S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

10/22/2016 - 22:33

ప్రపంచంలో అత్యధిక కాలం జీవించి, ఎత్తు పెరిగే చెట్లు ఇవి. కాలిఫోర్నియాలోని సియర్రా నవడ పర్వతప్రాంతంలో మాత్రమే ఇవి కన్పిస్తాయి. వీటిని జెయింట్ సెక్వోయి, జనరల్ షెర్మన్, రెడ్‌వుడ్, హైపెరియాన్‌లని పిలుస్తారు. 3500 సంవత్సరాల జీవితకాలం ఉండే ఈ చెట్లు కనీసం 250 అడుగుల మేర ఎత్తు పెరుగుతాయి. ఈ చెట్లకు సగభాగం పైన మాత్రమే ఆకులు విస్తరిస్తాయి. వీటి కాండం చుట్టుకొలత (వ్యాసార్థం) కనీసం 26 అడుగులు ఉంటుంది.

10/22/2016 - 22:31

నల్లగా ఉండే పెద్దతేళ్లను మనం బండ్రగప్పలని పిలుస్తాంకదా. మహా అయిదే రెండుమూడు అంగుళాలుంటాయి అవి. కానీ ఆఫ్రికాలోని అడవుల్లో కన్పించే 3ఎంపరర్ స్కార్పియన్స్2 ప్రపంచంలోనే అతిపెద్ద తేళ్లుగా చెబుతారు. అవి కనీసం 8 అంగుళాల వరకు పెరుగుతాయి. వీటి కొండెలు అతిపెద్దవి, భయంకరంగా ఉంటాయి. మెరిసిపోయే నలుపు, ముదురు నీలం లేదా అకుపచ్చ రంగులోనూ కన్పిస్తాయి.

10/16/2016 - 00:35

పులుల జాతిలో మూడవ అతిపెద్ద జీవిగా చెప్పుకునే చిరుతల్లో జాగ్వార్ ఒకటి. మిగతా పులుల జాతికన్నా దీనికి విభిన్నమైన లక్షణాలు ఉన్నాయి. జాగ్వార్ అని పిలిచే వీటికి నీళ్లంటే ఇష్టం. ఈతకొట్టడం సరదా. చాటుగా ఉండి హఠాత్తుగా దాడి చేయడం, ఒకేసారి దూకి శత్రువులను చంపేయడం వీటికి అలవాటు. వీటికి ప్రధాన శత్రువులు మనుషులు, అనకొండ పాములు మాత్రమే. జాగ్వార్‌లు అవకొడ పళ్లను తింటాయంటే నమ్మాల్సిందే.

10/16/2016 - 00:32

చీమ కుడితే చురుక్కుమంటుంది. అంతేనా? అలా అంటే అమెరికన్లు ఒప్పుకోరు. ముఖ్యంగా రెడ్ ఫైర్ యాంట్స్ అంటే వారికి భయం..చిరాకు. అవి కుడితే కలిగే మంట అలా ఉంటుంది. పైగా పంటలకు అవి కలిగించే నష్టాలు వారికి పెద్దసమస్యగా మారిపోయింది. నిజానికి ఈ ఎర్రచీమలు వారి దేశానికి చెందినవి కావు. పొరపాటున ఓ ఓడనుంచి అమెరికాకు వచ్చి చేరాయి. పంటలకు చీడగా వీటిని ప్రభుత్వం ప్రకటించింది.

10/16/2016 - 00:29

రోమన్ల కాలంలో బిస్కెట్‌ను కనుగొన్నారు. జలమార్గాల్లో సుదీర్ఘకాలం ప్రయాణం కొనసాగించేవారికి నిల్వ ఉండే ఆహారాన్ని అందించేందుకు చేసిన పరిశోధనలు బిస్కెట్‌కు రూపం ఇచ్చాయి. బిస్, కొకట్ అనే లాటిన్ పదాల ఆధారంగా బిస్‌కిట్ అన్న పదం వచ్చింది. మనం రాసే ఇంగ్లీషు స్పెల్లింగ్ అన్నది నిజానికి సరైన పదం కాదు. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో బిస్‌కెట్(బిఐఎస్‌కెఇటి) అని మాత్రమే ఉంటుంది.

