S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

05/21/2017 - 21:01

‘‘రెగ్యులర్ పాత్రలకన్నా భిన్నంగా నటించడానికి స్కోప్ ఉన్న పాత్రలే నాకు నచ్చుతాయి. ప్రస్తుతం మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా. ప్రతి సినిమాను ఆస్వాదిస్తూ పనిచేయాలనుకుంటున్నా. కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేస్తా. అవి గ్లామర్ పాత్రలు కూడా కావొచ్చు. హిందీ ‘బేగం జాన్’లో నాది పూర్తి డీగ్లామర్ క్యారెక్టర్’’అని ఎంతో ఆనందగా చెప్పుకొచ్చింది అందాల భామ మిస్తీచక్రవర్తి.

05/21/2017 - 20:59

ఈ స్టిల్ బాగా చూడండి! కన్నడం నుంచి వచ్చి తెలుగులో అగ్రస్థాయికి ఎదిగిన ఓ నటి ఈమెలో కన్పిస్తుంది కదూ! నిజమే.. ఈమె కన్నడ నటి శ్రద్ధా శ్రీనాధ్. కన్నడలో ఒకే ఒక్క చిత్రం ‘యు టర్న్’లో నటించింది. ఆ ఒక్క చిత్రంలో గ్లామర్‌కు ప్రాధాన్యత ఇవ్వకున్నా, ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ సినిమా హిట్టవ్వడంతో తక్కువ కాలంలోనే బిజీ హీరోయిన్ అయిపోయింది. కన్నడ నుంచి తెలుగులోకి షార్ప్ టర్న్ తీసుకుంది.

05/21/2017 - 20:57

తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర హీరోలందరితో ఆడిపాడిన తమన్నా మరోసారి ప్రభాస్‌తో నటించబోతోందిట. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రెబల్’, ‘బాహుబలి’ ప్రేక్షకులకు కనువిందు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరు తాజాగా నటించిన ‘బాహుబలి’ ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘సాహూ’. యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు.

05/21/2017 - 20:55

‘‘గ్లామర్..గ్లామర్ అంటూ మీడియా ప్రశ్నలతో తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. ఎక్కడికెళ్లినా నాకు ఇదే గోల. దీనిని భరించలేకున్నాను’’అంటోంది బాలీవుడ్ బ్యూటీ గ్లామర్‌క్వీన్ కత్రీనాకైఫ్. సహజంగా ఏ నటికైనా గ్లామర్ క్యారెక్టర్లు అవసరమే. కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలో అయితే ఈ పాత్రల్లో జీవించాల్సిందే. మరి ఇంతకాలం ఎన్నో చిత్రాల్లో నటించిన కత్రీనాకైఫ్ ఇప్పటికీ గ్లామర్ ప్రాతలనే పోషిస్తోంది.

05/06/2017 - 04:00

తెలుగునాట తన అందచందాలతో అందర్నీ ఆకట్టుకున్న అందాలతార రాశీఖన్నా తన దృష్టిని మలయాళంవైపూ కూడా మరల్చిందట. అతి తక్కువ కాలంలో టాలీవుడ్‌లో యమక్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ చూస్తుండగానే అగ్ర హీరోలతో జతకట్టింది. ముఖ్యంగా యువతరం క్రేజీ హీరోలతోనూ చిత్రాలు చేస్తూ కెరీర్‌లో రివ్వున దూసుకెళుతోంది. టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ తనేంటో నిరూపించాలనుకుంటుందిట.

05/06/2017 - 03:58

హాలీవుడ్ నటి ఏంజెలినా జోలి ఇక నటనకు గుడ్‌బై చెప్పాలనుకుంటోందిట. ఎన్నో చిత్రాల్లో తన అద్భుత నటన ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించిన ఈ భామ వృత్తి పరంగానే కాదు, వ్యక్తి గత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. నటనతో పాటు దర్శకత్వంలోనూ రాణించింది. చాలా కాలం పాటు భర్త బ్రాడ్‌పిట్‌తో సంతోషకరమైన జీవితాన్ని అనుభవించింది.

05/06/2017 - 03:56

బాలీవుడ్ భామ కరీనాకపూర్ రీ ఎంట్రీ చేబోతోందిట! అవును.. నిజమే! నిజంగా నిజం. గత సంవత్సరం డిసెంబర్‌లో బాబుకు జన్మనిచ్చింది. తల్లిగా మారిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. అప్పుడప్పుడు వాణిజ్య కార్యక్రమాల్లోనూ, వివిధ వేడుకల్లోనూ పాల్గొంటూ అందర్నీ ఆకట్టుకుంది. గత ఏడాది విడుదలైన ‘ఉడ్తా పంజాబ్’ తన ఆఖరి చిత్రం. ఆ సినిమా తర్వాత మరే చిత్రంలోనూ కరీనా కనిపించలేదు.

05/06/2017 - 03:54

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి జీవిత ఘటనల ఆధారంగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటి సమంత కీలక పాత్ర పోషిస్తోంది. అద్భుత చిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ ‘మహానటి’ చిత్రంలో సమంతతో పాటు కీర్తి సురేష్ పేర్లు ప్రకటించినప్పటి నుంచి ఎవరు సావిత్రి పాత్రలో కనిపిస్తారోనని చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లోనూ తీవ్ర ఆసక్తి పెరిగిపోయింది.

04/22/2017 - 21:14

అందాల భామ ప్రగ్యా జైస్వాల్ ‘కంచె’లో కనువిందు చేసి టాలీవుడ్ ప్రేక్షకుల్ని తన నటనతో ఆకట్టుకుంది. ఆ చిత్రం తర్వాత వరుస అవకాశాలతో బిజీ బిజీగా కెరీర్‌లో ముందుకు దూసుకెళుతోంది. తాజాగా ఈ భామ కృష్ణవంశీ ‘నక్షత్రం’లో ఓ కీలక పాత్రను పోషిస్తోంది. అంతేకాదు, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రంలోనూ కథానాయికగా చేస్తోంది. వీటితో పాటు మరో అవకాశం కూడా ఈ అమ్మడి ఖాతాలో చేరింది.

04/22/2017 - 21:13

‘ఎం.ఎస్ ధోనీ’ చిత్రంలో కథానాయికగా మెరుపులు కురిపించిన భామ కైరా అడ్వానీ ఇక టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. కొరటాల శివ- మహేష్‌బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న తాజా చిత్రంలో నటించేందుకు కథానాయికల అనే్వషణ కొనసాగింది. ఎంతో మందిని అనుకున్నా చివరకు కైరానే ఓకే చేసుకున్నారట. మేలో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టి జూన్, జూలైలో నిరాటకంగా కొనసాగించనున్నారట.

Pages