S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

04/29/2018 - 02:51

వాంకిడి, ఎప్రిల్ 28: ఆర్‌టిఏ చెక్‌పోస్టు వద్ద శనివారం ఉదయం వెనుక నుండి వచ్చిన లారీ బలంగా ఢీకొనడం తో కారు ముందు ఆగి ఉన్న లారీలో ఇరుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న బెల్గంవార్ రాములు (60) అక్కడిక్కడే మృతి చెందగా అందులో ప్ర యాణిస్తున్న ఐదుగురుకి తీవ్ర యాగాలైనాయి. వాంకిడి ఎస్‌ఐ రా జు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

04/29/2018 - 02:43

రామచంద్రాపురం, ఏప్రిల్ 28: పట్టపగలే ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడిన సంఘటన రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రామచంద్రాపురం భెల్ హెచ్ ఐజీ కాలనీలో క్వార్టర్ నెంబర్ 297లో ఎమ్‌ఎస్ పెరారీ గత 15 ఏళ్లుగా నివాసముంటున్నాడు. అయితే ఇటీవల బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో బ్యాంకు లాకర్‌లో ఉన్న బం గారాన్ని ఇంటికి తీసుకొచ్చారు.

04/29/2018 - 02:36

కోస్గి, ఏప్రిల్ 28: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా వాగు నుంచి ఇసుక రవాణా చేసి ఓ వ్యవసాయ పొలంలో డంప్ చేసి రాత్రివేళల్లో పలువురు స్థానిక అధికారుల అండదండలతో లారీలలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం ఆనోటా ఈనోటా జిల్లా అధికారుల దృష్టికి వెళ్లింది.

04/29/2018 - 02:33

ఆర్మూర్, ఏప్రిల్ 28: ఆర్మూర్, మెట్‌పల్లి, నిర్మల్, భైంసా, జగిత్యాల తదితర ప్రాంతాల వ్యాపారులను మోసం చేసి బంగారంతో పరారైన బెంగాలి వర్కర్ భూపాల్ పట్టుబడ్డాడు. ఆర్మూర్ నుంచి పరారైన రెండు రోజులకే భూపాల్‌ను పట్టుకోవడంలో పోలీసులు సఫిలీకృతమయ్యారు.

04/29/2018 - 02:26

నిడమనూర్, ఏప్రిల్ 28:మండల పరిధి మారుపాక శివారు వెంకటపురం గ్రామంలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు, పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిట్టిమల్ల శంకర్ (29) గ్రామంలోని ఒక రైతు వద్ద మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకోని పత్తిపంటను సాగు చేయడం జరిగింది.

04/29/2018 - 02:21

పెద్దఅడిశర్లపల్లి, ఏప్రిల్ 28: మండలంలోని గుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ జూలకంటి సంతోష్‌రెడ్డి మనస్థాపంతో స్టేషన్‌లోనే లెటర్ వదిలి అదృశ్యమయ్యాడు. గుడిపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సంతోష్‌రెడ్డి విధుల అనంతరం శనివారం ఉదయం స్టేషన్‌లో లెటర్ రాసి వెళ్లాడు.

04/29/2018 - 02:03

పిడుగురాళ్ల, ఏప్రిల్ 28: ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన పిడుగురాళ్ల మండలం, జానపాడు గ్రామ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళితే..

04/29/2018 - 01:59

పెదనందిపాడు, ఏప్రిల్ 28: మండల పరిధిలోని రావిపాడులో ఉత్సవమూర్తుల విగ్రహాలు శుక్రవారం అపహరణకు గురయ్యాయి. పడమట రామాలయంలో గల సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివార్ల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. దాదాపు ఈ విగ్రహాల విలువ 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఓ ప్రవాస భారతీయుడు విరాళంగా ఈ విగ్రహాలను అందజేశారు. చోరీ విషయం తెలియడంతో ఎస్‌ఐ రామాంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

04/29/2018 - 01:44

అవుకు, ఏప్రిల్ 28:మండల పరిధిలోని చెర్లోపల్లె గ్రామం సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో తండ్రి, కుమారుడు దుర్మరణం చెందగా మరో బాలిక తీవ్రంగా గాయపడింది. స్థానికులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. చెర్లోపల్లె గ్రామానికి చెందిన నంబి ఓబులేసు తన కుమారుడితో పాటు బంధువుల పిల్లలకు ఈత నేర్పించేందుకు అవుకు రిజర్వాయర్ వద్దకు వెళ్లాడు.

04/29/2018 - 01:26

నాగలాపురం, ఏప్రిల్ 28: అడవిపందులను అంతం చేయడానికి ఏర్పాటు చేసిన పేలుడు పదార్థాలు పేలడంతో ఇద్దరు ఉపాధి కూలీలు గాయపడిన సంఘటన శనివారం నాగలాపురం మండలం వెళ్లూరు గ్రామంలో జరిగింది. ఉపాధి కూలీల కథనం మేరకు వెళ్లూరు గ్రామ పంచాయతీకి చెందిన సుమారు 170మంది ఉపాధి కూలీలు వెళ్లూరు గ్రామ పరిధిలోని పరిగుంట వద్ద పంటకాలువ గుంతలు తీస్తున్న సమయంలో భూమిలో ఉన్న పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలాయి.

Pages