S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

07/02/2016 - 21:59

వారి దేహంలో
విదేశీ మోజులున్నాయి
ఆర్కిటెక్టులు, ఆహ్వానాలతో
ఆకర్షిస్తున్నాడు.
హైటెక్‌లతో హంగులు దిద్దుతున్నాడు
స్మార్ట్‌గా స్మైల్ ఇస్తూ సైలెన్స్ చేస్తున్నాడు
కామ్‌గా కారిడార్లు అంటూ కాటేస్తున్నాడు
సింపుల్‌గా సింగపూర్ అంటూ
ఫ్లైట్ ఎక్కేస్తున్నాడు
ఫైల్స్‌తో పోజులిస్తూ ఫొటోలు దిగుతున్నాడు
ఒప్పందాలు అంటూ వాటేసుకుంటున్నాడు

07/02/2016 - 21:58

చెమట చుక్కనెప్పుడూ చులకన చెయ్యొద్దు
నుదుటి మీద రాతనే మార్చగలదు -
నుదురుపై మొలిచిన చెమట!
సేవకుడూ, కర్షకుడూ, శ్రామికుడూ.. వీళ్లంతా
భ్రమల్లో బతకరు - శ్రమలోనే జీవిస్తారు!!
స్వేదం - ఒక వేదం...
కరకురాయిని పిండి చేసి
బీడు భూమిని పండించే మనోజ్ఞ రాగం
శ్రమైక జీవన సౌందర్యానికి నిలువెత్తు సత్యం
నరనరాన బిరాబిరా పరిగెత్తే రక్తఘోష నాదం

06/26/2016 - 02:01

ఆకాశమంతా చుక్కలు పరుచుకున్నపుడు
గదుల నిండా చీకట్లు ముసురుకున్నపుడు
నా వారు అందరూ స్వప్న లోకాల్లో విహరిస్తున్నపుడు
నన్ను కదిపిన భావాల పరంపరలు నిద్రలేస్తాయి
నన్ను అక్షరాలుగా స్పందింపజేస్తాయి
ఇక నా ప్రయాణం మొదలవుతుంది
అనుభూతులు సంగీతాన్ని ఆలాపిస్తూంటే...
పదాల పదనిసలు నాట్యమాడుతాయి
ఒకే అనుభవంగా.. ఒకే లక్ష్యంగా...
మెదడు నిండిన భావావేశం

06/26/2016 - 01:57

పొగ
నిప్పులేందే రాదు
కోపం
ఊరకే రాదు
లోపలికి గుచ్చుకుంటేనే
రక్తం కారుతది
గాయమైన మనసే
దుఃఖమై పారుతది!

గుండె వత్తికి ఏదో
నిప్పు రవ్వ తగిలి
ఆగ్రహమై రగిలి ఉంటది
భూమి పగిలి
అగాధం పెరిగి ఉంటది!

06/26/2016 - 01:54

మట్టి నుండి పుట్టిన మనిషి...!!
మరణాన్ని త్యాగం చేసే మనిషి
మట్టిలో కలిసే మనిషి
మానవత్వానికి దూరంగా ఉన్నాడు
మనసుని చంపేసి... మనీకి దగ్గరయ్యాడు
చెదిరిన, నలిగిన హృదయంతో చిక్కిపోయాడు.
చరిత్ర గర్భంలో చెడ పుట్టాడు
బీదల బ్రతుకు కన్నీళ్లు కురిసే వర్షంలో
బాధల బరువులు మోసే జీవితాల్లో
బంధాల బీడు భూముల క్షేత్రంలో
భారంగా మారిన మృతకళేబరం మనిషి

06/26/2016 - 01:47

గూడు జారిపోయింది
చెట్టులేని పక్షి
ఏ దిక్కునో ఎగిరిపోయింది
ప్రవాహంలో పడి చందమామ
ఏ దరుల్లోనో కొట్టుకపోయింది
నిర్మలాకాశపు నక్షత్ర చేపలు
కకావికలం
మొరటు అడుగుల శబ్దాలకు
నిఘంటులైన కొండదారులు
మాయమై పోయాయి
విప్పపూలు, అడవితేనె
వెలగపండు, వెదురుపూత
ఎనె్నలపిట్ట, నెమలికన్ను
గొర్రెపోతు, గొర్రమోతు
దుప్పికొమ్ము, కొమ్ముబూర

06/19/2016 - 00:34

అమ్మ మాతృత్వానికి ప్రతీక
చెట్టు పర్యావరణానికి పతాక
అమ్మ అమృత ఔషధి...
తాగించి మనిషిని చేస్తే...
చెట్టు నిరంతరం
ప్రాణ వాయువునందించే
జీవన నేస్తం...
అమ్మ హాయి నిదురకు
బొమ్మరిల్లు కతలు చెబితే..
చెట్టు చందమామను
కొమ్మలపై దింపి చల్లగాలితో
జోలపాట పాడుతుంది...
అమ్మ తొలి గురువై
అక్షరాలు దిద్దిస్తే...
చెట్టు ఊయలై

06/19/2016 - 00:32

కలలాంటి ఒక అద్భుతం జరిగి
కారే కన్నీటి మూలాలు
కదలాడే బొమ్మల్లా ప్రతిబింబిస్తే...
ఆమూలాన్ని సమూలంగా నిర్వీర్యం చేయొచ్చు
గుండె గాయాల కథల్ని ఎక్స్‌రేలా
తెలియజేసే పరిశోధన మొదలైతే
గాయాలకు ఔషధ లేపనం అద్దినట్లే!
కరువు కాటకాలను కాటేసి
రైతుల పెదాలపై చిరునవ్వును చూడగలిగే
మంత్రం లాంటి కొత్త పరికరం రూపొందిస్తే
పుడమి పులకించినట్లే!

06/12/2016 - 02:50

రుణభారం ఎక్కువై
దానిని తీర్చలేనప్పుడు
రుణదాతల కంటపడకుండా
తప్పించుకుని తిరుగుతూండటం
మనిషి నైజం!
వేరు జన్మలు ఉన్నాయో, లేవో
తెలియకుండానే
ఎన్నో జన్మలకు సరిపడేంతగా
తమ సంతానానికి ఎంతో సేవ చేస్తూ,
కాపాడుతూ, పెంచి పోషిస్తూ
ఎంతెంతగానో ప్రేమను
పంచిపెడుతూ కూడా
ప్రతిఫలాపేక్ష లేని
కరుణామృతమయ మహాదాతలు

06/12/2016 - 02:46

కాలం క్రమంగా
గమిస్తోంది
రోడ్డు రోలరులా
దొర్లుతోంది
తనకేం మిగుల్చుకోదు
అయినా
తాను పొరలిన గుర్తుల్ని
సైతం వదిలేస్తోంది
చదును చేస్తోంది
సమం చేస్తోంది
భూమి గాయాల్ని
మాన్పివేస్తోంది

Pages