S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

01/28/2017 - 23:35

ఔను. ‘్ఫగ్’ అని పిలిచే ‘అత్తి పండ్లు’ తింటే పొగాకు వాడకంపై ఏవగింపు పెరుగుతుందట. ఇది నిజమేకూడా. అందుకే సిగరెట్లు తాగేవారు ఆ అలవాటు మానుకోవాలంటే ఈ పళ్లను తినమని వైద్యులు సూచిస్తారు. మధ్యప్రాచ్యం, ఆసియా దేశాల్లో పుట్టి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడుతున్న ఫిగ్ తియ్యటి గుజ్జుతో కూడిన పండు. వీటిని ఔషధ పరిశ్రమలో క్రీములు, లోషన్స్ తయారీకి వాడతారు. కాస్మొటిక్ పరిశ్రమలోనూ దీనిని ఉపయోగిస్తారు.

01/28/2017 - 23:34

రకూన్స్ కుటుంబానికి చెందిన ఈ ‘కిన్‌కజూ’లను స్పానిష్ భాషలో ‘ల ల్లొరొన’ అని పిలుస్తారు. ఆంగ్లంలో దీని అర్థం ‘క్రయింగ్ విమెన్’ అని. ఇది విభిన్న రకాలుగా అరిచే జంతువే అయినా ఒక్కోసారి మహిళలు ఏడుస్తున్న విధంగా పెద్దశబ్దంతో ఇవి అరుస్తాయి. అందుకే వీటికి ఆ పేరు వచ్చింది. మెక్సికో, ఉత్తర, మధ్య అమెరికాలో ఇవి కనిపిస్తాయి. ఐదు అంగుళాల పొడవైన నాలిక వీటికి ప్రత్యేకం.

01/28/2017 - 23:33

కుక్కల జాతికి చెందిన తోడేళ్లలో ‘గ్రే వోల్ఫ్’ చాలా దేశాల్లో కనిపిస్తాయి. కోరపళ్లు, బలమైన దంతాలు, దవడలతో చిన్నచిన్న జంతువులను చీల్చిచెండాడి పీక్కు తినడంలో వీటికి పోటీ లేదు. ఇది అందరకూ తెలిసిందే. కానీ చాలా సందర్భాలలో ఇవి కొన్ని రకాల పళ్లను వెతికివెతికి మరీ తింటాయి. ముఖ్యంగా పియర్స్ పళ్లంటే వీటికి ఎంతో ఇష్టం. ఫిగ్స్, యాపిల్స్ నైట్‌షేడ్ కౌబెర్రి, బిల్‌బెర్రి పళ్లనూ, లిల్లీ పూలనూ తింటాయి.

01/21/2017 - 22:47

దక్షిణ అమెరికాలోని అతికొద్ది దేశాల్లో మాత్రమే కనిపించే ఈ ఎలుగుంట్ల పేరు వాటి కళ్ల ఆధారంగా వచ్చింది. వీటిని ‘స్పెక్టకల్డ్ బేర్స్’ అని పిలుస్తారు. వాటి కళ్లవద్ద ఉంటే మచ్చలు కళ్లద్దాల్లా కన్పించడం వల్ల ఆ పేరు వచ్చింది. ప్రతి ఎలుగుబంటికి ఈ మచ్చలు చూడటానికి ఒకేలా ఉన్నా భిన్నాంగా ఉంటాయి. పుట్టినప్పటి నుంచి ఈ మచ్చలు వాటికి వస్తాయి. మన వేలిముద్రల్లా.

01/21/2017 - 22:45

జపాన్‌లోని మూడు దీవుల్లో మాత్రమే కనిపించే అరుదైన కోతులు ఇవి. ఇవి తెలివైన జీవులు. ఆహార సేకరణ, అనుకరణ, కొత్త విషయాలు నేర్చుకోవడంలో చురుకుగా, తెలివిగా వ్యవహరిస్తాయి. 35 అంగుళాల ఎత్తువరకు పెరిగే ఈ కోతులు మంచులోనూ జీవిస్తాయి. ఒతె్తైన బొచ్చు వీటి ప్రత్యేకత. శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోకుండా సమూహంగా, ఒకదానిని ఒకటి పట్టుకుని దగ్గరగా ఉంటాయి. వీటి ముఖం ఎర్రగా మారితే అవి యుక్తవయస్సుకు వచ్చినట్లు లెక్క.

