S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

07/16/2016 - 22:24

గూడు జారిపోయింది
చెట్టులేని పక్షి
ఏ దిక్కునో ఎగిరిపోయింది
ప్రవాహంలో పడి చందమామ
ఏ దరుల్లోనో కొట్టుకపోయింది
నిర్మలాకాశపు నక్షత్ర చేపలు
కకావికలం
మొరటు అడుగుల శబ్దాలకు
నిఘంటులైన కొండదారులు
మాయమై పోయాయి
విప్పపూలు, అడవితేనె
వెలగపండు, వెదురుపూత
ఎనె్నలపిట్ట, నెమలికన్ను
గొర్రెపోతు, గొర్రమోతు
దుప్పికొమ్ము, కొమ్ముబూర

07/16/2016 - 21:40

లోకోభిన్నరుచిః అంటే ఇదేకదా!. ఒత్తుగా పెరిగిన బొచ్చుతో ముద్దుగా ఉన్న పెంపుడు శునకం రూపును తనకు ఇష్టంవచ్చిన విధంగా మార్చాలనుకున్నాడు దాని యజమాని. అంతే టెడ్డీబేర్‌లా కన్పించేట్టు దాని బొచ్చును ఇలా కత్తిరించారు. తైవాన్‌లోని తైనన్ నగరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

07/16/2016 - 21:39

అదేదో సినిమాలో ‘నాకు బెల్లం అంటే ఇష్టం’ అన్న ఓ డైలాగ్ పాపులర్ అయ్యిందికదా. అలాగే ఈ కోతిపిల్లను చూస్తే దానికి జిలేబీ అంటే ఇష్టం అని అనిపిస్తోందికదూ! కోల్‌కతా వీధుల్లో తిరిగే ఈ పెంపుడుకోతి పేరు ‘ముసాఫిర్’. రంజాన్ కదా... దాని యజమాని ప్రేమగా ఓ జిలేబీ ఇచ్చాడు. దానిని చక్కగా, విరపకుండా తినే ప్రయత్నంలో ఉన్న ఈ కోతి చూపులోనే ఆ జిలేబీ అంటే ఇష్టమెంతో తెలిసిపోతోందికదూ!

,
07/16/2016 - 21:37

కళాకారుల సృజనాత్మకతకు ఇదో ఉదాహరణ. వివిధ రకాల రంగులతో శరీరాన్ని విభిన్నంగా తీర్చిదిద్దుకోవడాన్ని ‘బాడీ పెయింటింగ్’గా పిలుస్తున్నారు. ఆస్ట్రియాలో ఈ మధ్య ఈ అంశంలో వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీలూ నిర్వహించారు. ఆ పోటీలకు హాజరైన కళాకారుల రూపవిన్యాసాలు ఇవి. 45 దేశాలనుంచి 300 మంది కళాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. బ్రష్, ఎయిర్‌బ్రష్, స్పాంజ్, స్పెషల్ ఎఫెక్ట్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు.

07/09/2016 - 21:33

సముద్రతీరంలో ఇసుక తినె్నలపై కన్పిస్తున్న ఈ సుందరాంగి మత్స్యకన్యలా కన్పిస్తోంది కదూ! కానీ ఆమె మత్స్యకన్యలా కన్పిస్తున్న ఓ ఔత్సాహికురాలు. బ్రూక్లిన్‌లో ఏటా వేసవి ప్రారంభంలో ఇలా చిన్నాపెద్దా మహిళలు ఇలా వేషధారణతో పరేడ్‌లో పాల్గొనడం ఆనవాయితీ. సాధారణంగా జూన్ చివర్లో ఈ మెర్‌మెయిడ్ పరేడ్ నిర్వహిస్తూంటారు. ఈ ఏడాది ప్రదర్శనలో పాల్గొన్న ఓ మహిళ ఈమె. వేలాదిమంది ఈ ప్రదర్శనలో పాలుపంచుకోవడం రివాజు.

