S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

AADIVAVRAM - Others

03/30/2019 - 20:22

కళలకు కాణాచిగా వున్న తెలంగాణలో చిత్రకళ వేలరేకుల పుష్పంగా వికసిస్తోంది. వివిధ సామాజిక వర్గాల నుంచి వస్తోన్న చిత్రకారులు తమ నేపథ్యంలో, దృక్కోణంలో చిత్రాలు గీస్తూ ఉండటంతో ఈ వైవిధ్యం విప్పారుతోంది. కొత్త సబ్జెక్ట్‌తో పాటు కొత్త శైలి ఉబికివస్తోంది. ఈ విస్తృత విశాల వైవిధ్యమే తెలంగాణ చిత్రకళను సుసంపన్నం చేస్తోంది.

03/30/2019 - 20:18

ఆధునిక అవసరాలకి తెలుగులో మాటలు లేవని వాపోయేవారంతా ఇంగ్లీషులోకి కుక్కగొడుగుల్లా పుట్టుకొస్తూన్న మాటలు ఎక్కడ నుండి పుట్టుకొస్తున్నాయో ఒకసారి ఆలోచించాలి.

03/30/2019 - 20:15

ఆమె ఆలోచనా సంద్రంలో
వొడ్డుకొచ్చిన అలొకటి

తను కనిపించలేదని
తలబాదుకొని మరణించింది

పౌర్ణమి వెనె్నల నీడల్లో
వెతుకుతూ వెతుకుతూ చీకటయింది

నిద్రలేమి రాత్రుల్లో
నిర్ణిద్ర కలొకటి రెప్పల కొక్కానికి వేలాడుతూ
ఊసులాడుతుంది

తనని పొందలేని కలొకటి
విఫలమై ఉదయాన్ని చూడక ముక్కలయింది!!

03/30/2019 - 20:14

కవిగా జాషువా
నవయుగ చక్రవర్తియై
గుర్రంలా పరుగిడుతూ
ఆ పరుగులో పీడిత ప్రజల
పీడకలలను చూచి చలించి
హృద్య పద్యాలుగా మలిచి
మధుర శ్రీనాథుడైనాడు.

03/30/2019 - 20:07

మేషం
ఆదాయం -14, వ్యయం -14; రాజపూజ్యం -3, అవమానం -6

03/30/2019 - 19:59

ప్రపంచీకరణ పెత్తనంతో తెలుగుతనం విలవిలలాడుతోంది. సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల వినియోగంతో తెలుగు భాష నలిగిపోతోంది. ఇక ఆంగ్లమాధ్యమంతో మన తెలుగు భాష వెలవెలబోతోంది. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు భాషను సంస్కరించాలని కొందరైతే, ఉద్ధరించాలని మరి కొందరు చేస్తున్న కృషిలో సాహిత్య పత్రికలు తమ వంతు భాషామ తల్లికి సేవ చేయడం అభినందనీయం.

03/30/2019 - 19:22

మనుషులంతా
శతవసంతాల
భరోసాగా ఉక్కుమనుషులే
కండిషన్స్ అప్లైడ్
జీవితము బుద్బుద ప్రాయము
సంతోషాలకు నోరు తీపి చేసుకుందాం
కండిషన్స్ అప్లైడ్
చక్కెర వ్యాధి మహమ్మారి
తినగతినగ వేము తియ్యనగును
బహుపసందైన విందు భోజనము
మద్యమాంసాలు - జంక్‌పుడ్ తయారు
కండిషన్స్ అప్లైడ్
ఆరోగ్యకరమైన జీవితానికి
మొలకెత్తిన విత్తనాలు

03/30/2019 - 18:59

ఆధునిక పోకడలతో, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతోపాటుగా మెదడుకు కొంత భారం తగ్గిందనుకొంటున్నారు కదా వాస్తవికంగా ఆలోచిస్తే మెదడులో జరగాల్సిన అభివృద్ధి ఆగిపోతుందేమోననే భయం వేస్తోంది. మెదడును ఎంతగా వాడుకుంటే అంతగా దాని (మెదడు) పనితనం పెరుగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా తయారవుతున్నాయి. మనిషి శరీరంలోని ఏదైనా అవయవం పని చేయకపోతే నొప్పి, బాధ అనిపిస్తుంది.

03/23/2019 - 22:24

ప్రతి వ్యక్తీ తన జీవితంలో గొప్ప మార్పు రావాలని కోరుకుంటాడు. అందుకు ఏదో గొప్ప సంఘటన కోసం ఎదురుచూస్తూ ఉంటాడు.
చిన్న చిన్న విషయాలే జీవితంలో పెద్ద మార్పునకు, గొప్ప మార్పునకు దోహదపడతాయన్న విషయాన్ని మర్చిపోతుంటాడు.
లావుగా వున్న వ్యక్తి అతి త్వరగా బక్కగా కావాలని అనుకుంటాడు. క్రమం తప్పకుండా నడిస్తే ఫలితం ఉంటుందన్న విషయాన్ని మరిచిపోతూ ఉంటాడు.

03/23/2019 - 22:11

శ్రీకృష్ణ లీలాతరంగిణి రచించిన శ్రీ నారాయణతీర్థులు క్రీ.శ.1675 ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి, విశాఖ నక్షత్రం, గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కాజ గ్రామంలో జన్మించారు. వీరు తిరుపుందర్తి, తంజావూరు, తమిళనాడులో క్రీ.శ.1745లో సజీవ సమాధి పొందారు. అయితే మన ఆంధ్రప్రదేశ్‌లో వీరి వర్థంతిని మాఘ శుద్ధ అష్టమినాడు జరుపుతారు.

Pages