S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

03/19/2017 - 21:38

మంచి కోసం ఒక్క మెట్టు దిగినా
ఆకాశమంత ఎదుగుతావు
చెడు కోసం ఒక్క మెట్టు దిగినా
పాతాళంలో కలిసిపోతావు
నీ మాటే నెగ్గాలనుకున్నావో
పక్కవాళ్లు తప్పుకుంటారు
అందరి మాటా విన్నావనుకో
అందలం ఎక్కించేస్తారు
అంతా తానయ్యేవాడే నాయకుడు
కష్టంలో కనబడనివాడు కాడు ఏనాడూ
కొందరిలో ఉంటే కుంచించుకుపోయావు
అందరిలో ఉంటే అందరివాడవుతావు

03/19/2017 - 21:37

గ్రహాలు, సౌర కుటుంబాలు, నక్షత్ర మండలాలు
నెబ్యూలాలు కృష్ణబిలాలు
మనిషి మనసు విశ్వంతో లయమై
కళ్ళెం లేని గుర్రపు డెక్కల చప్పుడులో కలిసిపోయంది
కాలాన్ని పట్టుకునేందుకు విశ్వయత్నం చేసి
మహా విస్ఫోటనం వద్ద కాలాన్ని అధిరోహించాడు
ఏదో శక్తి
అదే గురుత్వాకర్షణ తరంగ శక్తి
ఆకర్షణ వికర్షణల వైరుధ్య శక్తి
సౌర కుటుంబాన్ని ఒకే కుటుంబంగా నిలబెడుతోంది

03/11/2017 - 22:04

అదేమిటో
జీవితమంటే వేసవేనంటూ
అన్ని కాలాలూ ఒక్కటై ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే
అలసట ఆవిరి మేఘాలై కమ్ముకుంటాయ
నవ్వులెక్కడంటూ నడకలెక్కడంటూ

బతుకు చిత్రం దిగులు ఛత్రంతో
పొగల రంగుల్తో మసకేస్తుంటుంది
ఒక్కో కలా కరిగి కరిగి
ఆవేదన వడగాల్పుల్లో వేగిపోతూ
ఆలోచన ప్రవాహాల్లో మునిగిపోతూ
అమాయకత్వాన్ని నింపుకుంటుంది

03/11/2017 - 21:41

కవిత్వమనే పానకాన్ని
కొందరు పెగ్గుల్లో
కొందరు మగ్గుల్లో
వంచుకుని పంచుకుంటున్నారు
ఆసక్తిని పెంచుకుంటున్నారు

03/11/2017 - 21:38

తూకం వేస్తే
ప్రపంచ వంటగాళ్లంతా
తేలిపోయారు
అమ్మ వండి, వడ్డిస్తే
కంచాల నిండా
షడ్రుచుల సమ్మేళనమే
ఆకలికి అవయవాలు
తెగిపోతాయ
అమ్మ చేతుల అలికిడికి
ఇంట్లో వంటపాత్రలకు
నిత్యం పట్ట్భాషేకమే.

- డా. కె.వి. వేణు, 9848070084

03/11/2017 - 21:36

నాకు ప్రేమించటం తెలుసు
ప్రపంచీకరణ పరవశంలో కొట్టుకుపోతున్నవాన్ని కాదు
ప్రపంచీకరణ చెత్తలో అనామకున్ని కాలేదు
నేను నిటారుగా నిలబడే ఉన్నాను
జనం గుణం, జనం రణం, జనం దుఃఖం తెలిసినవాన్ని
నేనెలా ఆ వలయంలో చిక్కుకుంటాను?
నినే్నమిటో నేడేమిటో రేపేమిటో
శాస్ర్తీయ పూల చెట్టును పెంచుతున్నవాన్ని
సిద్ధాంతం మైలురాళ్లు దాటుతున్నవాన్ని

03/06/2017 - 22:43

అనంతమైన నా పయనం
అలుపు లేకుండా సాగుతూనే ఉంది
గెలుపు తీరాలను శోధిస్తూ!
నిరంకుశ బంధనాలను ఛేదిస్తూ

కష్టాల ముళ్లపొదలను తొలగించుకుంటూ -
చెట్టు, పుట్టల నడుమ రాళ్ళబాటపై
నిష్టాగరిష్ఠుడనై నిరంతర యానం చేస్తున్నా
నా అనే్వషణ ఫలించలేదు
విజయ తీరం కానరాలేదు

03/06/2017 - 22:41

కవిత్వం నా లోపలి స్వరం
నన్ను నేను నిలుపుకోవాలనుకున్న చోట
చిరునామాగా ప్రకటించుకోవాలనుకున్న దగ్గర
కవిత్వమై ప్రవహిస్తూ పోతాను
కొన్ని దుఃఖ సమయాలు మరికొన్ని ఆనంద క్షణాలు
అన్నింటినీ కలిపి కవిత్వం చేస్తూ బతుకుతాను
మనిషిని ముట్టుకొని మమతల్ని
వెల్తురు గడపలో నిలబెట్టిన చోట
ప్రవహించే జ్ఞాపకం ఒకటి
కవిత్వమై కొత్త చిగుళ్ళు తొడుగుతుంది

02/25/2017 - 21:46

సూర్యచంద్రుల
పదవీ విరమణ
పదవీ స్వీకారం
నిత్యకల్యాణం పచ్చతోరణమైనా
అత్యంత నిశ్శబ్దంగా
నిరాడంబరంగా ముగుస్తుంది!
రాజరికం రాజ్యమేలుతున్న
అబుదాభి రాజ్యంలో
ఎమిరేట్స్ భవంతికి ఎదురుగా నిల్చున్నాను
చంద్రుడూ యాత్రికుడై వచ్చి
పండువెనె్నల నజరానా సమర్పించాడు
నక్షత్రాల సైన్యం అతడి చుట్టూ
రక్షణగా నిలిచివుంది

02/25/2017 - 21:44

రాత్రి
నోట్ల పడవలో వెళ్తున్నట్టు కల
ఏది కొనాలన్నా ఏడు సముద్రాలు దాటాలంటాడు
పడవ నడిపేవాడు
వేగాన్ని పెంచాలంటాను నేను,
పైగా మనం ఒడ్డుకు చేరేలోగా
ఏ వెలుగూ రాకూడదంటాను
నోటు మార్పిడి అంత సులువు
కాదంటాడు అతను
మీరేది కొనాలన్నా
ఈ నోట్లు చెల్లవు గాక చెల్లవంటాడు అతడు
అక్కడక్కడ అద్దాల మేడలు కూలుతున్న శబ్దం
వినిపిస్తుంది

Pages