07/09/2016 - 21:32

కళాకారుల్లో సృజనాత్మకతకు లోటుండదు. అందుకు ఇక్కడి చిత్రాలే నిదర్శనం. ఈ కళాకారిణి పేరు లౌరా జెన్‌కిన్‌సన్. ప్రఖ్యాత కామిక్, కార్టూన్ చిత్రాల్లోని బొమ్మలను ఇలా పెదాలపై చిత్రించడం ఆమెకు ఇష్టం. ‘100 డేస్ ఆఫ్ మేకింగ్ ఛాలెంజ్’ శీర్షికన ఆమె వంద రోజులూ వరుసగా ఇలా పెదాలపై విభిన్నమైన బొమ్మలను చిత్రించి అభిమానుల మెప్పు పొందారు.

07/09/2016 - 21:30

ఈ పిల్లికి ఉన్న ఆదరణ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది సూపర్ మోడల్ క్యాట్. ఈ మధ్య చైనాలో పంపిణీ అయిన ప్రఖ్యాత ‘వోగ్’ మ్యాగజిన్ కవర్‌పై దీనికి చోటు దక్కింది. దీని కళ్లలో ఒకటి ఆకుపచ్చగానూ, మరోటి నీలిరంగులోనూ ఉండటం పెద్ద ఆకర్షణగా మారిపోయింది. లండన్‌లో పెంపుడు జంతువులను సంరక్షించి మోడలింగ్ చేసే సంస్థ దీని విశిష్టతను గమనించి దాని యజమాని సాజా సిల్వస్‌ను సంప్రదించింది. ఇక అక్కడినుంచి దాని దశ తిరిగింది.

07/02/2016 - 23:00

దట్టమైన బొచ్చుతో, పొట్టవద్ద సంచీల్లా వేళ్లాడేలా ఉండటం వీటి ప్రత్యేకత. సముద్రమట్టానికి 9500 అడుగుల ఎత్తున మంచు ప్రాంతాల్లో ఇవి జీవించడానికి ఇష్టపడతాయి. పొడవైన కోరపళ్లు వీటికి అదనపు బలం. చదునైన ముఖం, పొట్టి చెవులు, తీక్షణమైన చూపువల్ల ఇవి మిగతా పిల్లులకన్నా భిన్నంగా కన్పిస్తాయి. అన్నట్లు వీటి పేరు...‘పల్లాస్ క్యాట్స్’. మధ్య ఆసియాలో ఎక్కువగా కన్పిస్తాయి.

07/02/2016 - 21:11

ఈ పిల్లిని చూసి ముచ్చటపడని వారు లేరంటే నమ్మాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీని హవా స్పష్టంగా కన్పిస్తుంది. నెదర్లాండ్‌కు చెందిన జొనె్న స్మెర్స్ దీని యజమాని. దీని పేరు జోయ్. దీనికి ఓ తోబుట్టువుకూడా ఉంది. ఈ రెండింటిని ఓ జూనుంచి జొనె్న దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు. ఆ తరువాత వీటిలో జోయ్ ఫొటోను సోషల్ నెట్‌వర్క్‌లో పోస్ట్ చేశాడు. ఇక అంతే దాని పేరు మారుమోగిపోయింది.

07/02/2016 - 21:10

అప్పుడెప్పుడో విడుదలై ఇప్పటికీ జనాదరణ కలిగిన స్పైడర్‌మన్ సినిమాలు ఇప్పటికీ అందరికీ గుర్తే. ఆ చిత్రంలో హీరో వేసుకున్న డ్రెస్ చాలా పాపులారిటీ సంపాదించింది. ఇదిగో అశాంతితో రగిలిపోతున్న గాజాలో ఓ కుర్రాడు ఇప్పుడు ఓ స్పైడర్‌మన్ గా పేరు కొట్టేశాడు. ఆ పట్టణంలో నలుగురు కన్పించినచోట ఇదిగో..ఇలా మెలికలు తిరిగిపోతూ ఇచ్చే ప్రదర్శనలు, అతడు వేసుకున్న డ్రెస్‌తో అతడికి ఆ పేరు వచ్చేసింది.

Pages