S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

05/04/2019 - 22:26

భారతీయ కళలు భగవంతుని పాదాలనుండి జన్మించి, తిరిగి అక్కడకే చేరుకుంటాయి. భక్తికోసం, భక్తివలన, భక్తినుండి జన్మించి, ప్రచారం పొంది, తిరిగి భగవంతుని పాద పద్మములు చేరటం- ఇది ఒక పవిత్ర వలయం. భక్తి మాత్రమే భారతీయ కళల పథము, గమ్యము!

05/04/2019 - 22:07

మనం ప్రతి విషయంలో కృతజ్ఞతతో ఉండాలి. ఇది చెప్పడం సులువుగా అన్పిస్తుంది. కానీ అమలు చేయడం కష్టం. కానీ తప్పదు. మనం కృతజ్ఞతతో వుంటే కృతజ్ఞత చెప్పాల్సిన విషయాలు మనకి ఎన్నో కన్పిస్తాయి.
ఉదయం లేస్తాం. లేవగానే ఆ కొత్తరోజు మన జీవితంలోకి వచ్చిందని భగవంతునికి కృతజ్ఞత చెప్పవచ్చు. భగవంతుడు మన నుంచి కృతజ్ఞతను కోరుకోడు. కానీ కృతజ్ఞత చెప్పడం మన ధర్మం.

05/04/2019 - 18:47

రాయిని చెక్కితే శిల్పం (స్కల్‌ప్చర్) అనేది ఒకప్పటి భావన. శిల్పానికి కాదేదీ అనర్హమంటున్నారు ఆధునిక శిల్పులు. తుక్కు (స్క్రాప్) సైతం చక్కని శిల్పానికి ఆధారమవుతోంది. అంతేనా? కాదు.. కలప, సిమెంట్, ఫైబర్ గ్లాస్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఫ్లైయాష్.. ఇట్లా ఒకటేమిటి ఎన్నో వస్తువులతో అపురూప శిల్పాలను తీర్చిదిద్దుతున్నారు. విచిత్రమేమిటంటే ‘కాగితం గుజ్జు’ సైతం శిల్పానికి ముడి సరకవుతోంది.

05/04/2019 - 18:39

కొత్త మాటలని పుట్టించటం అనేది నేనిప్పుడు కొత్తగా సృష్టించిన ప్రక్రియ ఏమీ కాదు. కొత్త పదాల అవసరం అలా పుట్టుకొస్తూనే ఉంటుంది. ఈ విషయం గురించి నేను ఇదివరలో - వ్యాసాలలోను, బ్లాగులలోను - ఎన్నో కోణాల నుండి చర్చించేను. ఇప్పుడు మరొక కోణం నుండి పరిశీలిద్దాం. ఉదాహరణకి ఈ దిగువ జాబితాలో తెలుగు పేర్లు చూడండి: మిరప, సపోటా, సీతాఫలం, రామాఫలం, బొప్పాయి, జామ, మొక్కజొన్న, పొగాకు, బంగాళాదుంప మొదలైనవి.

05/04/2019 - 18:36

రెండెంకలు తేలేదని
నిలదీసి చివాట్లేశాం
వాళ్లకి ఇక్కడ కంటే
పై లోకమే బెటర్
పాస్ కాలేని
జీవితం!

వోడినోడు?
వాళ్లు గెలుపునకు
కొద్దిదూరంలో ఆగారు
వోడిపోయారు
సంకల్పంలో
పడ్డవాడు
చెడ్డవాడు కాదెప్పుడూ!
*

05/04/2019 - 17:51

విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. మంచి మార్కులు సాధించగలనా? ఎలాంటి ప్రశ్నలు వస్తాయో? సరైన సమాధానాలు రాయగలనా? ఆశించిన మార్కులు రాకపోయినట్లయితే పరిస్థితి ఏమిటీ? ఇలాంటి ప్రశ్నలు మెదళ్లలో కదలాడుతుంటాయి. ప్రణాళిక ప్రకారం చదవడంతోపాటుగా చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే ఆత్మవిశ్వాసంతో ప్రపంచాన్ని జయించవచ్చు.
ఒత్తిడికి కారణం

05/04/2019 - 17:36

కంటిచూపు పోయిందని ఏడ్వటానికి
కన్నీరు రావటంలేదు
కంటిలో ఓటు వెలుగు నక్షత్రమంటూ
అమావాస్య ఆకాశాన్ని తలపిస్తున్నారు
*
గాడిద కూత మైకుల మోత
నిద్రరాని రాత్రి
రాయి విసురాలనే ఉంది కాని
ఓటు చేతిలోకిచ్చారు
*
అడుగు అడుగు ఓడిపోయానని
చెప్పకుండా-
ఓటును నా నోటికి అంటించారు
ప్రజాస్వామ్య భ్రమల సాగరంలో
బ్రతుకు కొట్టుకపోయింది

05/04/2019 - 17:12

నీ జ్ఞాపకాల్ని మోస్తూ
నీతో కలిసి తిరిగిన
ఈ ఇసుక తీరాల వెంట పొడిపొడిగా రాలిపోతున్నాను

ఈ ఇసుకలో ఈతచెట్లు ననే్న ప్రశ్నిస్తున్నాయి
నీ వెంట వెనె్నలలా నడిచే తోడేదనీ..

నీవు ఇక రాబోవు
నేను నీ జ్ఞాపకాల నుండి పోలేను.

ఆకాశం ఒడ్డున రాలిన నక్షత్రాలన్నీ నీవే
ఏరుకోడానికే యుగాలు చాలవు

05/04/2019 - 17:10

‘సాధించెనే ఓ మనసా
సమయానికి తగు మాటలాడి’
అన్నది త్యాగరాజకృతి
భక్తిరాగాల శృతి
కొందరికి మాత్రం
అర్థంకాని అపశృతి
నేటి మేటి మేధావుల
సమాజంలో సమయానికి
తగుమాటలే కాదు
తగవు మాటలలు తగని మాటలు
ముచ్చెమటలు పోయిస్తున్నయ్
సమయాన్ని సమయస్ఫూర్తిగా
సమాజ శ్రేయస్సు కోసం
మానవతావాదులు వినియోగిస్తుంటే
సంస్కార హీనులు, ద్వేషభూషణులు

04/27/2019 - 22:49

మనం ఏదన్నా పని చేద్దామని అనుకునేంతలో ఎన్నో అవాంతరాలు వస్తాయి. కొన్ని సహజంగా వచ్చేవి. మరి కొన్ని ఇతరులు సృష్టించేవి.
ఎవరైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దామని అనుకుంటే, అందులోని లోటుపాట్లు చాలా మంది చెబుతారు. అంతవరకు పర్వాలేదు. కానీ నిరుత్సాహ పరచకూడదు. ఆ పని ఎక్కువమంది చేస్తూ ఉంటారు.
ప్రతి పనిలోనూ రిస్క్ ఉంటుంది. ప్రమాదం అంచునే జీవితం ఉంటుంది.

Pages