S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

01/28/2017 - 21:32

చిత్ర విచిత్ర దృశ్యాలు
తడియారని తన్మయత్వపు అనుభూతులు
తలెత్తి పైకి చూస్తే అన్నీ
నింగి ముంగిట వాలిన అగణిత దృశ్యకావ్యాలు
దిక్కుల దిగంతాల వరకు ఆరబోసిన
చుక్కల చూపులన్నీ
చల్లదనాన్ని వెదజల్లే
చంద్రుని కౌగిటలో ఒదగాలనే
చీకటినే కాటుకగా ధరించిన రాతిరి మడుగు
అనేకానేక గ్రహ సుమాలకు నెలవు
కమనీయ ప్రకృతి, రమణీయ ఆకృతి
హృదయాన్ని కదిలించే భావం

01/28/2017 - 21:31

అప్రభావిత సమాజంలో పౌరసత్వం ఆపాదించబడిన
అసమర్థ బడుగు జీవిని!
అణువణువు స్వార్థ కణాల కోలాహలం మధ్య
అమీబాలా చలిస్తున్న ఏకకణజీవిని
నేను చనిపోయాను మిత్రమా!
ఆగు! ఆగాగు!
అనవసరంగా నా మరణాన్ని ప్రకటించకు!

01/28/2017 - 21:29

కాలుతున్న శవాన్ని చూసి
వేదాంతం కమ్ముకొస్తుంది
నోట్ల కట్టలు చూడగానే
బుద్ధి చంచలవౌతుంది
- శ్మశానవైరాగ్యం
అంత అల్పాయుష్కం!
కష్టాల కడలిలో
కొందరు
సుఖాల ఒడిలో
మరికొందరు
- స్వర్గం, నరకం
ఈ భూమీదే!
క్రమశిక్షణ
చీమది
ఐకమత్యం
కాకిది
- ప్రకృతే
పెద్ద పాఠశాల
అన్ని జ్ఞానాలను
మించినది

01/22/2017 - 01:14

ప్రకృతిని సందర్శిస్తూ ఉంటే మనసు పరవశిస్తోంది
రంగురంగుల సీతాకోకచిలుకలా
పూవుపూవునా వాలి అందాన్ని చూడాలని వుంది
ఆకాశంలో ఎగురుతూ పండు పండునా వాలుతూ
రామచిలకలా దోరపళ్ళ రుచులు చూడాలని వుంది
కొమ్మకొమ్మకి ఎగబాకుతూ ఎగురుతూ
కుచ్చుతోక ఆడిస్తూ ముచ్చటైన మూడు గీతలతో
ముద్దుగొలిపే రామానుగ్రహం పొందిన ఉడుతలా
కొమ్మకొమ్మకి ఎగిరి పళ్ళు కాయలు రుచి చూడాలని వుంది

01/22/2017 - 01:13

మొలక చంద్రుని కనురెప్పల మీద
వాలు చూపులు సారిస్తూ
నగ్న పాదాలతో నీవు నడవడం
నేను చూచాను
పరచుకున్న నీ నల్లని కురులలో
దిగంబరంగా నీవు
నిద్ర కాని నిద్రలో
నిద్రాముద్రిత అపురూప నిర్నిద్రలో
ఇక ఏ కవిత్వమూ సరిపోదు
ఈ రేయకి!

01/22/2017 - 01:11

ఊరంటే... కొన్ని వీధులూ
యంకొన్ని యళ్ల సముదాయాలే కాదు,
కాసిన్ని ప్రేమలూ, పాశాలూ
ఆశలూ, ఆత్మీయతలూ కూడా!
అప్పటి వూరు... గంపెడు సంసారాల్ని
గుట్టుగా కడుపున దాచుకునే కోళ్లగంప!
పూరిళ్లూ మిద్దెలే గానీ, అవి ప్రేమ పందిళ్లు!
చెదిరిపోని అనుబంధాల చలువ పందిళ్లు!
గర్భగుడిలా - యళ్లు,
కాసింత యరుకుగానే ఉన్నా...

01/22/2017 - 01:08

నీవు తిరిగిరావు
జ్ఞాపకాల దొంతరలు తప్ప
మిగిలిందేమి లేదు
నిరంతర ప్రవాహంలా
నీ దారి నీది.
వొడుదుడుకుల జీవితంలో
ఓటమి గెలుపుల సయ్యాట మాది
ఆశ నిరాశల ఉచ్చుల్లో
ఆత్మక్షోభ మాది.

01/07/2017 - 21:25

హక్కులెన్ని ఉన్నా
ప్రశ్నించే సత్తాలేనివాళ్లం
నోటుకు ఓటును
అమ్ముకొనే దౌర్భాగ్యులం
వాక్ స్వాతంత్య్రమున్నా
ఉబుసుపోని కబుర్లే చెప్పుకొంటాం
జీవించే హక్కున్నా
చచ్చి బ్రతుకుతుంటాం
హక్కు దక్కించుకోం
దోచేవాడ్ని ప్రశ్నించం
వానపాము నయం
ఉంటుంది ఎంతో కొంత చలనం
నాయకులు లక్షల కోట్లు దోచేస్తున్నా
మనది మన్నుతిన్న పాము చందం

01/07/2017 - 21:20

తెల్లవారితే సముద్రం
వుండకపోవచ్చు
చుక్కలు పొదిగిన
ఆకాశం మళ్లీ
కనిపించకపోవచ్చు
లేదా
ఈ గాలి స్వేచ్ఛగ
ఎడారుల్ని పరిచి
వింత స్వప్నాల లోకాల్లోకి
తేలిపోవచ్చు
కుడి ఎడమల జ్వాలాముఖి
ఏ క్షణమో పేలవచ్చు
సహజంగా మార్పు
కొన్ని భయాలతో
మొదలవుతుంది
ఈ సుదీర్ఘమైన రాత్రి
ఆకులా కదులుతున్న

01/07/2017 - 21:17

చిగురుటాకు శరీరాన్ని
చూచి చూచి, తలచి తలచి
వలచి వలచి మరులుగొని
మలచుకున్న జాజులు, విరజాజులు,
మల్లెలు, వర్ధనాలు
వస్త్రాలై ఆయన కాహార్యమైనాయి

బాలభానుని నును లేత కిరణాలు
కారుణ్య కాంతి పుంజాలై
ముఖారవింద వర్ఛస్సుల నద్దాయి

Pages