10/08/2016 - 23:56

తలపై పసుపచ్చని పింఛం, తెల్లటి మేనిఛాయతో మెరిసిపోయే ఈ చిలుకలకు అందమే శత్రువుగా మారిపోయింది. పెంపకం, ప్రదర్శనల కోసం వీటిని అక్రమంగా పట్టుకుని విక్రయించడం, అవి మనుగడ సాగించలేకపోవడంతో గణనీయంగా వీటి సంఖ్య తగ్గిపోయింది. అధికారుల లెక్కల ప్రకారమే 1980-92 సంవత్సరాల మధ్య కనీసం లక్ష పక్షులను అక్రమ రావాణా చేయడం, అవి మరణించడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచం మొత్తంమీద 7వేల పక్షులు మాత్రమే మిగిలాయని అంచనా.

10/08/2016 - 23:53

దాదాపు అంతరించి పోయే దశకు చేరుకుంటున్న ఈ చిలుకలను కకా పారెట్స్‌గా పిలుస్తారు. న్యూజిలాండ్‌లోని కొన్ని దీవుల్లో మాత్రమే అతి పరిమిత సంఖ్యలో ఇవి కన్పిస్తున్నాయి. కనీసం పదికోట్ల సంవత్సరాల క్రితం అసలు చిలుకల జాతికి దూరం కావడంతో వీటిరూపురేఖల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అనేక క్షీరదజాతి జీవులనుంచి వీటికి పెద్దఎత్తున ముప్పు ఏర్పడింది. మిగతా చిలుకలకు భిన్నంగా ఇవి కన్పిస్తాయి.

10/08/2016 - 23:51

ఈ సీతాకోక చిలుకల రెక్కలు అద్దంలా పారదర్శకంగా ఉంటాయి. అందుకే వీటిన గ్లాస్‌వింగ్ బట్టర్‌ఫ్లైస్ అని పిలుస్తారు. ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల్లో ఇవి కన్పిస్తాయి. ముఖ్యంగా కోస్టారికా, మెక్సికోల్లో ఇవి ప్రత్యేక ఆకర్షణ. వీటి రెక్కల్లో రంగులు లేకపోవడం వల్ల అవి పారదర్శకంగా కన్పిస్తాయి. రెక్కల అంచుల్లో మాత్రమే ముదురు రంగులు ఉంటాయి. తేనె, పక్షుల రెట్టలు వీటి ప్రధాన ఆహారం.

10/02/2016 - 05:37

అమెజాన్ అడవుల్లో మాత్రమే కన్పించే ఈ చీమలు కుడితే చుక్కలు కనిపిస్తాయి. బుల్లెట్ గాయం అయినప్పుడు ఎంత బాధ ఉంటుందో ఈ చీమలు కుట్టినపుడుకూడా అంతే బాధ ఉంటుందట. అందుకే ఈ చీమలను బుల్లెట్ యాంట్స్ అని పిలుస్తారు. మామూలు తేనెటీగలు కుడితేనే మనం తట్టుకోలేం కదా. ఈ బుల్లెట్ చీమలు కుడితే వాటికన్నా పదిరెట్లు ఎక్కువ నొప్పి ఉంటుందట.

10/02/2016 - 05:36

అమెరికాలోని టెక్సాస్ తీరంలోను, మెక్సికోలోని ఒకటీ అరా ప్రాంతంలోను, వెస్ట్రన్ గల్ఫ్ కోస్ట్‌లో మాత్రమే కన్పించే ఈ అందమైన, అరుదైన ఈ కోళ్లను అట్‌వాటర్ ప్రెయిరీ చికెన్ అంటారు. గ్రేటర్ ప్రెయిరీ చికెన్ జాతికి చెందిన ఇవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. 1900 నాటికి ఈ ప్రపంచంలో పది లక్షల వరకు ఈ కోళ్లుంటే ఇప్పుడు కేవలం 250 మాత్రమే ఉన్నాయని 2014లో లెక్కలు తేల్చారు. వాటిలో వంద మాత్రమే స్వేచ్ఛగా ఉన్నాయి.

Pages