S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

06/25/2016 - 22:39

విభిన్నమైన రంగులతో నాట్యం చేసే సరికొత్త సాలీడు జాతిని ఆ మధ్య శాస్తవ్రేత్తలు కనిపెట్టారు. ప్రమాదకరమైన సాలీళ్లు ఎక్కువగా ఉండే ఆస్ట్రేలియాలోనే ఇదికూడా కనిపించింది. ముఖ్యంగా పెర్త్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోంది.

06/25/2016 - 22:37

మనిషి పెదాలకు ఉన్న ప్రత్యేకతలు తెలిస్తే విస్తుపోవాల్సిందే. మన పెదాలలో కనీసం పది లక్షల నరాల కొసలు ఉంటాయని తెలుసా! పైగా రక్షణ పొరంటూ ప్రత్యేకంగా లేని మానవశరీర భాగం ఇదే. స్వేదగ్రంధులు లేని భాగమూ అదే. అందుకే పెదాలకు చమట పట్టదు. అందువల్లే చలికాలం, వేసవి, విభిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో పెదాలు పగిలిపోతాయి. పెదాలపై ఆరువరుసలున్న పొర కప్పి ఉంటుంది. అదే చర్మంపై పదహారు వరుసల పొర రక్షణగా ఉంటుంది.

06/18/2016 - 21:07

క్షీరదమైన ఈ ‘స్కంక్స్’ మధ్య, ఉత్తర అమెరికాలో కన్పిస్తాయి. నలుపు, తెలుపు చారల బొచ్చుతో కన్పించే ఈ జీవులు రాబిస్‌ను వ్యాప్తి చేస్తాయి. మొక్కలు, కీటకాలను ఇష్టపడే వీటికి తేనెటీగలంటే చాలా ఇష్టం. అందుకే ఇవి ఒక్కోసారి తేనెపట్లపై దాడి చేస్తాయి. రెండునుంచి 15 అంగుళాల పరిమాణంలో ఉండే వీటికి భయం వేసినపుడు పృష్ట్భాగం శత్రువు ముఖంవైపు పెట్టి తోక ఎత్తి, కాళ్లతో నేలను తాకి భయపెడతాయి.

06/18/2016 - 21:05

చీమలు, చెదలు ఇష్టంగా తినే ఎకిడ్నాలు ఆస్ట్రేలియా, న్యూగినియాలో మాత్రమే కన్పిస్తాయి. పొడవైన ముక్కు, పొట్టి ముక్కుతో రెండు రకాల జాతులు మాత్రమే ఉన్నాయి. వీటిలో పొడవుముక్కు ఎకిడ్నాలు న్యూగినియాలో మాత్రమే కన్పిస్తాయి. పిల్లుల్లా ఇవి తెలివైన జీవులు. ముక్కు, నోటితో ఒకేసారి శబ్దం చేసి ఆహారాన్ని కనిపెట్టడం వీటి స్పెషాలిటీ.

06/18/2016 - 21:02

మన ఇళ్లలో కన్పించే బల్లులకు ఓ ప్రత్యేకత ఉంది. దాదాపు 3800 జాతులున్న ‘లిజార్డ్’ కుటుంబంలో అరవగల బల్లులు ఇవి మాత్రమే. ఎందుకంటే వీటికి మాత్రమే స్వరపేటిక ఉంది. తొండలు, పాముల్లా కన్పించే బల్లులు, ఊసరవెల్లులు, ఉడుములు, కొమెడాసహా లిజార్డ్ కుటుంబంలో ఉన్న మిగతా వేటికీ ఓకల్‌కార్డ్స్ లేవు. అందువల్ల అవి అరవలేవు. కేవలం శరీరభాష (బాడీ లాంగ్వేజ్) ద్వారా మాత్రమే అవి సమాచారాన్ని, సంకేతాలను ఇచ్చిపుచ్చుకుంటాయి.

