S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

05/18/2019 - 21:32

భద్రాద్రి రామదాసుగా పరమ భాగవోత్తమ కీర్తనాచార్య వాగ్గేయకార శిరోమణి, కంచెర్ల గోపన్న ‘బందిఖానా రామదాసు’గా తెలుగునాట సుపరిచితులైన శ్రీరామ భక్తవరేణ్యుడు. నాటి గోలకొండ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఏడవ కుతుబ్‌షాహీ రాజు, సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్ షా, తానీషాగా సుప్రసిద్ధులు.

05/18/2019 - 21:20

అది ఓ వృద్ధాశ్రమం.. ఎందరో వృద్ధులకు, వృద్ధ దంపతులకు ఆవాసమైన భవనాల సముదాయం. ఎంతో స్వచ్ఛమైన, అచ్చమైన స్వేచ్ఛాయుత జీవనం. ఇందు అరమరికలు, అతిశయాలు, ఆడంబరాలు, కుల వివక్షతలు లేని జీవనం.

05/18/2019 - 21:17

ఉమ్మడి కరీంనగర్ జిల్లా గతకీర్తికీ, ప్రాచీన చరిత్రకూ నిలువుటద్దంగా నిలిచియుంది. క్రీ.పూ. శతాబ్దాల క్రితమే ఆంధ్ర రాజ్యం శాతవాహనుల ఏలుబడిలోవర్థిల్లగా, వారి అభిమాన పాత్రమైన బౌద్ధమతం, ఈప్రాంత ప్రజల ఆరాధ్యమతమై విరాజిల్లింది. ఇక్కడి ప్రాచీనమైన ప్రతి గ్రామం పేరులో, ప్రతి నిర్మాణ కౌశలంలో, ప్రతి కట్టడంలో, వస్తువుల్లో, మట్టిపాత్రల్లో, మతంతో పెన వేసుకున్న చరిత్ర పలుకుతుంది.

05/18/2019 - 21:11

మనుష్యులలో రకరకాల మనుష్యులు ఉన్నట్లే అంకెలలో రకరకాల అంకెలు ఉన్నాయి. ఈ రకాలని, వీటి పేర్లని ఇప్పుడు కొంచెం పరిశీలిద్దాం.

05/18/2019 - 20:21

భూమిని ఎవరైనా
పట్టుకొని ఊపండి.
అగ్నిపర్వతాల్లో
బుసలు కొట్టే లావా బయటపడుతుంది.

భూమిని ఎవరైనా
గాలిలా నిమిరి ఓదార్చండి
సముద్రాలు
కన్నీళ్లుగా మారి వర్షిస్తాయి.

భూగోళం
వొఠ్ఠి జాగ్రఫీ కాదు,
వినగలిగితే
జీవచలన సంగీతం వినిపిస్తుంది.

05/18/2019 - 20:00

వర్ణ సమ్మేళనాలతో
ఇంద్రధనుస్సునే వెక్కిరిస్తూ..
గిలిగింతలు పెడుతుంది!
ఏ పువ్వుమీదా
కుదురుగా..
కూర్చోలేని చంచల స్వభావం దాని సొంతం!
మనిషిలోని
భావుకతనీ.. సృజననీ
ఉత్తేజపరుస్తూ..
అద్భుత ఆవిష్కరణలకు
చేస్తుంది అంకురార్పణం!
కళ్లను ఇట్టే
కట్టిపడేసే...
రంగురంగుల రెక్కలతో కూడిన..
దాని మోహన రూపం..
చూసిన కొద్దీ

05/18/2019 - 19:59

కవితనల్లుతా!
తెలుగు వెలుగును జాభిల్లిలా
ఇల్లిల్లూ నింపుతా
పెద్దబాలశిక్షను
నేటి పెద్దలకూ నేర్పుతా
పెద్ద పుస్తకాల బరువును
పిల్లల భుజాలకు తగ్గిస్తా
చదువంటే ఏమిటో
చవి చూపిస్తా
బద్దకం వదిలిస్తా
బుద్ధొచ్చేలా చేసి
మంచిని పెంచుతా
మానవత్వాన్ని
ప్రతి మనిషిలో నింపుతా
నవచైతన్యంతో
ప్రతిధ్వనిస్తా

05/18/2019 - 19:47

కొత్త ఆలోచనలు అందరికీ వస్తాయి.
భావాలూ అంతే!
కల్పనా శక్తి అందరికీ వుంటుంది.
ప్రణాళికలు చాలామంది రచిస్తారు.
నూతన సంవత్సరం రాగానే ఎన్నో పనులు చేయాలని అనుకుంటాం.
మనమే కాదు.
ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోని ప్రతి మనిషి ఇదే విధంగా ఆలోచిస్తాడు.
దాదాపు అందరి ఆలోచనలు ఒకే విధంగా వుంటాయి. వాటిలో కొన్ని ఈ మాదిరిగా వుంటాయి.

05/11/2019 - 22:20

శ్రీమతి కోన మృదుల ప్రఖ్యాత కూచిపూడి గురువు, జానపద కళాకారిణి. ఆమె గృహిణిగా, ఎన్నో వ్యక్తిగత బాధ్యతలు ఒకవైపు నిర్వహిస్తూ, మరొకవైపు ఎన్నో సంవత్సరాలుగా నృత్యం నేర్పిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆమె నటరాజ నృత్య కళానికేతన్ 2003లో స్థాపించి, కూచిపూడి, జానపద నృత్యం నేర్పిస్తున్ఘ్నారు. కళాసేవలో భాగంగా మాట్లాడలేని పిల్లలకు కూడా నృత్యం నేర్పిస్తున్నారు.

05/11/2019 - 20:31

చిత్రకళ గూర్చి తెలుసుకోవడానికి, అధ్యయనం చేయడానికి చాలామంది యువకులు చిత్రకళను నేర్పించే కళాశాలలకు వెళతారు. చిత్రకారుడు బాలభక్తరాజు ఇందుకు పూర్తి భిన్నం. ఈ ఒక్క విషయంతో ఆయన ‘విశిష్టత’ ఏమిటో తేటతెల్లమవుతుంది. ఆయన పేరులోనూ విశేషణముంది. ఈ విశిష్టత.. విశేషణాల కలగలుపు ఆయన గీసిన వర్ణచిత్రాలు.

Pages