S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

07/30/2016 - 22:11

బూడిద నించి మొలకెత్తిన
రేపటి విత్తులు చూడు చూడు
కూల్చడం గొప్ప కాదు
నిర్మించడమే కష్టం. ఎన్ని జీవితాలు
చీకటిలోకి వెళ్లిపోయాయో చూశావా?

జీవితం తగలబడి పోయాక
మిగిలేది గుప్పెడు బూడిదనే కాదు
గుప్పిట జారవిడిచిన జ్ఞాపకాలు కూడా
దారి ఎప్పుడూ ఆగిపోదు
వేగంతో అడుగులేస్తూ నడుస్తున్న
నిన్ను లక్ష్యం వరకు చేరవేస్తుందో లేదో
ఇప్పుడేం చెప్పగలం?

07/24/2016 - 02:00

ఇదెక్కడి నరమేధం?
ప్రపంచాన్ని శాసించగల అగ్రరాజ్యం
తన బిడ్డల్ని నియంత్రించలేదా?
చంపుకుంటే చంపుకోండని
తుపాకీలకు ఆమోదముద్రలు వేస్తుందా?
ఒక మానవ రాక్షసుడు
ట్రిగ్గర్ నొక్కి అరవై ప్రాణాల్ని
క్షణకాలంలో హరించడమా!
తన నడిబొడ్డులో
నివాసముంటున్న
హంతకుల్ని గుర్తించే టెక్నాలజీ లేదా?
తుపాకీల లైసెన్సులను
నియంత్రించే సత్తా లేదా?

07/24/2016 - 01:58

మూలన ముక్కివాసన కొడుతున్న
లియో టాల్‌స్టాయ్ ‘వార్ అండ్ పీస్’
చేతిలోకి తీసుకుని దులుపుతుంటే-
జాలరి వలలోంచి చటుక్కున మళ్లీ
నీళ్లలోకి దూకిన చేపపిల్లల్లా
రెండు పాత బస్సు టిక్కెట్లు జారి
నా కాళ్ల వేళ్ల మీద పడ్డాయి.
పాతికేళ్ల నాటి పాపాయిలవి!
రెంటిలో ఒకటి నాది
మరొకటి కచ్చితంగా నీదే!
మన డిగ్రీ చివరి సంవత్సరపు చివరి రోజు

07/24/2016 - 01:56

మహానుభావా...
విత్తనం నీదే!
ప్రతీ నేలా-
ఏపుగా ఎదిగే పైరు కోసం
ఫలసాయం కోసం
ఎదురుచూస్తూనే ఉంటుంది.
నీ విత్తనం విఫలం అయినప్పుడు
నేల ‘తల్లి’ని దూషించడమెందుకు?
ఆమెని ‘గొడ్రాలని’ చెప్పి
గొడ్డలితో నరకడమెందుకు?
అమ్మతనం కోసం
అమ్మ ఎప్పుడూ సంసిద్ధమే...
రకరకాల రుగ్మతలతో
మగాడా...
నువ్వే నిషిద్ధం!!

07/16/2016 - 22:16

ప్రాణం లేకున్నా
ముతె్తైదువులకు
ప్రాణం పోస్తాయి
బొట్టుబిళ్లలు
చౌరస్తాలో
భిక్షకుల బెడద
‘మామూలు’ ఖాకీలతో
తంతు ఆగేనా?

నింగిలో డేగ
చూసిందా నేల చూపులు
ఏదో ప్రాణికి
చెల్లేను నూకలు

అతిగా ఆలోచిస్తే
బుర్ర బొప్పి కడుతుంది.
హ్యూమర్ కాస్తా
ట్యూమరవుతుంది.

07/09/2016 - 21:53

వేగంగా
గాలిలా కాంతిరేఖలా
పరుగెత్తే అశ్వం కావాలి; లేదా
రథం కావాలి
అలాగే
ఓ కత్తి కావాలి; ఓ డాలు కావాలి
వీలైతే
వెనుక ఓ సైన్యం కావాలి
నిజానికి
ఇవన్నీ అక్కర్లేదేమో?
నిర్భయం కావాలి;
వజ్ర సంకల్పం కావాలి-
శత్రువును దెబ్బతీయడాన్కి.

07/09/2016 - 21:51

ఎంత తెలుసుకున్నా సరే
అంతు దొరకనిది ఇంకేదో ఉంటుంది
సముద్రాన్ని దోసిటితో తోడినట్లు
సాగుతున్న ప్రయత్నంలో
అందుకున్నది అణువంతే
అందుకోవలసింది బ్రహ్మాండమంత!
అణువును చూసి బ్రహ్మాండమనుకుంటే
అడుగు మొదటిలోనే ఆగిపోతుంది
ఆగకుండా సాగాలి నిరంతర శోధన
వేగవంతంగా యోగాన్ని సాధించాలి
లక్ష్యం ఎప్పుడూ సుదూరమే
కానీ గమ్యం విశాలంగా ఉంది

07/09/2016 - 21:48

దిల్ కీ ఆవాజ్
మేరే దిల్ సే సునో
నా మనసు నాతో గొడవ పడుతుంది
ఎందుకో నా మాటే విననంటుంది
మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చానేమో
భయభక్తులు లేకుండా
బడాయి పోజులు కొడుతుంది
ప్రేమించొద్దు అంటున్నా
ప్రేమిస్తానంటూ మొండికేస్తుంది
దానధర్మాలు చేద్దాం అంటే
నువ్వు రోడ్డుపైకి వస్తావంటుంది
దేశం కోసం ప్రాణ త్యాగం చేయడం కోసం
వీరజవానై పోతానంటే

07/09/2016 - 21:45

జనం గుండెల్లో
సదా నేను నిలిచి ఉంటా
జన సేవ
సదా నేను చేస్తూంటా
జనం కష్టసుఖాల్లోనూ
సదా నేను పాలుపంచుకుంటా
నేను రాజకీయ
నాయకుణ్ని కాను
గద్దెనెక్కేవరకు ఓ మాట
గద్దెనెక్కిన తరువాత మరో మాట
మాటలు మార్చే మాంత్రికుణ్ని కాను
నిస్వార్థ జీవిని నేను
మానవత్వంతో
సాటి మనిషి ప్రాణాలు పోతుంటే
నా గుండెనైనా నవ్వుతూ

07/02/2016 - 22:00

పూలకి
రంగుల్ని పులుముతున్నాయ్
సీతాకోకలు!
మబ్బులకు
రెక్కల్ని తొడుగుతున్నాయ్
గాలి తెమ్మెరలు!
మనిషి పడిపోకుండా
వాని పాదాల్ని పట్టుకు
నడిపిస్తోంది
ధరిత్రి!
చెట్టుకొమ్మ
పచ్చని పతంగుల్ని
ఎగరేస్తోంది
సంక్రాంతి సంబురంగా!
తాను పారేసుకున్న పాటని
గూట్లో వెదకుతోంది పక్షి!

Pages