S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

08/21/2016 - 04:42

కోరల్ రీఫ్స్‌లో కన్పించే ఈ అక్వేరియం జలచరం పేరు ఫైర్ ష్రింప్. ఎర్రగా ఉండటం వల్ల వీటిని బ్లడ్ ష్రింప్ అని పిలుస్తారు. వీటికి సిగ్గు, బిడియం ఎక్కువ. ఎక్కువ సేపు రాళ్ల సందులు, గుహల్లాంటి లోతైన ప్రాంతాల్లో దాక్కునే ఉంటాయి. చేపలపై ఉండే పరాన్నజీవులను, చేపలు, ఇతర జలచరాలు వదిలేసిన మాంసపు తునకలను తింటాయి. ఒకరకంగా ఇవి పారిశుద్ధ్యం పనులు చేస్తాయనే చెప్పాలి.

08/13/2016 - 03:00

మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో కన్పించే ఈ క్షీరదం పేరు రాక్‌హైరాక్స్. రాళ్ల గుట్టల్లో గుంపులుగా ఉండటానికి ఇష్టపడే ఇవి స్నేహానికి చాలా ప్రాధాన్యం ఇస్తాయి. దాదాపు 50 వరకు ఒక గ్రూపుగా జీవిస్తాయి. అవన్నీ ఓ ప్రాంతాన్ని తమ సామ్రాజ్యంగా ఏర్పాటు చేసుకుంటాయి. సమీపంలో ఉండే అలాంటి బృందాలతో సన్నిహితంగాను, సహాయకారిగానూ వ్యవహరిస్తాయి. రోడులో 95శాతం సమయం అవి విశ్రాంతి తీసుకుంటాయి.

08/13/2016 - 02:58

ఈ కీటకాల పేరు బ్యాక్‌స్విమ్మర్స్. వాటర్ బోట్‌మన్ అని కూడా ఈ కీటకాలను పిలుస్తారు. ఇవి నీటి ఉపరితలంపై వీపు ఆనించి, వెల్లకిలా ఈదడం వీటి స్పెషాలిటీ. అందుకే వాటికి ఆ పేరు వచ్చింది. వీటికి ఆరు కాళ్లుంటాయి. చివరి రెండుకాళ్లు అతి పొడవుగా ఉండి ఈదడానికి తెడ్ల మాదిరిగా వినియోగిస్తాయి. మూతివద్ద ఉండే ఒక గొట్టంవంటి భాగం ద్వారా శత్రువు లేదా ఆహారాన్ని పట్టుకుంటాయి.

08/13/2016 - 02:56

ఆర్కిటిక్ ప్రాంతంలో ఐస్ ఏజ్‌నుంచి జీవిస్తున్న జాతి మస్క్ ఆక్స్. శీతాకాలంలో వీటికి పెరిగే బొచ్చు ‘కివిట్’ (రెండు పొరలుగా ఏర్పడే ఉన్ని) ఈ భూమీద అతి నాణ్యమైన, విలాసవంతమైన, వెచ్చదనాన్ని ఇచ్చే అతి ఖరీదైనదిగా ప్రఖ్యాతి గాంచింది. వాతావరణంలో వేడి పెరిగే కొద్దీ వీటి శరీరంపై బొచ్చు ఊడిపోతుంది. వీటికి ఉండే బలమైన కొమ్ములతో మంచును తొలగించి నీటిని తాగుతాయి.

07/31/2016 - 00:37

గోల్డ్ఫిష్‌లలో ఇవి ప్రత్యేకమైనవి. వీటి కళ్లకింద ‘క్యారీబ్యాగ్’లలాంటి సంచులుండటమే వీటి ప్రత్యేకత. వీటివల్ల ఆ చేపలకు ఆసౌకర్యమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. వివిధ జాతుల గోల్డ్ఫిష్‌ల సంకరం చేయడం వల్ల ఈ తరహా చేపలు పుట్టుకొచ్చాయి. ఒకరకమైన ద్రవపదార్థాలతో ఈ కళ్లకింద సంచులుంటాయి. ఆహారాన్ని గుర్తించడానికి, స్వేచ్ఛగా ఈదడానికి అడ్డంకిగా ఉండే ఈ సంచులు పగిలితే వాటికి ఇన్‌ఫెక్షన్స్ వచ్చి మరణిస్తాయి.

