S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

03/15/2017 - 23:58

బాలీవుడ్‌లో ఆ ఇద్దరూ..ఇద్దరే! అన్నీ వాళ్లు అనుకున్నట్లే జరుగుతాయి. వాళ్ల రూటే సపరేటు! ఇంతకీ వాళ్లెవరనేగా మీ డౌటు.. అక్కడికే వస్తున్నా... వాళ్లు ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొనే, కత్రీనాకైఫ్‌లు. వామ్మో..! అనుకుంటున్నారా? మరి అదే.. క్రేజీ తారలైన వీళ్లు బాలీవుడ్‌లో అగ్ర హీరోల చిత్రాల్లో వారి సరసన ఆడిపాడి కథానాయికలుగా మంచి మార్కుల్నే కొట్టేశారు.

03/04/2017 - 20:58

టాలీవుడ్‌లో ‘హార్ట్‌ఎటాక్’తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది అదాశర్మ. బాలీవుడ్ చిత్రాలతో వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ ఎక్కువగా ప్రాంతీయ భాషల్లోనే నటించే అవకాశం వచ్చింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘క్షణం’లాంటి సినిమాలతో నటిగా మంచి మార్కుల్నే కొట్టేసింది. అయితే చాలా విరామం తర్వాత మళ్లీ బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతోంది. అదే ‘కమాండో-2’.

03/04/2017 - 20:56

కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా 2003లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సామి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్‌తో జోడీ కట్టిన అందాలతార త్రిష క్యారెక్టర్‌కూ మంచి స్పందన లభించింది. విక్రమ్-త్రిష జంట ప్రేక్షకులకు కనువిందు చేసింది. అయితే ఇదే జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

03/04/2017 - 20:50

బాలీవుడ్‌లో విద్యాబాలన్ చేసిన చిత్రాలు చూస్తే ఆమె ప్రతిభ ఇట్టే అర్థమవుతుంది. ఒకదానికి మంచి మరోటి ఆమె నటనా ప్రతిభను చూపిన చిత్రాలే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విద్యను మించి మరొకరుండరంటే ఆశ్చర్యం లేదు. తాజాగా విద్యాబాలన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించబోతోంది. ప్రస్తుతం రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో ‘2.0’లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

03/04/2017 - 20:46

మిల్క్‌బ్యూటీ తమన్నా గురించే ఇప్పుడు టాలీవుడ్ తాజాగా చర్చ జరుగుతోంది. పరిశ్రమలోకి వచ్చిన అనతికాలంలోనే ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్‌లో నటిగా మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ‘బాహుబలి’ ద్వారా ఈ ఇమేజ్ కాస్త ఎక్కడికో వెళ్లిపోయింది. బాలీవుడ్‌లోనూ తమన్నా కబుర్లు అంటే ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్రహీరో బాలయ్య తదుపరి చిత్రంలో తమన్నా నటించనుందని చెప్పుకుంటున్నారు.

02/26/2017 - 07:45

‘‘నాకు కాబోయే వరుడు ఎలా వుండాలంటే..నన్ను బాగా అర్థం చేసుకునేవాడు అయ్యుండాలి. నా ప్రతి పనికీ సహకారం అందించాలి. మంచి హాస్యచతురత కలిగి వుంటే ఇట్టే నచ్చేస్తాడు. చేసేది తక్కువ.. చెప్పేది ఎక్కువ తరహా వ్యక్తులంటే అస్సలు నచ్చదు. ఇలా ఎక్కువ ప్రచారం కోరుకునే వాడు ఇష్టముండరు’’అంటూ చెప్పుకొచ్చింది బాలీవుడ్ సోనాక్షి సిన్హా. ఇంతకీ ఈ వరుడు గురించి ఇప్పుడెందుకనుకుంటున్నారా? అదే మరి.. అక్కడికే వద్దాం..

02/26/2017 - 07:44

టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో కెరీర్‌లో యమ బిజీగా దూసుకెళుత్ను గ్లామర్ క్వీన్ రకుల్ ప్రీత్‌సింగ్. చేసే ప్రతీ చిత్రానికి తన గ్లామర్ డోస్‌ను పెంచుకుంటూ పోతోంది. పోషించే పాత్రల విషయంలోనూ రకుల్ స్టయిల్ రకుల్‌దే! దరిచేరిన ప్రతీ అవకాశాన్ని ఇట్టే ఒప్పేసుకోకుండా ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇప్పుడు టాలీవుడ్‌లో రకుల్ అంటే హాట్ హాటే..! యువతరం హీరోల నుంచి క్రేజీ నటులతో ఆడిపాడుతోంది.

02/26/2017 - 07:42

బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్‌లో మెరుస్తోంది మన అందాల భామ ప్రియాంక చోప్రా. ‘క్యాంటికో’ టీవీ సీరిస్‌తో బాగా పాపులర్ అయిన ప్రియాంక చోప్రా త్వరలోనే ‘బేవాచ్’తో వెండితెరపైనా సందడి చేయనుంది. బాలీవుడ్‌లో కావొచ్చు.. హాలీవుడ్‌లో కావొచ్చు స్టార్‌డమ్ తెచ్చుకోవడం అంత సులువేం కాదు.. కష్టపడకుండా స్టార్ ఇమేజ్ వచ్చేసే ఫార్ములా తెలిస్తే చాలా మందికి స్టార్‌డమ్ వచ్చేసేదేమో.

02/26/2017 - 07:41

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హాలీవుడ్‌లో అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే అక్కడా బిజీ బిజీగానే మారుతోంది. హిందీలో టాప్ హీరోయిన్‌గా అగ్రహీరోల సరసన చిందులేసిన ఈ అమ్మడు క్రేజీతారగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీపిక నటించిన ‘ట్రిఫ్లెక్స్’ చిత్రం ఇప్పటికే విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టుకుంటోంది. ఇప్పుడు మరో హాలీవుడ్ చిత్రంలో కూడా దీపికా నటించబోతోందిట.

02/18/2017 - 22:24

...అంటోంది అందాల తార, కమల్ ముద్దుల తనయ శృతిహాసన్. స్టార్ కూతురిగా వెండితెరపై అడుగుపెట్టిన ఈ బ్యూటీ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. చేసిన చిత్రాలు.. ఆయా చిత్రాల్లో వేసిన క్యారెక్టర్స్ అన్నీ వేటికవే భిన్నంగా ఉండటంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి రెండు చోట్లా అభిమానులున్నారు.

Pages