06/18/2016 - 20:59

ఊసరవెల్లులు పగటిపూట అసలు నిద్రపోవు. ఒకవేళ అవి పడుకున్నాయంటే...అనారోగ్యంతో ఉన్నట్లు లెక్క. రాత్రిపూట మాత్రమే అవి కునుకుతీస్తాయి. శత్రువులనుంచి ముప్పు ఉన్నప్పుడు లేదా వాటినుంచి రక్షణకు ఊసరవెల్లులు రంగులను మారుస్తాయని చాలామంది భావిస్తారు. కానీ అది కేవలం శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్ చేసేందుకే అలా చేస్తుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.

06/11/2016 - 20:32

అలనాటి రాజహంసల మాట కాదుగానీ..ఈనాటి హంసల(స్వాన్)కూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నీళ్లలో ఈదేటపుడు అవి ఒంటికాలితోనే వెళతాయి. ఓ కాలును మడిచి వీపుపై పెట్టి ఈతకొడతాయి. మగహంసలకు పురుషాంగం ఉంటుంది. పక్షుల్లో ఈ ప్రత్యేకత వీటికే ఉంది. సాధారణంగా నేలపైకి వచ్చి ఆహారం తీసుకోవడానికి పెద్దగా ఇష్టపడవు. వీటికి కోపం ఎక్కువే. ప్రమాదం ఉందని తెలిస్తే...అవి ఎదురుదాడి చేస్తాయికూడా. ప్రతీ హంసకు కనీసం 25వేల ఈకలు ఉంటాయి.

06/11/2016 - 20:30

మధ్య అమెరికాలో కన్పించే ఈ తొండలు నీటి ఉపరితలంపై అతివేగంగా పరిగెడతాయి. అదీ వెనుక రెండు కాళ్లతోనే. ఏసుక్రీస్తు నీటిపై నడిచాడన్న విశ్వాసం మేరకు వీటినీ ‘జీసస్ క్రైస్ట్ లిజార్డ్’గా పిలుస్తారు. శత్రువునుంచి ముప్పు ఉంది అన్నప్పుడు మాత్రమే ఇవి అలా నీళ్లపై పరుగులుతీస్తాయి. నిమిషంలో 30 మీటర్ల దూరం ఇవి అలా ప్రయాణించగలవు. పిల్లలైతే మరీ వేగంగా నీటిపై ప్రయాణిస్తాయి.

06/11/2016 - 20:28

ఎలుకలా కన్పిస్తున్నప్పటికీ ఆ జాతికి ఎటువంటి సంబంధం లేని ఈ ‘ట్రీ ష్రూ’ ఓ క్షీరదం. నీటిపై బుడగలు సృష్టిస్తూ వాటిపైనుంచి పరిగెట్టడం వీటి ప్రత్యేకత. వీటి పృష్ట్భాగంలో ఉండే గ్రంధులవల్ల అవి మరణించినప్పుడు ఓ రకమైన రసాయనం వెదజల్లబడుతుంది. వీటిని శత్రువులు చంపేసినా ఈ వాసన భరించలేక తినకుండా వెళ్లిపోతాయి. అన్నట్లు వీటి పళ్లలో విషం ఉంటుంది. ఆ విషం లాలాజలంలో కలిసి శత్రువుల ప్రాణాలు తీస్తుంది.

06/04/2016 - 21:30

ఔను అది నిజమే! ఎందుకంటే ఇది అగ్గిపుల్లలతో తయారు చేసినది కాబట్టి. నలభై ఏళ్లుగా అగ్గిపుల్లలతో కళాఖండాలను సృష్టించడం జనుజ్ టర్బన్‌స్కికి అలవాటు. పోలండ్‌కు చెందిన ఈ కళాకారుడు రుడాప్లాస్కాలోని తన ఇంట్లో ఏర్పాటు చేసిన ఓ స్టాల్‌లో తాను తయారు చేసిన వస్తువులను ప్రదర్శనకు ఉంచుతాడు. తాజాగా ఆయన రూపొందించిన వాటిలో ఈ గిటార్ కుడా ఉంది.

Pages