S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

04/27/2019 - 22:35

డా.రజని మల్లాది ప్రఖ్యాత కూచిపూడి నర్తకి, గురువు, పరిశోధకురాలు. ఒకవైపు తల్లిగా, గృహిణిగా వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు దశాబ్దాలుగా కళాసేవ చేస్తున్నారు. డా.రజని మల్లాది బి.ఏ.లో ఇంకా ఎం.ఏ.లో స్వర్ణపతకం సాధించారు. నృత్య విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం నుండి. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారి యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్‌షిప్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, ఇంకా సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందారు.

04/27/2019 - 20:41

చిత్రకళా రంగంలో ‘మ్యూరల్స్’ (ఉబ్బెత్తుగా ఉండే కుడ్య చిత్రం)కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శిల్పం (స్కల్ప్చర్)కు ఇది దగ్గరగా ఉంటుంది. అలాగని పూర్తిగా శిల్పమని చెప్పలేం!

04/27/2019 - 20:34

వంకాయ వంటి కూరయు
పంకజ ముఖి సీత వంటి భార్యామణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజున్ కలడే
అంటూ ఒక కవి వంకాయని కొనియాడేడు కదా. పేర్ల మీద పిచ్చి ఉన్న నాకు వంకాయకి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలనే కుతూహలం రావటం సహజం.

04/27/2019 - 20:20

‘శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, కల్పము, నిరుక్తము’.. ఈ ఆరు షట్ శాస్త్రాలు. ఇవి అధ్యయనం చేసిన వాడే పండితుడు. షట్ శాస్త్రాలలో ‘్ఛందస్సు’ వేదాలను నడిపించేది. ‘్ఛందౌపాదౌతు వేదశ్చ’ అని శాస్త్రం. శరీరానికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలాంటివో వాఙ్మయ శరీరానికి గురు లఘువులు అలాంటివి. చాలా సందర్భాలలో ఛందో రహితమైన కావ్య శరీరం శ్వాసించదు. పాఠకులను శాసించదు.

04/27/2019 - 20:14

ఓ భరతమాతా! ఓ దివ్యచరితా!
రక్త్ధారలో నీ వొడి నుండి జారిపోతున్నారమ్మా
దేశ రక్షణా యజ్ఞంలో ఆజ్యమవుతున్నారమ్మా
వసివాడని పసిబిడ్డల నొదలి
పడతుల సిందూరం తుడిచి
ముదుసలి జననీ జనకుల నొదలి
ముద్దులొలికే చెల్లెళ్ల నొదలి
నాన్నకు ననె్నప్పుడు చూపిస్తుందా..
అని తహతహలాడే గర్భస్థ శిశువల నొదలి
జారిపోతున్నారమ్మా
నీ వొడి నుండి జారిపోతున్నారు

04/27/2019 - 19:55

వానలు కురిసినపుడు
నెత్తి మీద మెత్తగా స్పర్శించాడు
శీతాకాలం
చలి బనీను మీద వెచ్చగా వెలిగాడు
వేసవి రాగానే మాత్రం
గుబురుగడ్డం రౌడీలా జనం మీద పడ్డాడు!

04/27/2019 - 19:53

ఏమిటా గోల
ఏముందీ తెలుగోడి గోల
తెలుగులో మాట్లాడితే చిన్నతనం
ఇంగ్లీషులో ఇకిలిస్తే పెద్దతనం
మనకెందుకులే అనుకోవడం సోమరితనం
నిన్నూ నీ భాషను ఉద్ధరించుకోవడం మగతనం
ఈనాడు ఎవడిక్కావాలి ఇతిహాసం
సినిమాలూ, టీవీలతోనే మందహాసం
చాదస్తాన్నీ ఛందస్సునూ వదలి
వచనాల్లో వర్ణించడం, వల్లించడం
అందరికీ సులభంగా జీర్ణించడం
ఇదే అందరినీ ఆకర్షించడం

04/20/2019 - 20:23

కోలోగ్రఫీ ప్రక్రియలో శ్రీకాంత్ ఆనంద్ ఎంత ప్రసిద్ధి చెందారో ‘వుడ్‌కట్’ ప్రక్రియలో ఎం.బాలరాజ్ అంతకన్నా ఎక్కువ ప్రశంసలందుకున్నారు. ఆయన ‘ప్రింట్’ చేసిన చిత్రాలు ప్రపంచ ప్రముఖుల మన్ననలు అందుకున్నాయి. విచిత్రమేమిటంటే హైదరాబాద్ నగరానికి చెందిన ఎం.బాలరాజ్ ఎక్కడా చదువుకోలేదు. ఏ కోర్సూ చేయలేదు. ఏకలవ్యుడిగా ఆ ‘విద్య’ను కళను ఆరాధించి, ఔపోసన పట్టారు.

04/20/2019 - 20:21

హైదరాబాద్ మాదాపూర్‌లోని ‘శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ తొలి బ్యాచ్ విద్యార్థి శ్రీకాంత్ ఆనంద్. 1992 నుంచి ఐదు సంవత్సరాల పాటు ఆయన చిత్రకళా రంగంలోని వివిధ పార్శ్వాలలో అక్కడ శిక్షణ పొందారు. లైఫ్ స్టడీ, ఆబ్జెక్టివ్ డ్రాయింగ్, లైన్.. షేడింగ్ అన్నీ అధ్యయనం చేసినప్పటికీ ‘అప్లైడ్ ఆర్ట్స్’పై తన దృష్టిని కేంద్రీకరించారు. ఇందులో వ్యాపారాత్మక అంశం బలంగా ఉంటుంది.

04/20/2019 - 20:16

ఇంగ్లీషులో domain knowledge అనే ఫదబంధం ఉంది. దీనిని ప్రస్తుతానికి ప్రాదేశిక జ్ఞానం అని అందం.
ఉదాహరణకి, మనం గణితం గురించి తెలుగులో రాస్తున్నామనుకుందాం. గణితంలో పాండిత్యం లేకుండా గణితం గురించి తెలుగులోనే కాదు, ఏ భాషలోనూ రాయలేము. ఈ సందర్భంలో గణితంలో ఉన్న జ్ఞానాన్ని ప్రాదేశిక జ్ఞానం అంటారు. ఇదే విధంగా వ్యాకరణం గురించి తెలియకుండా వ్యాకరణం గురించి రాయలేము.

Pages