S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

04/29/2017 - 21:05

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నులు ఎగ్గొట్టారన్న కోపం ఇంకా ప్రజల్లో తగ్గలేదు. తన ఆదాయానికి సంబంధించిన రికార్డులను బహిరంగపరచాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. ట్రంప్ వైఖరికి నిరసనగా ఓ మహిళ ఇలా డాలర్ నోట్లను ముఖానికి అలంకరించుకుని నిరసన తెలుపుతోంది.

04/29/2017 - 21:04

బొమ్మలంటే చిన్నపిల్లలకు కదా బాగా ఇష్టం. వాటితో ఆడుకోవడం వారికి ఇష్టమైన పని కదా!. కానీ ఈ చిత్రంలో కనిపిస్తున్న 86 ఏళ్ల బామ్మ బొలెమన్‌కు కూడా బొమ్మలంటే పిచ్చి. 65 ఏళ్లుగా ఆమె తనకు నచ్చిన బొమ్మలను సేకరించి ఒక చోట చేర్చింది. దాదాపు 20వేల బొమ్మలను చుట్టూ పేర్చుకుని ముచ్చటపడటం ఆమెకు మరింత ఇష్టం. ఆ సరదాయే బెల్జియంలో ఆమెను సెలబ్రిటీగా మార్చింది మరి.

04/29/2017 - 21:02

పాశ్చాత్య దేశాల్లో పెంపుడు జంతువులతో బయట తిరగడం చాలామందికి ఇష్టం. అయితే వాటిని ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడికిపడితే అక్కడికి తీసుకువెళ్లేందుకు అవకాశాలు తక్కువే. ఎన్నో నియమనిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హోటళ్లకు వాటితో కలసివెళ్లడం కుదరదు. అందుకే ఇంగ్లండ్‌లో పెంపుడు పిల్లులకోసం ఓ హోటల్ ఈ మధ్యే వెలసింది. ఇప్పుడు పెంపుడు కుక్కలకోసం కూడా అలాంటి హోటల్ ఏర్పాటు చేశారు.

04/29/2017 - 21:00

ఓ బండరాయికి రూపం ఇచ్చేందుకు ప్రయత్నించిన ఈ కళాకారుడి పేరు అబ్రహం పాయించెవల్. ఈ లైమ్‌స్టోన్ బండలో గాలి పీల్చుకునే వెసులుబాటు ఉంచుకుని లోపల దొలుస్తూ వారంపాటు అందులో ఉండి మనిషి పట్టేలా ఆ రాయిని తీర్చిదిద్దాడు. అత్యవసర పరిస్తితుల్లో వాడేందుకు ఓ ఫోన్, లాగ్‌బుక్, కొన్ని పరికరాలను తనతోపాటు ఆ లోపల ఉంచుకున్నాడు.

04/11/2017 - 23:06

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. ఆ వేడుకకు కళ తెచ్చిపెట్టే అలంకరణల్లో గోరింట ఒకటి. చేతినిండా గాజులు వేసుకుని, గోరింట పెట్టుకోవాలని పెళ్లికూతుర్లు తహతహలాడతారు. అలా ఒకేచోట పదిమంది వధువులు చేరితే ఆ అందమే వేరు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బాబూలాల్ ప్రధాన్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహాల కార్యక్రమంలోని వధువులంతా ఇలా ఫొటోలు తీయించుకుని ముచ్చట పడ్డారు.

04/11/2017 - 23:04

కాస్తంత దూరం నడవాలంటేనే ఆపసోపాలుపడిపోయేవాళ్లు ఈ లోకంలో చాలామందే ఉంటారు. అలాంటి ఈ లోకంలో కణకణలాడే నిప్పుల్లో ఆనందంగా, తన్మయత్వంతో నడిచేవాళ్లూ ఉంటారు. వియత్నాంలోని హ జియాంగ్‌లో పె థెయ్ తెగకు చెందిన గిరిజనులు ఇలా నిప్పుల్లో నడచి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. స్మిత్‌సోనియన్ మ్యాగజైన్ వార్షిక ఫొటోగ్రఫీ పోటీలకోసం వచ్చిన ఎంట్రీలలో ఈ ఫోటో అలాంటి సన్నివేశాన్ని ప్రతిబింబిస్తోంది.

04/11/2017 - 23:02

ఏ విద్యాసంస్థలోనైనా పాఠాలు చెబుతారు. ఇక్కడ మాత్రం యుద్ధపాఠాలు నేర్పుతారు. పాలస్తీనాకు చెందిన గాజాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులకు
ఇలా మారణాయుధాలు ఉపయోగించడంలో మెళకువలు నేర్పుతున్నారు.
హమాస్ సంస్థ, అంతర్గత భద్రతా సంస్థ ఈ శిక్షణ ఇస్తోంది.

04/02/2017 - 22:31

భారత్‌లో చాలా ప్రాంతాల్లో కరవు తాండవిస్తోంది. తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో అదే పరిస్థితి నెలకొంది. తమ ప్రాంతాన్ని కరువుపీడిత జిల్లాలుగా ప్రకటించకపోతే ఎలుకలను పట్టుకుని తినాల్సి వస్తోందంటూ తమిళనాడుకు చెందిన కొందరు రైతులు ఇలా మూషికాన్ని మీసంపై పెట్టుకుని నిరసన తెలుపుతున్నారు దేశ రాజధానిలోని జంతర్‌మంతర్ వద్ద.

04/02/2017 - 22:29

చూడటానికి అందంగా కనిపిస్తున్న ఈ దృశ్యం నిజానికి భయోత్పాతం కలిగించే విషయమే. సిసిలీలోని ఎట్నా అగ్నిపర్వతం నిప్పులు ఎగజిమ్మింది. దీంతో లావా పొంగి ఇలా సముద్రప్రవాహంలా సాగుతోందన్నమాట.

04/02/2017 - 22:28

థాయ్‌లాండ్‌లో ఏనుగుల దినోత్సవం ఏటా ఘనంగా నిర్వహిస్తారు. పర్యాటక రంగానికి ఇక్కడి ఏనుగులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఏనుగుల దినోత్సవం సందర్భంగా వాటితో చేసే విన్యాసాలు, ఆటల పోటీలు, యుద్ధసన్నివేశాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ఇదిగో ఇక్కడ రెండు ఏనుగుల మధ్య పోటీ ఎలా జరుగుతోందో చూడండి.

Pages