S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/09/2018 - 05:24

చండూరు, జూన్ 8: దివంగత మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ప్రథమ వర్ధంతి, విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నేడు శనివారం నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి పాల్వాయి స్రవంతిరెడ్డి తెలిపారు.

06/09/2018 - 05:23

హైదరాబాద్, జూన్ 8: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సైతం జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలకు, రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షలకు విద్యార్థులకు తర్ఫీదు ఇస్తామని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ చెప్పారు. ఈ విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తామని, ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

06/08/2018 - 05:06

హైదరాబాద్, జూన్ 7: రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకు అవకాశం ఇస్తూ ఇప్పటివరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని జూన్ 15 వరకు తొలగించడంతో బదిలీల ప్రక్రియ ఊపందుకుంది. బదిలీల ప్రక్రియ 2018 మే 25 న ప్రారంభమై జూన్ 15 వరకు కొనసాగించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.

06/08/2018 - 05:05

హైదరాబాద్, జూన్ 7: పోలీసు శాఖలో ఏకీకృత సేవలను అందించడంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో కీలక పాత్ర వహిస్తోందని డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి అన్నారు. ప్రజలతో స్నేహపూర్వక పోలీసింగ్ విధానాలు కలిగి ఉండేందుకు పోలీసు సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం చాలా అవసరమని, ఇవన్నీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా సాధ్యపడతాయని ఆయన తెలిపారు.

06/08/2018 - 05:03

హైదరాబాద్, జూన్ 7: వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం విప్లవం సృష్టిస్తోందని తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉత్తరాఖండ్ వ్యవసాయ మంత్రి శుభోద్ ఉనియాల్ గురువారం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తెలంగాణ సేంద్రియ విత్తన ధృవీకరణ ఏజెన్సీ కార్యాలయంలో (హాకాభవన్) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయం, అనుబంధ రంగాలపై దృష్టి సారించామన్నారు.

06/08/2018 - 05:02

హైదరాబాద్, జూన్ 7: పోలీస్ శాఖలో అవినీతి పరులను సహించకూడదని భావించిన డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టారు. నెల మామూళ్లు వసూళ్లు, నేరస్తులతో రాజీపడి సొమ్ము చేసుకుంటున్న క్షేత్ర స్థాయి ప్రత్యేక బృందాల సిబ్బంది అవినీతిపై స్పష్టమైన సమాచారాన్ని డీజీపీ సేకరించుకున్న అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు.

06/08/2018 - 05:01

హైదరాబాద్, జూన్ 7: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని, యువత స్వశక్తితో ముందుకు సాగాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. గురువారం సచివాలయంలో స్టాండ్ అప్ ఇండియా, ముద్ర, బీసీ రుణాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాలు ఉన్నత లక్ష్యంతో రూపొందిస్తున్న పథకాల అమలులో బ్యాంకుల తీరుతో ఇబ్బందులు తలెత్తడం విచారకరమని అన్నారు.

06/08/2018 - 04:59

హైదరాబాద్, జూన్ 7: తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీల అసలు కథ శుక్రవారం ప్రారంభం అయ్యింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులతోనూ, అధికారులను సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బదిలీలకు ప్రత్యేక పోర్టల్ ‘ట్రాన్స్‌ఫర్సు డాట్ సిడిఎస్‌ఇ డాట్ తెలంగాణ డాట్ జీవోవీ డాట్ ఇన్ ’ను ప్రారంభించారు.

06/08/2018 - 04:58

నల్లగొండ, జూన్ 7: సీఎం కేసీఆర్ మరోసారి పార్టీ ఎమ్మెల్యేల పనితీరు.. వారికి లభిస్తున్న ప్రజాదరణపై జరిపించిన సర్వే టీఆర్‌ఎస్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సర్వే లో టీఆర్‌ఎస్‌కు చెందిన 95మంది ఎమ్మెల్యేల్లో 35మంది ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేదని తేలినట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

06/08/2018 - 04:57

హైదరాబాద్, జూన్ 7: నకిలీ స్పోర్ట్స్ సర్ట్ఫికెట్లతో మెడికల్ సీట్లను లక్షల్లో అమ్ముకున్న కేసులో ఏసీబీ అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. అక్రమంగా 12 మంది నకిలీ సర్ట్ఫికెట్లతో మెడికల్ సీట్లు పొందిన సంగతి వెల్లడి కావడంతో అసలు సిసలు స్పోర్ట్స్ కోటాలో సీట్లకు అర్హులైన విద్యార్థులు చాలామంది ముందుకు వస్తున్నారు.

Pages