01/21/2017 - 22:44

జతకట్టేందుకు ఆడపక్షి ముందు లయబద్ధంగా నృత్యం చేసే ఈ సముద్ర పక్షుల పేరు ‘బ్లూ ఫుట్ బూబీ’. అందమైన నీలిరంగు పాదాలతో కనిపించే ఈ పక్షులు ‘కోర్ట్‌షిప్’ డ్యాన్స్‌కు పెట్టిందిపేరు. అయితే వాటి కాళ్ల రంగు వెనుక అతి ముఖ్యమైన రహస్యం ఉంది. అవి తినే ఆహారాన్ని బట్టి నీలిరంగు వస్తుంది. కరోటినాయిడ్స్‌తో కూడిన పిగ్మెంటేషన్ వల్ల ఆ రంగు వస్తుంది. రోగనిరోధక శక్తిని ఈ రంగు కలిగిస్తుంది.

01/21/2017 - 22:42

క్రీ.శ. వెయ్యి సంవత్సరంలోనే వస్తువులు స్పష్టంగా చూసే ఓ పరికరాన్ని కనిపెట్టారు. కళ్లద్దాలు కాదుగానీ ఒ తరహా రాయితో దీనిని తయారు చేశారు. రోమ్, చైనాల్లో 1200 సంవత్సరం నాటికి కళ్లద్దాల వాడకం మొదలైంది. నిజానికి పెద్దలకోసమే వాటిని కనిపెట్టారు. ఇప్పటికీ చాలా ఆఫ్రికా దేశాల్లో కళ్లజోడు కొనడం ఖరీదైన వ్యవహారమే. కొన్నిచోట్ల కళ్లజోడు ఖరీదు వారి మూడునెలల వేతనానికి సమానం.

01/07/2017 - 23:59

ఇక్కడ కనిపిస్తున్న ‘ఒస్సొమ్’ అనే క్షీరదం మరణించినట్టు కనిపిస్తోంది కదూ!. కానీ అది జీవించే ఉంది. శత్రువులను ఏమార్చడానికి అలా చచ్చినట్లు పడి ఉంది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోను, కెనడాలోను కంగారూల మాదిరిగా పిల్లల్ని కనడానికి ఉండే పొట్టసంచీ ఉన్న ఏకైక క్షీరదం ఇది. వీటిని ఒస్సొమ్, పొస్సొమ్ అని పిలుస్తారు. 35 అంగుళాల పొడవు, మూడు కేజీల బరువు వరకు పెరిగే ఈ జంతువుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

01/07/2017 - 23:57

దాదాపు 5 వేల సంవత్సరాల క్రితమే దువ్వెన వాడకం మొదలైంది. 160 ఎ.డి. నాటి దువ్వెన ఇప్పటికీ భద్రంగా ఉంది. రాతియుగంలో కూడా దువ్వెనలను విస్తృతంగా వాడారు. రాయి, ఎముకలు, ఏనుగు దంతాలు, విలువైన లోహాలు, చివరకు గాజుతోకూడా అప్పట్లోనే దువ్వెనలు తయారు చేశారు. ఇప్పుడు ప్లాస్టిక్, ఫైబర్, సిలికాతో కూడా దువ్వెనలు వస్తున్నాయి. పాతరోజుల్లో వెండి, బంగారు, వజ్రాలు, నవరత్నాలు పొదిగిన దువ్వెనలు వాడేవారు.

12/31/2016 - 18:53

ఇక్కడ కనిపిస్తున్న సముద్రజీవి పేరు కాంబో జెల్లీ ఫిష్! కానీ ఇది జెల్లీ ఫిష్ జాతికి చెందినది కాదు. అసలు జెల్లీ చేపలతో ఎటువంటి సంబంధమూ లేని జాతి ఇది. పారదర్శకంగా కనిపించే కాంబో జెల్లీ చేపలు కుట్టలేవు. వీటి శరీరంలో 95 శాతం నీరే ఉంటుంది. దువ్వెనపళ్లలాంటి ఎనిమిది వరసల భాగాలతో ఇవి ఈదుతాయి. వీటిని సిలియా అని పిలుస్తారు. దువ్వెన పళ్లవరసలా ఇవి ఉంటాయి. అందుకే వీటిని కాంబో అని పిలుస్తారు.

Pages