S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

09/18/2016 - 22:10

పోరాటం చేసినపుడు
చేయి చేయి కలిపినోడు
సైనికులం మనమంతా
సమానులం అన్నోడు
విజయలక్ష్మి దక్కగానె
విఐపి అయినాడు.

పదవులేమి లేనప్పుడు
ప్రజలతోని ఉన్నోడు
అందరినీ కూడగట్టి
ముందుకు నడిపించినోడు
అధికారం దక్కగానె
అందని ద్రాక్షయినాడు

09/11/2016 - 00:59

ఎండుటాకుల గలగలల సంగీతంతో
అడుగుకొక నిట్టాడులా నిగిడున్న చెట్లు
ఆ చెట్లకు చేతులు పూసినట్లున్న కొమ్మలు
ఆ కొమ్మలకు విరగబూసిన పచ్చపూలలా ఆకులు
ఆ ఆకుల మధ్యన రంగులన్నీ కలిపి అద్దినట్లు పూలదొంతరలు
అచ్చు అమ్మ పాటలా చిరుగాలుల సవ్వడులు
జీవకోటికి ఆయుష్షు పంచేలా పారే సెలయేళ్లు
పక్షుల రావాలన్నీ మకరందాన్ని రుచి చూపిస్తున్నట్లున్న,

09/11/2016 - 00:59

నిజానికక్కడ ఏ పేరూ
తనకి సరిపోయేలా ఉండదు.
తనకి చెప్తున్నట్లుగా ఏ పదమూ అక్కడ
ఖాళీ చేసుకునవతరించదు...

ఆ అద్భుతమేదో చూద్దామనీ,
ఎంతకీ తెగని ఈ అసంపూర్తి వాక్యంలో
మా ఇద్దరి మధ్యా ఉండే ఆ మార్మిక భాషేదో
మధ్యలో రాసి
ఆ ఆఖరి పదమేదో అందంగా చేర్చి
కవిత పూర్తి చేయాలనుకుంటాను...

09/03/2016 - 21:35

చినుకు తాకిడికి విత్తులన్నీ నేల పొరల వాకిళ్ల నుంచి
నేలతల్లి గర్భం నుంచి మొలకెత్తి...
ఉదయించే కొత్త లోకాన్ని చూస్తాయి...
కాలుష్యం కమ్మేసినా...
మానవాళి ప్రాణాలకు ఆయుష్షును పోస్తాయి...
పంట చెరుకై తీపిని... వంట చెరుకై ఆహారాన్ని...
ఆయుర్వేదమై ఆరోగ్యాన్ని.. సుగంధ ద్రవ్యమై పరిమళాన్ని...
మన కోసం ధారపోస్తాయి.. అక్షరాలు విచ్చుకొన్న కాగితాలై...

09/03/2016 - 21:33

నేస్తమా! సృష్టి ప్రసవించినపుడు
సమస్య శిశువుతోపాటు
ఉమ్మనీటి సమాధానం ఉద్భవించింది
ప్రతి దారిద్య్ర విషానికి
విరుగుడు కషాయం ఉంది.

ధీరోదాత్తా! నీలో పుష్పించే ఉత్పత్తి వనరులు
నిగూఢ శ్రమశక్తి వినియోగంతో
ఆర్థిక దారిద్య్రాన్ని తరిమే కలియుగ కుబేరుడివి

09/03/2016 - 21:30

వౌన సముద్రాన్ని నేను
పెను తుపానులే నాపై
కరవాలం ఎత్తి
సవారీ చేస్తూ
సుడిగుండాలను పంపించి
నా గుండెల్లో గునపాలను
నిర్దాక్షిణ్యంగా గుచ్చుతున్నా
వౌనం వహిస్తూ
చిరుమందహాసమే
చేస్తున్నా
మానవులు చేసే
మారణహోమాల్ని సైతం
సహనంతో భరిస్తున్నా
వైమానిక బీభత్సాలన్నీ
నా భూగర్భంలోనే నిక్షిప్తం
నాకు వయసుతో

08/27/2016 - 22:41

రెండే రెండు వ్రేళ్లు సాయం
బొటనవేలు.. చూపుడువేలు
నేల దిగింది విత్తనం
నేలతల్లి గర్భంలో
ప్రాణం పోసుకుంది.
రెండాకుల మొలకై ఎదిగి
పందిరి సాయంతో పైకెగబ్రాకింది.
పూలూ, కాయలూ పళ్లూ
పందిరంతా బోసినవ్వుల విరబూత
కోతకు వచ్చింది
రెండు వ్రేళ సాయానికి
రెండు గంపల ఫలితం.
ఎంత కొంచెం మంచి చేసినా,
సత్పురుషులు ఇలా

08/27/2016 - 22:40

ఎక్కడో
హతాశయులైన
స్వప్నంలో నుండి
జారిపడింది
ఈ గులాబీ
రెక్కలు నలిగి
నేలను వాలి
అనాగ్రతమైన
నీడలోకి రాలింది
ఈ పరిమళాన్ని
ఏ మనసులో దాస్తావు
అరవిరిసిన ఈ
రూపాన్ని ఏ వొడికి
చేరుస్తావు?
నీవు ఓ అనామికవే
ఇన్ని చీకటి అలల మధ్య
ఇన్ని నలిగిన కాలాల మధ్య
ఈ ముడి సంధ్యలో
ఈ గులాబీని

08/27/2016 - 22:39

దేశం గురించి
వార్తాపత్రికలు చదూతుంటే
మెదడులో నాడులు
అక్షరాలతో సహా వేడెక్కిపోతున్నాయి
సరిహద్దుల్లో సంఘటనలు
రాష్ట్రాల్లో పెట్రేగిపోతున్న
అత్యాచారాలు, దోపిడీలు...
రాజకీయం పరస్పర బలోపేతాల
కార్యాచరణలో
దేశ బలోపేతం విస్మరిస్తున్న చిహ్నాలు!
ప్రపంచ పటం మీద తన ప్రత్యేకత కోల్పోతున్న
తీవ్ర సంఘటనలు...
మేల్కొందాం! మేల్కొందాం!

08/27/2016 - 22:39

అమ్మ ఒడి
హంసతూలికా తల్పంలో
ఆదమరచి నిద్రపోతున్న
ఆనందాల శిశువు
భువిపైనే
దివిని కంటున్నాడు
వాడికి అన్ని సౌఖ్యాలూ
దిగదుడుపే!
తల్లి ఒడి
చక్రవర్తి సింహాసనమే
అపురూపంగా దొరికిన
ఇంద్ర పదవే!
అదొక అంతరిక్ష స్థానమే!
ఆ శిశువు ఆనందానికి
బ్రహ్మానందాలే చిన్నబోతున్నాయి!
ఆ శిశుత్వం
మానవ జీవితంలో

Pages