S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

02/25/2017 - 21:41

క్యూ ఫర్ క్వశ్చన్‌మార్క్... అనుకోవచ్చా!
క్యూలు కేవలం సంబరాలు, సినిమా టిక్కెట్లు,
పండుగలు, పబ్బాలకే అన్న రోజులకు
కాలం చెల్లిందా?
నిరుపయోగమైన దినచర్యల నుంచి
చెల్లని కాలసులను ఏరుకోవచ్చా?
ఓ రద్దీ మార్కెట్
నిర్మానుష్యంగా రూపాంతరం చెందినపుడు
సగటు మనిషి చిరునామా
ఎక్కడని వెతకాలి?
తుది శ్వాసను కరవుతోనే కాదు
కరెన్సీతోనూ కొలవచ్చా?

02/25/2017 - 21:40

వచ్చే వసంతానికి
స్వాగతం పలికేందుకు చెట్లు
కొత్త కోకలు ధరించి
కనువిందు చేస్తాయ
మనసు పళ్ళెం నిండా
దృశ్యాల సురుచి సంబరాల్ని
నింపుతాయ
వసంతం చెట్ల పండుగ
పక్షుల పండుగ
నూతన వస్త్రాలు ధరించడమే
పండుగైతే
అది చెట్ల పండుగే
పాటలు పాడుకోవడం
ఆటలు ఆడుకోవడమే
పండుగైతే
అది కోయలల పండుగే
నెమలుల పండుగే

02/19/2017 - 02:31

మహానగరాలని చూసి మురిసిపోతున్నాం
మనమెంతో ప్రగతి సాధించామని
ముచ్చటపడుతున్నాం
భారతదేశం వెలిగిపోతోందని
భ్రమ పడుతున్నాం
పట్టణాలకు దూరంగా పల్లెలున్నవి చూడు
గిరిజన గ్రామాలను చూడు
కాలిబాటలే కరువైన గ్రామాలను చూడు
రహదారి సౌకర్యాలు
రవ్వంతైనా లేని ఊళ్ళు చూడు
రోగార్తులైన ప్రజల పాట్లు
ప్రసూతి సౌకర్యం లేని పడతుల పాట్లు చూడు

02/19/2017 - 02:30

కొక్కొరొక్కో రాగాలు మేల్కొంటాయ
యాంత్రిక లోకంలోకి లాక్కునిపోయే
కొన్ని క్షణాలు
చుట్టూ కాపలా కాస్తుంటాయ

నిద్రని కప్పుకున్న దేహం
సరిహద్దు సైనికుడిలా హుషారవుతుంది
తల దువ్వుకుని నవ్వడమెలాగో
అద్దం ముందు విద్యార్థిలా నిలబడుతుంది

బ్రతుకు నేర్పిన పాఠంలా
ముఖమంత నవ్వు పూయస్తూ
కాలంతో పరుగెడుతుంది

02/19/2017 - 02:27

ఉషోదయ కిరణాలతో
జీవన పోరాటం మొదలై
తనువంతా చెమటచుక్కలతో నిండి
రెక్కల కష్టంతో... కాడెద్దులతో...
గొర్రుతో నేను మా ఆడది
సాలులో సక్కగా అడుగులేస్తూ
విత్తు విత్తుతూ మేర చేరుకొని
ఎకరాలకు ఎకరాలు విత్తు చేసి
సూర్యాస్తమయానికి గూటికి చేరుకొని
మరుసటి రోజుల్లో... పంట చేనుల్లో...
మొలకెత్తిన విత్తును చూసి
ఆవిరయ్యే కష్టం మాది

02/11/2017 - 22:25

భవితవ్యం రెక్కలాడిస్తున్న
నా మనో విహంగము
ధర్మాకాశానికెగిరి
దిగంతాలను ముద్దాడనీ

శక్తియుక్తులు నింపుకున్న
నా కండరాల అండబలము
మతోన్మాదుల మదమణగించి
ప్రాయశ్చిత్తం పంచన ఉంచనీ

నేను ఆనాటి గంధర్వుడిలా
గగనములో గమించగలిగితే
దొంగస్వాముల కొంగ జపం
నేపథ్యాన్ని చీల్చిచెండాడనీ

02/11/2017 - 22:22

అందరూ నా వాళ్లనుకుని
తమ వాళ్లను వూళ్ల వద్దనే వదిలేసి
పొలిమేరలలో పహరా కాస్తున్నారు
పరాయవాడి పాదం సరిహద్దు మీద
ముద్ర వేయకూడదని దీక్షబట్టి
చప్పుడు పడనీయని రెప్పలతో
చలి దుప్పటిని చీల్చుకుని
మరీ దృష్టిని సారిస్తున్నారు
ఎక్కడో చిన్న అలికిడి
దుప్పిని మించిన వేగంతో
శబ్దం దిశగా పరుగులు
వురుముల్లేని పిడుగుల్లా

02/11/2017 - 22:13

తెరుచుకున్న ఉదయపు గొంతులోంచి
ఓ ఏడుపు శబ్దం
మా ఇంటి ముందరి బూబమ్మ
మరణ వార్తను మోసుకొచ్చింది
నిన్న పలకరింపులతో కదలాడిన ముఖం
వౌనముద్రలోకి వెళ్లిపోయంది
కాలపు రెక్క క్రింద ఒరిగిపోయంది

02/04/2017 - 23:48

వానకి వయసు మళ్లింది, ఓపిక తగ్గింది
ముసలి నసలా చినుకుల్ని రాలుస్తోంది

వాకిలి ముందు పారుతూ పిల్లకాలువలు
సిరలూ, ధమనుల్లా సాగిసాగి
క్రమంగా సనసన్నని నాళాలవుతున్నాయ

కాలువలో ముందు వేగంగా
అంతలో నిదానంగా - పడవలు,
కత్తి పడవలు
వాటి వేగానికి చోదకశక్తినివ్వాలని
ఒకటే కేరింతలు, త్రుళ్లింతలు, కవ్వింపులు -
పిల్లకాయలు!

02/04/2017 - 23:46

వినికిడి శక్తి తగ్గింది నిజమే
అయనా చెవిన పడుతున్నాయ
అనగూడని నోళ్లనుండి
వినగూడని మాటలు
మందగించిన చూపు కూడ
గమనిస్తుంది ‘చిన్నచూపు’ను
వద్దనుకున్నా కంటబడుతున్నాయ
చికాకుపడుతున్న ముఖాలు
విసుక్కుంటున్న దృశ్యాలు
ఎంత మతిమరుపున్నా
మరచిపోలేకపోతున్నది
మనసులోని బాధలను
కడుపులోని ఆకలిని
చులకనగా చూసేవారు

Pages