S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

10/14/2017 - 17:51

మనం ఇంతవరకూ చూడని, మనకు తెలియని కొత్త జీవజాతులతో కూడిన ప్రపంచం అంటార్కిటికా మంచు ఫలకాల కింద ఉండి ఉండవచ్చునని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. మొక్కలు, ఉభయచర జీవులు, జలచరాలు, జంతువులకు చెందిన వినూతన, విభిన్న జీవజాతులకు మనుగడ సాగిస్తుండవచ్చునని వారు అంచనా వేస్తున్నారు.

10/14/2017 - 17:46

పసిఫిక్ సముద్రం చుట్టూ గుర్రపు నాడా ఆకారంలో విస్తరించి ఉన్న అగ్నిపర్వతాల ప్రాంతం. ప్రపంచంలోని అగ్నిపర్వతాల్లో 75 శాతం ఈ దేశాల పరిథిలోనే ఉన్నాయి. దాదాపు 40 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో, దాదాపూ 450 పైగా అగ్నిపర్వతాలు ఇక్కడే ఉన్నాయి. వీటిలో చాలావరకు యాక్టివ్‌గా ఉండటం విశేషం. కొన్ని పూర్తిగా నిర్వీర్యమైనవి, మరికొన్ని స్తబ్దతతో ఉన్నవి కూడా ఉన్నాయి. జపాన్‌లోని ఫ్యుజి అగ్నిపర్వతం అతి ఎతె్తైనది.

10/14/2017 - 17:45

మెదడు, హృదయంపై ఒత్తిడి తగ్గడానికి ఏడుపు మంచి మార్గం. బాలానాం రోదనం బలం అంటారు. అంటే చిన్నపిల్లలు ఏడిస్తే మంచిది అని. నిజానికి ఎవరు ఏడ్చినా మంచిదే. మనకు తెలియని ఒత్తిడి నుంచి ఏడుపు మనల్ని పడేస్తుంది. అంటే ఏడుపు ఆరోగ్యానికి ఆయుధం. మగవారికన్నా మహిళలు ఎక్కువగా ఏడుస్తారు. వారిలో మగవారికన్నా ఎక్కువగా ఉండే ప్రొలాక్టిన్ అనే ప్రొటీన్ అందుకు కారణం.

10/14/2017 - 17:41

హార్స్ షూ క్రాబ్ అని పిలిచే ఉభయచరం నిజానికి పీత కాదు. పీతలతో కన్నా సాలీళ్లు, తేళ్లతో వీటికి దగ్గర పోలికలు ఉంటాయి. ఇది గుర్రపు నాడా ఆకారంలో ఉండటం వల్ల అలా పిలుస్తారు. బాహ్య అస్తిపంజరం పైన ఐదు, దిగువ రెండు కళ్లున్న ఈ ‘క్రాబ్’ జోడీని వెదుక్కోవడానికి, సముద్రంపై ప్రయాణం ఏ దిశగా చేయాలన్న విషయాన్ని గ్రహించడానికి ఎక్కువగా ఉపయోగిస్తాయి.

10/02/2017 - 23:03

థాయ్‌లాండ్‌లో ఏటా సెప్టెంబర్‌లో పక్షుల పండుగ నిర్వహిస్తారు. వేలాది పక్షులను పంజరాల్లో ఉంచి అక్కడ ప్రదర్శిస్తారు. ఈసారి దాదాపు 1400 రకాల పక్షులు కనువిందు చేశాయి. వరుసగా పోల్స్‌పాతి వాటికి పంజరాలను అమర్చి ఈ వేడక నిర్వహిస్తారు. ఈ దృశ్యం కనువిందు చేస్తుంది. థాయ్‌లాండ్‌లో ఇది పెద్ద పర్యాటక ఆకర్షణ.

10/02/2017 - 22:47

అందంగా, ఒత్తుగా పెరిగే బొచ్చు దీని ప్రాణాలకు ప్రమాదం తెస్తోంది. క్యాట్ ఫామిలీకి చెందిన ‘లిన్స్’ మిగతా పిల్లులకు భిన్నంగా బాగా దట్టంగా ఉన్న బొచ్చుతో బలిష్టంగా కనిపిస్తాయి. వీటి పాదాలు మిగతా పిల్లులకన్నా భిన్నంగా ఉండటం వల్ల అవి మంచులో కూరుకుపోకుండా నడవగలుగుతాయి. ఫ్యాషన్ రంగంలో వీటి బొచ్చుతో చేసిన వస్తువులకు విపరీతమైన క్రేజ్ ఉండటం వల్ల వేటకు గురవుతున్నాయి.

10/02/2017 - 22:45

ఎండిపోయి విరిగిన కొమ్మలా ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఓ పక్షి. వీటిని ఫ్రాగ్‌వౌత్ పక్షులుగా పిలుస్తారు. వాటినోరు కప్పనోటిలా ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది. చెట్ల బెరడు రంగులా వాటి వాటి ఈకలు బూడిద, గోధుమ రంగులో ఉంటాయి. చూడటానికి గుడ్లగూబల్లా ఉన్నప్పటికీ వాటితో వీటికి సంబంధం లేదు. తావీ ఫ్రాగ్‌వౌత్ పక్షులైతే ఎండిన చెట్ల బెరడు రంగులో విరిగిన కొమ్మల్లో కలసిపోయి ఉంటాయి. చూసి వెంటనే పోల్చుకోవడం కష్టం.

10/02/2017 - 22:43

టమోటా పండ్లలా ఎర్రగా, ఉబ్బిన పొట్టతో గుడ్రంగా కనిపించడం వల్ల ఈ కప్పలను టమోటా ఫ్రాగ్స్ అని పిలుస్తారు. మడగాస్కర్ దీవుల్లో మాత్రమే ఇవి కనిపిస్తాయి. సాధారణంగా పసుపు, ఎరుపు, ముదురు ఎరుపు రంగుల్లో ఇవి ఉంటాయి. రంగుల్లో మెరుపును బట్టి అవి ఎదిగే వయసు వచ్చిన విషయం తెలుస్తుంది. వీటిని శత్రువులు తినడానికి ప్రయత్నించినపుడు ఇవి పొట్టను ఉబ్బరించేలా చేసి గుండ్రంగా తయారవుతాయి.

09/16/2017 - 18:01

ఆఫ్రికాలో మాత్రమే కనిపించే ఈ పాత తరం కోతులు చాలా ఆకర్షణీయమైన రంగులతో ఉంటాయి. కోతుల జాతిలో ఇవే అతిపెద్దవి. దాదాపు 32 అంగుళాల ఎత్తు పెరిగే వీటి ముఖం, పృష్ట్భాగం అందమైన ముదురువర్ణాలతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆ రంగులు ఎంత ప్రస్ఫుటంగా ఉంటే అవి జతకట్టే వయసుకు వచ్చాయని అర్థం. ఎరుపు, నీలం రంగులతో ముఖంపై చారలు, ఒతె్తైన ఆలివ్‌గ్రీన్ మెరుపుతోకూడిన బొచ్చుతో ఇవి అందంగా ఉంటాయి.

09/16/2017 - 17:52

సత్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడు. వృత్తిని దైవంగా భావించే వ్యక్తి. విద్యార్థులే అతడి లోకం. ఎప్పుడో సెలవులకు తప్ప అస్తమాను సొంత ఊరికి వెళ్లడు. గది అద్దెకు తీసుకుని ఒంటరిగా అక్కడే నివాసముంటున్నాడు. ఎనిమిదవ తరగతి చదువుతూన్న సిద్దూ అతని ప్రియ శిష్యుడు.

Pages