S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

10/08/2016 - 22:55

ఆద్యంతాలున్న జీవితనదిలో
ఆనంద విషాదాల అలలు
ఏ అలనైనా వేరు చేయగలమా?
*
ఆకాశమంత నిజాన్ని అణువంత అబద్ధం కప్పేస్తుందా
కొండంత అబద్ధాన్ని నిజం నిప్పురవ్వ కాల్చేస్తుందా
పాలలోని నీరులా నిజంలోని అబద్ధమునూ
మజ్జిగలోని వెన్నలా అబద్ధంలోని నిజమూనా
*
ముందు ముందు ఏమవుతుందోనని భయం
ముందూ వెనకా చూడని ధైర్యం
ఏది దేనికి సంకేతం?
*

10/08/2016 - 22:53

తురంగ విహంగంతో లోక వీక్షణ..!!
ఎన్నో సందేహాలు, ఆరాటాలు, పోరాటాలు!!
చిక్కుముడుల నడుమ అజ్ఞాతశక్తి..!
అదే ఈ సృష్టికి మూలమట..!!

పంచభూతాల సృష్టి కర్తట..!!
నీటిలో మునగదట..!!
గాలిలో తేలదట...
నిప్పుల్లో కాలదట..
నింగిలో కనిపించదట...
నేలపై నడవదట..
అది ఓ అందని శక్తిట...!!
అది ఉందో లేదో నాకెందుకట..

10/08/2016 - 22:50

జీవితం అనాగరిక దృశ్యంగా
ఎందుకు మారింది?
పైకి ఆధునికత లోపల పురుగుల పెంట
తెల్లబట్టల వెనుక దాక్కొన్న
పచ్చనోట్ల వేట సంగతేమిటి?
వాడు చదువుకున్నోడే
పట్టాలు డిగ్రీలు ర్యాంకులు పతకాలు
వాడు చదువుకున్నోడే
స్కూలు మెట్లే కాదు
సాహిత్య మెట్లు ఎక్కిన వాడే
శ్రీశ్రీ, చలం, విశ్వనాథ
ఎన్నో చదివాడు వాడు
పచ్చనోట్ల పిచ్చేమిటీ?

10/08/2016 - 22:48

కటిక నేలపై సంసార మీదినా!
కనక మేడళ్లో ఉయ్యాల లూగినా
అనార్థలచ్చేవి కొందరాడవాళ్లతోనే
అంటారు అనుభవజ్ఞులు
మగడు ఎలా సంపాదించినా
రొక్కం మొత్తం చేతికిస్తే
చెప్పింది చేసి అణిగి మణిగి వాడుంటే
ఇంట్లో హీరో - బయట జీరో
అయినా ఫరవాలేదు
గడప దాటని ఆడది గడియకొక మాట
ఇరుగు పొరుగమ్మలతో వియ్యం!
మగనితో నిత్యం కయ్యం

10/02/2016 - 00:00

నాలుగు గోడల మధ్య
నీ అస్తిత్వం
ఎగరలేని చిలుకై
బంధించబడుతుంది

పసితనం
పరదాల మాటున
మగ్గిపోతున్నప్పుడు
విడుదల ఎప్పుడు?
నిరంతర ప్రశ్న
తొలుస్తూనే ఉంది.

10/01/2016 - 23:58

వాడిన పసుపు నవ్వు
జారిన కురుల వెండి తీగెలు
గుండెలు దాటని శబ్దం
దీపకాంతిలో దేవకి
ఆమె ముఖం
లేత చిగురులా మెరిసింది
తను ఒక సందేహ రాగం
*
నిశ్శబ్దంలో
ఆమె గొంతు విప్పింది
విరిగిన గాయం
అనంత శోకాన్ని మోస్తున్న
రెండు తనువుల ఒక బరువు
మూసిన తలుపులు
తనకు తను ఒక విదేహం
*

10/01/2016 - 22:50

అతని రాక
నా మనసుకొక ఊరట
అతను రాని రోజు
నా మదిలో వ్యాకుల మొలకలు మొలుస్తాయి
అతనితో నాకు ఏ బంధమూ లేదు.
ఐనా.. అతని కోసం
నా రెండు కన్నులు వెయ్యి కన్నులై ఎదురుచూస్తాయి
నా మనస్సు అతని త్రోవకేసి కాపుకాస్తుంది.
అతని తలపులో...
మరుభూమి దాటి సుమవనం చేరిన స్వాంతనం
అతని చిరునవ్వు దొంతర...
నా గుండె లోలోతున గతం పెట్టిన గాట్లపై

09/24/2016 - 22:27

మనిషిగా వెళ్లి
మహాత్ముడిగా తిరిగొస్తావని
అచేతన శిఖరాల మధ్య
అంతఃచేతన సాధిస్తావని
పాము కుబుసం విడిచినట్టు
అజ్ఞానాంధకారాన్ని విసర్జిస్తావని
బండరాయిలా దొర్లుతూ వెళ్లి
పాదరసంలా పరిగెత్తుకొస్తావని
చీకటి దారుల వెంట నడిచిన వాడివి
వెలుతురు బాటవై పరచుకొంటావని
ప్రతి మనిషి మనసుని తాకి
పవిత్ర భాగీరథిని చేస్తావని
మంచికీ చెడుకీ మధ్య

09/18/2016 - 22:21

అమ్మ నాన్నల
సృష్టి కార్య కలయికలో...
అమ్మ మాతృమూర్తియై
నేనో జీవంలా రూపాంతరమై
దినదినాభివృద్ధితో...
నను కంటికి రెప్పలా...
తన కడుపుకు తానే కాపరై
నే.. రంగు రావాలని
కుంకుమ పువ్వు
కోరి ఏరి తెచ్చి ఆరగించి
నే.. బాలభీముడులా అవ్వాలని
శ్రీమంతం పేరిట
తీపి తాను తింటూ...
నన్ను బలవంతుణ్ని చేస్తూ...
తన హృదయంతో...

09/18/2016 - 22:18

వానచినుకు తూనీగై
మబ్బుల్లో ఎగురుతూ ఉంది
తూరుపు దిక్కున సూరీడై
చురుక్కున గుచ్చుతూ ఉంది.
చినుకంటే
నీటిచుక్క కాదు
నింగికెగసి
ముంగిటిలో త్రుళ్లిపడ్డ
నీటిసంద్రం.
*

Pages