S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

12/11/2016 - 00:33

దిక్కులన్నీ ఎడారులైన అబుదబిలో
ఉదయించే సూర్యుడు భూమిపై
విత్తులా మొలకెత్తినట్లు
అస్తమించే సూర్యుడు తల్లి సీతమ్మలా
భూగర్భంలోకి దిగినట్లు ఉంది!
రోడ్లు సరళ రేఖలై సమాంతరంగా
వృత్తాలు అర్ధవృత్తాలుగా నిర్మించబడి
బెల్జియం అద్దాల్ని మరపించటం చూశాను!
ట్రాఫిక్ సిగ్నల్ గీచిన లక్ష్మణరేఖ ముందు
వాహన దండు వినమ్రంగా నిల్చి
ఎదురొచ్చిన వాహన సమూహానికి

12/11/2016 - 00:31

పండుగలో తగులూ మిగులూ ఉన్నట్టు
వాన వెలిసిన తర్వాత
వర్షిస్తున్న చెట్టు...
తల్లి పేరంటాని కెళ్లినపుడు
వాయినంగా తనకిచ్చిన పండుని
ఇంటి దగ్గరి బిడ్డకి జాగ్రత్తగా తెచ్చినట్టు...
అమ్మతనంలో
తల్లికి చెట్టుకి తేడా లేదు కదా..!

12/11/2016 - 00:29

పురిటి నొప్పులు పడకుండా
నవమాసాలు మోయాలన్న బాధ లేకుండా,
ప్రసవ వేదన అనుభవించకుండా,
అద్దె గర్భాలు దొరుకుతున్నప్పుడు
‘మాతృత్వం’ మమకారం లేనిదైనప్పుడు
వ్యాపారాత్మకం కాక ఇంకేమిటి?

12/04/2016 - 03:46

ఇసుక కుప్పలుగా
గుజ్జనగుళ్ల బాల్యం
భావితరాల
సైకత శిల్పులుగా

వంతెన తినె్నపై
బాల్యం భుజాలుగా చేతులు
తంతి తీగెపై
పక్షుల విన్యాసాలు

చెరువు నీటి తలముపై
బోకె బిచ్చల కప్పగెంతులు
బెకబెకల కేరింతలైన
చిలిపి బాల్యం

కిర్రుమని చప్పుడు చేస్తూ
బొంబాయి మిఠాయి
చేతి గడియారమై చుట్టేస్తే
అమాంతం నోరు మింగింది

12/04/2016 - 03:43

అక్షరమా.. అక్షరమా...
నీ గొంతు నొక్కేస్తున్నప్పుడు
సాక్ష్యాలు గుట్టలు గుట్టలుగా
బయటపడుతున్నప్పుడు
హక్కులకు రాజ్యాలు ‘బేడీ’లు
బిగిస్తున్నప్పుడు
నిజాన్ని నిగ్గుతేల్చి రచ్చబండ
కింద ఈడ్చాలి
సంకేలను’ స్వేచ్ఛగా బద్దలు కొట్టాలి
ఉక్కుపిడికిల్లు బిగించి గొంతెత్తి
గర్జించాలి
హక్కులుక స్వేచ్ఛా సమరం చేయాలి
ద్వేష విద్వేషా భావాలను

12/04/2016 - 03:39

మళ్లీ జన్మిస్తే
నేనిలా ఉండకపోవచ్చు.
ఇంతకన్న మెరుగ్గా
చురుగ్గా
మరింత మనిషిగా
చైతన్యపూరిత నవస్రోతస్వినిగా

అర్థమయ్యే లోపల్నే
జీవితం ముగిసిపోతుంది.
లోకాన్ని
అధ్యయనం చెయ్యకుండానే
కాలం కరిగిపోతుంది.

12/03/2016 - 21:21

కళ్లజోడుతో
దాగుడుమూతలాట
తాత ఛాదస్తం!
అల్లుడి కోసం
కోడి ప్రాణాలు హరీ..
లేకుంటే మామ..?

ఊరకుక్కలు
పళ్ల పదును కోసం
పిక్కలవేట.
స్వేచ్ఛా విరోధి
విశ్వాసరాహిత్యమే
కపట న్యాయం.

ముద్దు ముద్దులో
మురిపెం తల్లి ప్రేమ
పువ్వులో తావి.

12/03/2016 - 21:15

ఆంక్షల మధ్య ఆకాశం
తెగిపోయినట్టుగా
కనిపిస్తుంది
అసలు మెరవటమే మానుకుంది
ఏ మెరుపూ లేదు. ఏ తూర్పు కనిపించటంలేదు.
ఆంక్షలు ఇప్పటివా
స్వాతంత్య్రం ఆకాశాన్ని ఆంక్షలలో బంధించింది
ఆకాశం నా స్వేచ్ఛకు ప్రతీక
నేనో పిట్టను
నేనో పావురాన్ని
ఆకాశాన్ని కత్తిరించటమే కాదు
నా రెక్కలను కూడా కత్తిరించారు
దుర్మార్గ రాజకీయాల గుప్పిట్లో

12/03/2016 - 21:12

నిశ్శబ్దం
విస్ఫోటనమైతే శబ్దం..
వౌనం
ప్రస్ఫుటమైతే భాష్యం...
అక్షరం
వ్యక్తమయితే వాక్యం...
కావ్యం
ఆవిష్కృతమైతే అమరం...
అంతరంగం
బోధపడితే అనురాగం..
రాగబంధాలన్నీ
వర్జిస్తే వేదాంతం...
రవికి తేజస్సు జ్వలనం
కవికి యశస్సు కవనం.

12/03/2016 - 21:11

నిజంగా మనం అనుకునేవేవీ
మనవి కాదు
ఆనందాలు ఆనందాలు కాదు
సుఖాలు సుఖాలు కాదు
దుఃఖపు వీచికలను
గుండె పేటికలో దాచుకుని
శ్వాసించే పాకులాటలు
భ్రమల వలయాలు
ఉల్లిపొరలను తొలుచుకుంటూ పోతే
రాలే కన్నీళ్లు
మిగిలే ఆవిరి ధారలు
మెరుపుల్ని పెనవేసుకున్న చినుకుల్లా
క్షణాలు మోసే కన్నీళ్లు
పొగిలిన గుండెను ప్రసవిస్తూ

Pages