తిని ఏలేశ్వరం నుంచి నర్సీపట్నం వెళ్తున్న బస్సు ఢీ కొన్న సంఘటనలో కిల్లాడ ముసిలి(70)కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిని ముసిలిని 108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి వైద్య సేవల నిమిత్తం తరలించారు.

10/12/2018 - 23:42

* అదుపులో ఉన్న వారిలో ముగ్గురు మైనర్ బాలికలు
* అడ్డుకున్న గిరిజనులు-చితకబాదిన పోలీసులు
* గాలిలోకి కాల్పులు
-----------------------------------------------------------------------------

10/12/2018 - 23:36

* వరుస హత్యలు..దోపిడీలు
* అంతర్రాష్ట్ర ముఠాల స్వైర విహారం
* పోలీసుల నిఘా లోపం
* తప్పించుకుంటున్న అసలు దొంగలు
============================

10/12/2018 - 23:22

* వ్యాపార లావాదేవీల్లో విబేధాలే కారణం
* రూ.8లక్షల సుపారీ ఇచ్చిన ప్రధాన నిందితుడు శోభన్‌కుమార్
* కథ నడిపించిన బేల్దారి మేస్ర్తి భూపతి
* నగరంలో సంచలనం రేపిన హత్య కేసును చేధించిన పోలీసులు
==============================================

10/12/2018 - 23:10

వై రామవరం, అక్టోబర్ 12: వై రామవరం మండల సరిహద్దు ప్రాంత లోతట్టు గ్రామాల్లో శుక్రవారం అడ్డతీగల సీఐ ఎ మరళీకృష్ణ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారం మేరకు మండలంలోని చింతకర్రపాలెం, జాజిగడ్డ, శింగవరం, జంగాలతోట గ్రామాల ప్రధాన రహదారిలో సిఆర్పీఎఫ్ ఎఫ్42 బెటాలియన్ పోలీసు బలగాల సహాయంతో అనుమాస్పద ప్రదేశాల్లో తనికీలు నిర్వహించారు.

10/12/2018 - 23:08

అల్లవరం, అక్టోబర్ 12: అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి ఉప్పులూరి కిశోర్‌కుమార్ (25) శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు. ఇందుకు సంబంధించి అల్లవరం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం తోగమ్మి గ్రామానికి చెందిన కిశోర్‌కుమార్ ఫైనల్ బీటెక్ చదువుతున్నాడు.

10/12/2018 - 23:04

* ఠాగూర్ సినిమా తరహాలో డ్రామాలాడిన ప్రభుత్వవైద్యులు
* మృతదేహంతో జాతీయరహదారిపై ప్రజాసంఘాల ఆందోళన
* డీసీహెచ్‌ఎస్, ఎమ్మెల్యే, సీఐల విచారణకు ఆదేశం
* న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే, డీసీహెచ్‌ఎస్
====================================

10/12/2018 - 23:03

తిరుపతి, అక్టోబర్ 12: స్థానిక రైల్వే కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆరు మంది విద్యార్థులు గురువారం నుంచి కనిపించకపోవడం తిరుపతిలో సంచలనంగా మారింది. వారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నా శనివారం రాత్రి వరకు వారి ఆచూకీ తెలియలేదు. విద్యార్థుల కోసం తిరుపతి ఈస్ట్ పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించినా ఫలితం లేకుండా పోయింది.

10/12/2018 - 22:18

నందిపేట, అక్టోబర్ 12: నందిపేట మండల విద్యా వనరుల కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న బొడ్డు ఈశ్వర్(32)అనే వ్యక్తి రాత్రి విధులు నిర్వర్తిస్తూ కార్యాలయంలో గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందాడు.

10/12/2018 - 22:11

కోడుమూరు, అక్టోబర్ 12:మండల పరిధిలోని వర్కూరు గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఉల్లి రైతు బోయ చిన్న రాముడు(59) గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు.. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చిన్న రాముడు గత మూడేళ్లుగా పంటలు సాగు చేసినా ఆశించిన దిగుబడులు రాలేదు. ప్రతి ఏటా ఉల్లి పంట సాగు చేస్తూ నష్టపోయిన రాముడు ఈ ఏడాది కూడా ఉల్లికి గిట్టుబాటు ధర లేక కుంగిపోయాడు.

Pages