S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

06/12/2016 - 02:43

వేదిక మీద స్వంత గోడు అగ్నిపర్వతం బద్దలయ్యింది
లావా హాలంతా వ్యాపిస్తోంది!
వృద్ధులు, పురుషులు, స్ర్తిలు, చిన్నపిల్లలతో సహా
హాల్లో అందరికీ చెవుల గొంతులు ఎండిపోతున్నాయి
ఒక్కటంటే ఒక్క చుక్క మంచి మాటల నీరు లేదు
ఒక్కటంటే ఒక్క చుక్క అర్థమయ్యే మాట, అర్థవంతమైన మాట లేదు
చెవుల నోళ్లు పిడచ గట్టుకుపోతుంటే
ఆ పై వాడు పట్టించుకోడు

06/05/2016 - 02:52

ఆ చెట్టు నీడ అమ్మ ఒడిలా ఎంత హాయి
ఎన్నో ఏళ్లుగా ఎన్నో తరాలుగా
ఎన్ని ఆనందాల వెల్లువలో ఎన్ని అనుభవాల దొంతరలో
ఆ చెట్టు పూసింది నిలువెల్లా కళలతో పూలతో
పిల్లల్లో పూయించింది చిగురు కలలు
తల్లుల్లో పూయించింది బంగారు కలలు
ప్రేమికుల్లో పుష్పింప జేసింది వేల ఆశల్ని
అందరిలో పరిమళింప జేసింది జీవన సౌరభాల్ని
ఎందరో బహుదూరపు బాటసారుల్ని-

06/05/2016 - 02:51

అట్లాసంతా అస్తవ్యస్తంగా ఉంది
అన్ని ఖండాలు అట్టుడికిపోతున్నాయి
అన్ని ‘వాదా’లను ఐక్యవాదంతో తరమాలని
అన్ని దేశాలకు ఐ.రా.స. పిలుపునిచ్చింది
ఆఘమేఘాల మీద ఆర్భాటంగా
అందరు ప్రతినిధులు వేదిక చేరారు
అణు విస్ఫోటనాలను అంగిటిలో పెట్టుకుని
ధృతరాష్ట్ర కౌగిళ్లు పంచుకున్నారు
పరస్పర నిందారోపణల పర్వంలో
హడావుడి హుళక్కి నిర్ణయాలు

06/05/2016 - 02:32

నాదే కులమని అడిగాడో మిత్రుడు
నాదే కులమైతే నీకేంటి
ఏ మతమైతే ఎవరికేంటి
ఎవరెటు పోతే నాకేంటని అరిచాను!

మానవత్వం కుప్పకూలుతుందనే ఆలోచన వెంటాడుతుంది
తోయబడ్డాను అగ్నిఖిలల సుడిగుండంలోకి
ఏడవడమే మిగిలింది
ఎందుకేడవాలో అర్థం కావట్లేదు ఈ కసాయిల వనంలో!

నీవు ఫలానా వాడివైతే కచ్చితంగా చాందసుడివని
ఫలానా కులమైతే కుసంస్కారివనంటున్నారే

05/29/2016 - 20:44

యువ భారత
నవ తరమా...
మేలుకో ఏలుకో
ఇదేరా!
ఎన్నికల సమరం
మీకిదే
సమయం
దేశానికి శక్తి మీరు
భారత జాతికి
వనె్న మీరు
ప్రజాస్వామ్య భారతంలో
మీ స్థానం
ఎక్కడుంది?
నవ భారత
యువతరమా..
నా దేశ
సౌభాగ్యమా
మీ గమ్యం ఎటువైపు
మీ తీర్పు
ఒక మార్పు
మీ తీర్పు కావాలి
ఓ మార్పు.. రావాలి

05/21/2016 - 23:48

నిర్మలమైన నీలాకాశంలో
చెల్లాచెదురుగా మబ్బుల తునకలు
సాగిపోయే మేఘాల అద్భుత దృశ్యాలు
గగనంలో తేలిపోవాలన్న ఉద్వేగం

మేఘాలన్నీ ప్రకృతి ఆకృతులకు ప్రతికృతులే
అవి సేంద్రియ నిరీంద్రియ రూపాలే
అనుభవ వైవిధ్యం పంచుకుందామంటే
కాలయవనికపై అన్నీ అశాశ్విత దృశ్యాలే
ప్రకృతి గీసిన చిత్రాలు క్షణాల్లో అదృశ్యవౌతాయి

05/21/2016 - 23:46

సహకరించని సామాజిక నేపథ్యం
దరిజేరని సహవాసపు భావాంతరాలు
వ్యవస్థీకృతమైన పాలక అవ్యవస్థ
మైలపడిన మానవత్వాలు
నామమాత్రపు ఆలంబనలు
భరోసా లేని బలహీనపు పరిష్వంగాల మధ్య
భయవిహ్వలంబైన జీవన వలయాల నడుమ
* * *
వాడిన పగడపు పూల పెదవులపైన
విచ్చుకొన్న ఓ వసివాడని చిరువసంతం
మూడు శిశిరాల లేతప్రాయంలో
కేరింతలు కొడుతోంది
ఆ చిరుదరహాసపు లోగిళ్లలో

05/21/2016 - 23:43

ఫలాన్ని ఇచ్చే తరువుకే రాయిఘాతం
ఆహ్లాదాన్ని ఇచ్చే ప్రకృతి మీదే శరాఘాతం
మనిషి ఎదుగుదలలో వైపరీత్య ధోరణి
క్షుద్బాధ తీరేందుకే అవిరళ కృషి
నాడు పొత్తిళ్లలో వొదిగిన పేగుబంధం
క్షీరధారకై కుమ్మిన తరుణం
గులాబీ గుద్దులు విస్మరించింది మాతృత్వం
అనుభూతి మేఘం పిండనిదే వాత్సల్యం వర్షించదు
గోరుముద్దలకై చెలరేగిన చిలిపి గారాబం
ముద్దుగా మారాం చేయడం శైశవత్వం

05/15/2016 - 06:17

మా కలలన్నీ అలల్లోనే
మా వలలన్నీ తలల్లోనే
మా బ్రతుకంతా తీరంలోనే
దేశం దశాబ్దాల స్వాతంత్య్ర సంబరాల్లో
మున్గి తేలుతుంటే
మేం కర్రాకుల్లో చేపలెండేస్తుంటాం.

లోకం దీపావళి మతాబుల్లో వెలిగిపోతుంటే
ఎండిన చేపలు తడిశాయని మేం
గుడిసెల్లో నత్తలౌతాం.

05/09/2016 - 03:29

ఆకాశమంతం అందం
దూదిపింజెలా మనసు
మగ అహంకారానికి బలి!

పత్రహరితాల సమూహంలో
సీతాకోకచిలుక
రంగుల విందు!
చందమామ గొడుగులో
సరస్సు నీడ
కలువల రేడు!

తేనెటీగల
అపార్టుమెంట్లు
తేనె హృదయాలు!

మది నిండా
పనికిరాని తూనీగలు
వాగ్దానాల మోత!

Pages