S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలోచన

11/19/2016 - 22:05

తెడ్డు జారిపోయింది
సముద్రం లోపల
పడవా నేనూ ఇద్దరమే-

అలల సింహం మీద
స్వారీ చేయడం ఇదే నా తొలి అనుభవం

దూర తీరాల మీద
పక్షులు
పగటి పనులన్నీ ముగించుకొని
గూళ్ల వైపు వెళ్లిపోతూ-

నెలవంక కన్ను తెరిచిన నింగి
నక్షత్రాల్ని
నల్లని జడలో అల్లుకుంటుంది

11/19/2016 - 22:03

వేసి చూడు..
నా దేశంలోకి అక్రమంగా
అడుగు ముందుకు
దీటుగా సమాధానం
చెప్తుంది నా బందూకు

తాకి చూడు నా
మాతృభూమిలో
గుప్పెడు మట్టిని
మట్టి కరిపించకపోను
నిన్ను ఆ మట్టి సాక్షిగా నేను

11/19/2016 - 22:01

ఆకలి నిద్ర
రెండు పెనవేసుకొని
పేదరికమై
పేవ్‌మెంట్ మీద పడుకుంటుంది

పగలు రాత్రి
రొదలు చెవికెక్కని
శ్రమ జీవితం...
దొరికిందేదో
కడుపుకీ, పరమాన్నమే నిత్యం
బతుకు ఎక్కడైనా
కష్టాల తొవ్వ నుంచి
నడవాల్సిందే

ఎప్పుడు భూమీద పడ్డారో
మట్టిగా మారేవరకు
శ్రమ కణమై
రగులుతుంటారు

11/12/2016 - 20:23

వాళ్లు...
పోరు భూమిలో ప్రాణాల్ని
పచ్చ్భాస్వరంలా మండిస్తుంటారు!
సరిహద్దు రేఖ దాటి శత్రుమూకల మీద
సర్జికల్ అటాక్ చేస్తుంటారు!
దేశ దేహం కొరకు
తెల్లరక్త కణాలై పోరాడతారు!
గుండెనిండా దేశభక్తిని శ్వాసిస్తూ...
కత్తులు కట్టిన కోడిపుంజుల్లా
కదన భూమిలో లాంగ్‌మార్చ్ చేస్తుంటారు!
మువ్వనె్నల పతాకాన్ని భుజాన మోసుకొని

11/12/2016 - 20:20

మానవ సంచార జీవనానికి అవశేషమతడు
దేశదేశాలు సంచరించే దేశ దిమ్మరి
దిమ్మరి నుంచే అతడు దొమ్మరైనాడు
ఈ విశాల ప్రపంచంలో స్థిరంగా
ఉండడానికి జానెడు చోటులేనివాడు
వెనుకా ముందూ బలంలేని అనాథుడు
ఈ ఊరు నాది ఆ ఊరు నీదన్న
భేదాభేద చింతనాతీతుడు
ఊరూరు చెడ తిరిగిన వొఠ్ఠి సంచార జాతివాడు
ఒకనాడు రాజుల ఆస్థానాలలో
సామంతుల సంస్థానాల యందు

11/05/2016 - 23:38

ఒక సాయంత్రం
ఎగురుతున్న సమయాల్ని
నది ఒడ్డున అలలతో
ముంచేశాను.

కాసేపు తుళ్లింత
గులకరాళ్లు పాడుతున్నాయి

కాసేపు కన్నీళ్లు
నదిలో పడవలై జారుతున్నాయి

ఒంటరి ఆనందం
రెక్కలు చాచి కౌగిలించుకుంది.

చల్లని గాలులు
ఎగిరే పక్షులు
నీట ముక్కలవుతున్న
చందమామలు
నన్ను ముంచుతున్నాయి

11/05/2016 - 23:37

అన్యాయాన్ని సహించదు
న్యాయదేవత
అందుకే మరి
గంతలు కట్టుకుంది

బట్టలైనా మనసైనా
ఎండిపోయినట్టే
పూర్తిగా
తడారిపోయాక

కరెంటుంటే
కామన్ డిన్నర్
కట్టైతే
క్యాండిల్ లైట్ డిన్నర్!
లోకానికి
దృష్టి దోషం
ఖాకీలో వున్న
నిజాయితీ కనిపించదు.

11/05/2016 - 23:35

కళ్లు చూసిన సత్యం
మనసును చేరి నిద్ర లేపింది
అంతులేని ఆవేశం
నా నెత్తురుకు వేగం పెంచింది
నా కరములో వొదిగిన
నా కలం.. వీరఖడ్గమై...
కవితాశ్వముపై చెలరేగిపోయింది.

11/05/2016 - 23:08

మేఘం ఉరిమింది
మెరుపు మెరిసింది
కురిసింది జడివాన
అడవి తల్లి గుండెల్లో
ఉప్పొంగిన వాగులు
అడవి బిడ్డలు జబ్బు బారిన
రవాణా మృగ్యం
వైద్యం దూరం
కావడి మంచంలో రోగుల మోత
సుదూర పయనం
నడక
సమయానికి చేరితే
ఊపిరి దక్కు
లేనిచో ప్రాణం పోయే
పసిబిడ్డకి జ్వరం
చేసిన నాటు వైద్యం పారలే
పాలిథిన్ సంచిలో బిడ్డ

10/29/2016 - 21:28

తారలు భువిలో వెలసిన భువన దీపాలు
దారి చూపి నడిపించే వెలుగు పుంజాలు
ప్రతి దీపం పరంజ్యోతి స్వరూపం

దీప తోరణాలు గృహ ఆభరణాలు
కాంతి కిరణాలు పసిడి రంగుల ప్రమిద దీపాలు
తిమిర సంహారాలు
అజ్ఞానాన్ని పోగొట్టి సంస్కార జ్యోతిని వెలిగింప
తోడ్పడే మార్గదర్శకాలు

Pages