S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

12/31/2016 - 19:18

చిగురాకు పచ్చగా లేతాకు పచ్చగా
ముదురాకు పచ్చగా పచ్చపచ్చగా
ఊరేగిన నా జీవితం
ఆఖరి అంకంలోకి అడుగువేసింది!
రోజుకో రంగు అద్దుతూ
తల్లి చెట్టు
నన్ను ప్రదర్శనకు పెడుతూ ఉంది
రాలిపోయే ఆకుకు
రంగులెందుకని అడగొద్దు
మరణిస్తూ సూర్యుడు మలి సంధ్యలో
గీచిన రంగులు నాకు ప్రేరణ!
ఊసరవెల్లిని కాదు
రంగులు మార్చటానికి

12/31/2016 - 19:16

ఆకాశవీధి
కురిసే నీటి నిధి
మన పెన్నిధి

వాన జల్లుకు
ఊరంతా మురిసింది!
చేను నవ్వింది
రేపటి స్వప్నం
మరో ఆశల సౌధం
నాతోనే కాలం

కాలం మారింది
హద్దుల్ని చెరిపింది
అంతా ఒక్కటే!

సూర్యచంద్రులు
దివి కన్న కలల్లో
దీపకాంతులు
రెక్కల గుర్రం
నాటి కథల్లో బాల్యం
విహరించింది!

12/31/2016 - 19:14

రోజల్లా
నడిచే ప్రయాణాన్ని
ముక్కలుగా విరిచి
కన్నీళ్లనే తొడగటం

అర్ధరాత్రి నిర్ణయాల
ముసుగుల్లో ముంచెత్తటాలు
ఒక విధ్వంసపు ఆనవాలు

నల్ల కుబేరులెపుడూ
రూపాయని వివిధ రూపాలుగా
తొడుక్కుంటారు

ఇప్పుడు
విరిగిన సగం జీవితం
సామాన్యుడిపైనో
మధ్యతరగతిగానో
విలవిలలాడుతూ
ప్రాణాలు ఆఖరి శ్వాసగా
విడవబడుతున్నాయ

12/25/2016 - 00:11

మామూలే, అంతా మామూలే, షరా మామూలే
నీతిని అవినీతి అమాంతం మింగేయడం
ప్రశ్నించినోణ్ణి పిచ్చోడని జమ కట్టేయడం
మామూలే, అంతా మామూలే
రాముణ్ణి కొలుస్తూ రావణుడై ప్రవర్తించడం
కని పెంచిన తల్లిని వృద్ధాశ్రమాన వదిలెయ్యడం
మామూలే, అంతా మామూలే
తప్పని చెప్పినోడికి తాటాకులు కట్టెయ్యడం
అన్యాయమన్నోణ్ని కత్తులకు బలి చెయ్యడం
మామూలే, అంతా మామూలే

12/25/2016 - 00:09

పక్కన కూర్చోబెట్టుకోగానే
మురిసిపోయాను
తరువాత అర్థం అయ్యింది
నీ ఆధిపత్యం కోసం
నాకు కుర్చీ వేశావని

తరాలుగా
బానిసగా
నన్ను చూసిన నువ్వు
మనిషిగా మారావనుకున్నా!
నీ అస్తిత్వ మనుగడ
రాజకీయమైన చోట
నేనిక పావుని కాను

వైకుంఠపాఠీ గుండు నువ్వే విసురుతావు
పాముల నుంచి నువ్వే తప్పిస్తావ్
గెలుపు నాదే
విజేత నేనే.

12/25/2016 - 00:07

ఇప్పుడు చావు
క్షణాల్లో పలకరిస్తోంది
మితిమీరిన వేగం
గతి తప్పిన జీవన ప్రమాణాలు
శృతి మించిన ఆహార వ్యవహారాలు
చావంటే భయం లేదు
కుటుంబం గురించి ఆలోచనే లేదు
చస్తే చచ్చేం అన్నట్లుగా రేసులు
నోటికొచ్చినట్లు
శత్రువుల్ని పెంచే ఊసులు
బస్సులు నదుల్లో పడిపోవడం
చిన్నపిల్లలు ఈతకు వెళ్లడం
చావంటే ఇప్పటికిప్పుడు
సాధారణమై పోయింది

12/25/2016 - 00:06

ఆ ర్యాకుల నిండా
ర్యాంకుల కార్డులే...
ఆ పిల్లాడు మాట్లాడగా
నే విన్నది లేదు...
ఆ చిన్నారి నవ్వగా
నే చూసింది లేదు...
ఆ గది మూలగా
పుస్తకంలో పుస్తకంగా చూశా...
రెడ్ మార్క్ కనిపిస్తే
48 గంటలు నిద్ర మానేసిన
వాడి కళ్లను చూశా...
అతి చదువుతో చిక్కిన
చక్కని మేధని చూశా...
తిండిని త్యాగం చేసిన
బక్కనైన దేహాన్ని చూశా...

12/18/2016 - 00:54

కాలంతో కలిసి -కనుమరుగై
కనుపాపగా నిలచి
కల్లోల లోకాన్ని కాంచి
కాయమని చెప్పి వెళ్లింది
నిన్నగాక మొన్నలా ఉంది
అపుడే ఏడాది గడచిందా! అమ్మా-
జీవన యానంలో-
ప్రతి ప్రయాణంలో
‘ఎదురు రమ్మని’ చెప్పడానికి
నాన్నా-లేడు
రావడానికి నీవూ లేవు
‘వెళ్లగానే ఫోన్ చేయి’
అనే నీ పలుకులు ఏ పరలోకాన్నుండొస్తాయిక
నీ ఏడూరుకై ఎదురుజూసిన నాన్న

12/18/2016 - 00:52

తీగ పట్టుకొని
డొంక-
లాగేద్దామనుకుంటాను
కానీ...
ప్రయత్నించిన ప్రతిసారీ
నేనే...
డొంకల్లో చిక్కుకుపోతుంటాను

12/18/2016 - 00:50

బాలమురళీ
నీవొక నిరంతర సంగీత ఝరివి
సెలయేరు నీవే, నదివి నీవే, సముద్రమూ నీవే
నీ అంతర్వాణి శర్వాణికి అంకితం
నీ పాటతో మా జన్మ పులకితం
అజరామర అమందానంద సుమధుర రాగదాతవు
నీ తల్లి వాగ్దేవి నీ తండ్రి బ్రహ్మ
అందుకే నీవు నాదబ్రహ్మవు
నీ కృతి సౌరభాలు రాగమంజరులు
రాగం, తానం, పల్లవి నీ పెదవుల నటించినవి
అన్నమయ్య సంకీర్తనా సంపుటానికి

Pages