07/31/2016 - 00:35

మాటువేసి, హఠాత్తుగా దాడిచేసి ప్రత్యర్థిని చంపేసే ఈ జీవిని ‘అసాసిన్ బగ్’ అని పిలుస్తారు. ఆహారాన్ని సేకరించడం, దాడి చేసే విధానాన్నిబట్టి దానికి ఆ పేరు వచ్చింది. దాదాపు 6వేల రకాలున్న ఈ జాతిలో విభిన్నరూపాల్లో, రంగుల్లో, సైజుల్లో ఉంటాయి. ఇవి వేటకు దిగితే 99శాతం విజయం సాధించాయన్నమాటే. ఇతర కీటకాలు, జీవులపై దాడి చేసి, వాటి వెన్నువిరిచి తినేస్తాయి.

,
07/31/2016 - 00:33

సుగంధ ద్రవ్యంగా మనం విస్తృతంగా వాడే దాల్చిన చెక్క ఓ రకం వృక్షానికి చెందిన బెరడు. కేవలం శ్రీలంక, ఇండియాలలో విస్తృతంగాను, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లలో పరిమితంగాను దాల్చిన చెట్లు పెరుగుతాయి. అమెరికాలో అయితే దాల్చిన చెట్లు మొలవనే మొలవవు. మిగతా ప్రాంతాల్లో ఇది కన్పించదు. ఏపుగా పెరిగిన దాల్చిన చెట్లకు ప్రతి రెండేళ్లకు ఒకసారి పై బెరడు వలిచేస్తారు. అలా వలిచిన బెరడు పైపొరను వేరుచేస్తారు.

07/24/2016 - 05:05

ఔను..రోకలిబండ అని పిలిచే సహస్రపాది (మిల్లిపెడె) నేలమీద మనుగడ సాగించిన తొలి జీవిగా శాస్తవ్రేత్తలు చెబుతారు. దాదాపు 480 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఆధారాలతో వారు ఈ విషయాన్ని చెబుతున్నారు. మిల్లిపెడె అంటే వెయ్యికాళ్ల జీవి అని లాటిన్‌లో అర్థం. నిజానికి అన్నికాళ్లు వీటికి ఉండవు. వందనుంచి 750 వరకు ఉంటాయి. జెర్రికి, రోకలిబండకు స్పష్టమైన భేదం ఒకటి ఉంది.

07/24/2016 - 04:57

‘వందకాళ్ల జెర్రి’, ‘శతపాది’ అని మనం పిలిచే ‘సెంటిపెడె’కు నిజంగా అన్ని కాళ్లుండవు. మహా అయితే 15నుంటి 30 జతల కాళ్లుంటాయంతే. మొదటి జత కాళ్లు నడవడానికి ఉపయోగించవు. విషంతో కూడుకున్న ఆ రెండు కాళ్లతో ఆహారాన్ని పట్టుకోవడం లేదా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు కుట్టడానికి ఉపయోగిస్తాయి. ఫలకాల గదులతో (షెల్) కూడిన శరీరంతో అతివేగంగా నడిచే జీవి ఇది. ప్రతి షెల్‌కు ఒక జత కాళ్లుంటాయి.

07/24/2016 - 04:39

సాంగ్ బర్డ్స్ జాతికి చెందిన ‘ష్రైక్స్’ బుచర్ బర్డ్స్ అని కూడా పిలుస్తారు. వీటిలో లాగర్‌హెడ్ ష్రైక్స్ ఉత్తర అమెరికాలో ఎక్కువగా కన్పిస్తాయి. పెద్దతలతో ఉండటం వల్ల వీటిని అలా పిలుస్తారు. పక్షులు, కప్పలు, కీటకాలు, పాములు, తేళ్లు, ఎలుకలను వేటాడి పట్టుకునే వీటిని కసాయి పక్షులుగా చెబుతారు. అవి పట్టుకున్న ఆహారాన్ని పదునుగా ఉండే ముళ్లకు గుచ్చి చంపుతాయి. ఒకటిరెండు రోజుల తరువాత వాటిని తింటాయి.

Pages