S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవీ .. ఇవీ..

05/20/2017 - 20:39

ఫొటోగ్రఫీ ఒక కళ. ప్రపంచంలోని ప్రకృతి అందాలను తిలకిస్తూ తమ కెమెరాల్లో బంధించడం కొందరికి హాబీ. మరికొందరికి ప్రాణం. అలాంటివారి కోసం ప్రఖ్యాత నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ వరల్డ్ ట్రావెలింగ్ పోటీలు నిర్వహిస్తోంది. జూన్ 30లోగా ఫొటోగ్రాఫర్ల నుండి ఎంట్రీలను కోరుతోంది. ఇప్పటికే కుప్పలు తెప్పలుగా వస్తున్న అందమైన ఫొటోలలో కొన్నింటిని తమ వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేసింది.

05/07/2017 - 05:32

అందాల కాశ్మీర్‌లో కనిపిస్తున్న దృశ్యం ఇది. హిమాలయాల చెంతనే ఉన్నా కశ్మీర్‌లో ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. ఆ వేడిని తట్టుకోలేనివారు ఇదిగో ఇలా ‘తావి’ నదిలో జలకాలాడుతున్నారు. అదే నదిలో, పక్కనే గేదెలు, దున్నలు ఉన్నా పట్టించుకునే స్థితిలో లేని వారు నీటిఆటలతో ఆనందంలో తేలిపోతున్నారు. వేసవి మినహా మిగతా రోజుల్లో అక్కడ మంచువానలు కురియడం మామూలే.

05/07/2017 - 05:31

ఓ వృక్షంలా ఆకులుఅలములతో దుస్తులు తయారు చేసుకుని పోటీలోకి దిగడం ఓ ఉత్సవం. గ్రీన్‌మాన్ స్ప్రింగ్ ఫెస్టివల్‌గా పిలిచే ఈ వేడుక బ్రిటన్‌లోని బోయె ట్రేసీ ప్రాంతంలో విస్తృతంగా జరుగుతుంది. పదహారవ శతాబ్దం నుంచి ఈ సంప్రదాయం ఉంది. మేడే వేడుకల్లో భాగంగా, విత్తనాలు నాటి సేద్యానికి సిద్ధమైన రైతులకు కాస్తంత విశ్రాంతి దొరికిన సందర్భంగా ఈ వేడుక నిర్వహిస్తారు.

05/07/2017 - 05:29

నాలుగేళ్ల ఈ బాతు, ఏడేళ్ల శునకం మధ్య స్నేహం వెల్లివిరిసింది. వాటి యజమానురాలికి వీటిని చూసినప్పుడల్లా ఆనందం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ శునకం పేరు బార్‌క్లే. బాతు పేరు రూడీ. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇలా బార్‌క్లే శిరస్సుపై తల ఆన్చి సేదదీరడం రూడీకి ఎంతో ఇష్టమట. ఆ అలా చేసినప్పుడు బార్‌క్లే కూడా ఎంతో ఉల్లాసంగా కన్పిస్తుందంటోంది వాటి యజమానురాలు పామ్ ఇషిగురొ.

05/05/2017 - 22:59

ఓ పాత విమానాన్ని ఇంద్రభవనంగా భావిస్తున్నాడు ఓ ఇంజనీర్. ఎప్పుడూ ఏదో కొత్తదనం కోసం పరితపించే ఆ ఇంజనీర్ పేరు బ్రూస్ కాంప్‌బెల్. కాలంతీరిన బోయింగ్ 727ను తన ఇల్లుగా మార్చుకున్న అతగాడు ఏడాదిలో సగం రోజులు అందులోనే నివసిస్తున్నాడు. ఒరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌లో ఆ విమానాన్ని సిమెంట్ పిల్లర్లపై నిలిపి అందులో హాయిగా గడుపుతున్నాడు. లోపల సీట్లను తనకు కావలసిన విధంగా మార్చుకున్నాడు.

05/05/2017 - 22:57

థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ఎప్పటిమాదిరిగానే ఈమధ్య ఓ వినూత్న పరుగుపందెం నిర్వహించారు. కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న జంటల మధ్య పరుగుపోటీ అన్నమాట. జంటగా పరుగెట్టి గెలవాలి. అలా గెలిచినవారికి దాదాపు 28వేల అమెరికన్ డాలర్ల విలువైన బహుమతులు ఇస్తారు. మొదటి బహుమతి సాధించిన జంటకు దేశంలోని ప్రఖ్యాత రిసార్టులో హనీమూన్‌తోపాటు మరో దేశంలో పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తారు.

05/05/2017 - 22:54

ఈ పదేళ్ల బాలిక పేరు ఇసబెల్లా నికొల కాబ్‌రెర. అమెరికాకు చెందిన ఈ అమ్మాయికి పుట్టినప్పుడే ఒక చేయి భుజంవరకే ఉంది. అదీ తీరుతెన్నూ లేకుండా. జార్జ్ మాసన్ యూనివర్శిటీకి చెందిన బయో ఇంజనీరింగ్ విద్యార్థి అబ్దుల్‌గౌడ బృందం ఆమెను చూసి చలించిపోయారు. తమ పరిశోధనలు ఆమెకు ఎలా ఉపయోగపడతాయా అని ఆలోచించారు. ఆమెకు ట్యూషన్ చెప్పే టీచర్‌ను కలిశారు. ఇసబెల్లాకు వయొలిన్ వాద్యమంటే ఇష్టం అని తెలుసుకున్నారు.

04/29/2017 - 21:05

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నులు ఎగ్గొట్టారన్న కోపం ఇంకా ప్రజల్లో తగ్గలేదు. తన ఆదాయానికి సంబంధించిన రికార్డులను బహిరంగపరచాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతోంది. ట్రంప్ వైఖరికి నిరసనగా ఓ మహిళ ఇలా డాలర్ నోట్లను ముఖానికి అలంకరించుకుని నిరసన తెలుపుతోంది.

04/29/2017 - 21:04

బొమ్మలంటే చిన్నపిల్లలకు కదా బాగా ఇష్టం. వాటితో ఆడుకోవడం వారికి ఇష్టమైన పని కదా!. కానీ ఈ చిత్రంలో కనిపిస్తున్న 86 ఏళ్ల బామ్మ బొలెమన్‌కు కూడా బొమ్మలంటే పిచ్చి. 65 ఏళ్లుగా ఆమె తనకు నచ్చిన బొమ్మలను సేకరించి ఒక చోట చేర్చింది. దాదాపు 20వేల బొమ్మలను చుట్టూ పేర్చుకుని ముచ్చటపడటం ఆమెకు మరింత ఇష్టం. ఆ సరదాయే బెల్జియంలో ఆమెను సెలబ్రిటీగా మార్చింది మరి.

04/29/2017 - 21:02

పాశ్చాత్య దేశాల్లో పెంపుడు జంతువులతో బయట తిరగడం చాలామందికి ఇష్టం. అయితే వాటిని ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడికిపడితే అక్కడికి తీసుకువెళ్లేందుకు అవకాశాలు తక్కువే. ఎన్నో నియమనిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హోటళ్లకు వాటితో కలసివెళ్లడం కుదరదు. అందుకే ఇంగ్లండ్‌లో పెంపుడు పిల్లులకోసం ఓ హోటల్ ఈ మధ్యే వెలసింది. ఇప్పుడు పెంపుడు కుక్కలకోసం కూడా అలాంటి హోటల్ ఏర్పాటు చేశారు.

Pages