S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

05/09/2016 - 03:27

కోపం అంటే-
మనం విషం మింగి
శత్రువుని చంపాలనుకోవడం - అని
ఏదో యధాలాపంగా పుస్తకం చూసి చెప్పా!
మరి - ‘చిరునవ్వ’ టే...
నవ్వుతాలుగా అడిగాడో మిత్రుడు.
‘చెట్టుని మొదలంటా నరికినా
చివురులు పూస్తుందే-
అదే చిరునవ్వంటే’... అన్నాను - నేనూ నవ్వుతూ!

05/09/2016 - 03:24

అటు ఇటు కాని
మూడవ జాతిలో వర్ణ రంజితమై
కూసిన కోయిల
బతుకు దారిలో
రైలు పట్టాల మీద అస్తిత్వం కోసమై
దేహాన్ని దేహి అంటూ
బతుకీడస్తుంది!

బతుకు చిత్రం
వీధుల్లో
చించబడితే
ఆకలి
నడిరోడ్డుపై
నృత్యం చేయిస్తుంది.

వాళ్లంతే,
పొట్ట నింపుకోవడానికి
నిఖార్సైన నిజాన్ని
వొంటికి అలుముకొని
సంచరిస్తూ ఉంటారు.

05/09/2016 - 03:24

నేనిపుడు సాహిత్య దిగంబరున్ని
కావాలని ఉంది
సౌందర్యం, నందనవనం, చిరుగాలి, సంగీతం
ఆనందం, అమృతాభిషేకం లేని - దొరుకని
వ్యవస్థలో
ఇంకెందుకు పదాలకు సౌందర్యం
ఇంకెందుకు వాక్యాలకు సుందరమ్
సుందరమ్, అమృతం, నందనం
కవిత్వమని కొందరంటారు కానీ-
ఏదీ ఎక్కడ కనిపిస్తుంది
మనసులో వెనె్నల చిరుగాలులు
వెనె్నల్లో ఆడుకునే ఆడపిల్లలు లేరు

05/03/2016 - 22:47

ఊరు చల్లగుండ
గప్పుడు ఊల్లందరు
కడుపునిండుగ కనుకున్నరు
చీమిడిముక్కు పోరగాండ్లతోటి
ఇండ్లన్నీ గలగలగుండేవి
ఇంటెన్క కొట్టముల
ముందటి గాడిఖాన్ల
గొడ్డుగోద పూలశెట్లు
తోకలూపుతూ మెడల్దింపుతూ
అత్తరు వాసన రివ్వుతుండేవి
పొద్దుగూకంగనే లైటు బుగ్గకు
గాసునూనె బుడ్డి మశిపట్టి
ఇల్లంతా మసకమస్గ గున్నా
ఏందో మరి

04/24/2016 - 01:38

ప్రేమించను - కానీ పువ్వందిస్తాను
ఎదలో పూయనపుడు కొనైనా ఇవ్వాలిగా
కోరిక అలాంటిది మరి.

నీతోటి సంతోషం - నాకేటి ఆనందం
చెల్లించుకో కాస్త స్నేహసుంకం
ఎదలో లేని కోలాహలాన్ని
అభినయంలోనైనా చూపాలిగా.

నీతోటి చెలిమి - నాకేటి కలిమి
అయినా చేస్తాను మాటల చెలిమి
పరిమళించని మాటలను
అవసరాల అత్తరులోనైనా ముంచి తీయాలిగా.

04/24/2016 - 01:36

ఆనందించాలంటే కవిత్వాన్ని
అర్థం చేసుకోవాలి కవితాత్మను
గుప్పించాలంటే వర్ణనలను
ఆవిష్కరించాలి మనసును...

చెట్టుకు నీరు పోయని వ్యక్తికి
రాలిన పువ్వు మీదా ఏం జాలి?
పక్షులకు ధాన్యం చల్లని వాడికి
ఈకల మెత్తదనం ఎట్లా తెలుస్తుంది...

04/24/2016 - 01:33

అక్కడ సాయంకాలాలు చదువుకుంటాయి
అక్కడ తరువులు తపస్సు చేస్తాయి
కొమ్మలు బొమ్మలు గీస్తాయి
రెమ్మలు కమ్మగా పాడుతాయి
రాళ్లూ రప్పలూ నిశ్శబ్దంగా పాఠాలు వింటాయి
గోడలు కావ్యగంధాలతో పరిమళిస్తాయి
లతలు పదబంధాలతో అల్లుకుంటాయి
సృజన పద్య పుష్పమై వికసిస్తుంది
అడుగుల సవ్వడులలో
అందమైన ఛందో గుణాలు లయిస్తాయి
నేలలు చరిత్రలు చెబుతాయి

04/17/2016 - 03:38

ఇంతీ! కనులకేల ఇంత బాధ
నీ రూపం కాంచినందులకేనా
నాలోకి నీ రూపం కొనిపోయినందులకేనా
నా గుండె గుడిలో నీవు
ప్రేమ దేవతవై కొలువయేందుకు
సహాయపడిన కనులకెందుకీ శిక్ష
వాగులు, వంకలు, పంట పొలాలు
పొద్దు పొడుపూ, సంధ్యాసమయం
పండు వెనె్నల, ఇంద్రధనస్సు
వంటి ఎన్నో వింతలతో
ప్రకృతి కనువిందు చేస్తుందనుకున్నా
కానీ ప్రకృతే వింతగా నీ రూపంలో

04/11/2016 - 02:25

అమ్మేవాడు అడిగిన కన్నా
అదనంగా ఇచ్చేవాళ్లని
మెచ్చుకోవాలి మనం
బడాబడా షాపుల మాట కాదిది
బడుగు జీవుల గురించి...

దూర ప్రాంతాల నుంచి
కూరగాయలు, పళ్లు తట్టలెత్తుకొని
కావడి మోసుకొని
తక్కువ ధరకు అమ్మే
కష్టజీవుల గురించి...

ఆకలి దప్పుల అవసరార్థం
తక్కువ ధరకు అమ్మేవాళ్లకి
అదనంగా ఇచ్చే దాతలను
మెచ్చుకోవాలి మనం

04/11/2016 - 02:24

ఉదయంతోనే మొదలు
అస్తమయం వరకు
అలుపెరుగని
అవిశ్రాంతిని
మెతుకు బువ్వకోసం
జానెడు పొట్ట కోసం
రేయనకా..
పగలనకా...
చెమ్మగిల్లినా...
సొమ్మసిల్లినా...
ఆలిబిడ్డల
పేగుబంధాల
ప్రేమలకు లీనమై
శ్రమను మరిపే
సంతోషబలం ఊరే
మండే ఎండలో
నీడై తోడై దప్పిక తీర్చే ఆలి
రెక్కల కష్టాన్ని మానే్ప
బిడ్డ చిరునవ్వు

Pages