S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

04/01/2017 - 21:56

టాలీవుడ్‌లో అప్పుడెప్పుడో వచ్చిన ‘అందాల రాక్షసి’తో రంగ ప్రవేశం చేసిన సొగసరి లావణ్య త్రిపాఠిని తాజాగా వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయినా’దాకా చక్కటి వైవిధ్యమైన పాత్రల్లోనే చూపించారు. ఆమెలోని నటనను వెలికి తీశారే తప్ప లావణ్యలోని మరో కోణాన్ని టచ్ చేయలేకపోయారు. అదే గ్లామర్. పరిశ్రమకు వచ్చిన ప్రతీ కథానాయికగా తొలిసారిగా వెండితెరపై తమ అందాల ఆరబోతనే ప్రదర్శిస్తుంటారు. కానీ అలాంటి అవకాశం లావణ్యను దక్కలేదు.

04/01/2017 - 21:54

కెరీర్‌ని ఎప్పుడు ఎలా మలచుకోవాలో ఈ బ్యూటీకి తెలిసినంత మరే తారకూ తెలియదంటే నమ్మశక్యం కాని నిజం. పింక్ సినిమా తర్వాత తాప్సీ రూటే సపరేటు. నిజానికి ఆమెలో హీరోయిన్ కంటే హీరోయిజం ఎక్కువగా ఉంటుంది. కొందరికి అది నచ్చకపోవచ్చు. కెరీర్ ఇప్పుడెలా వుంది? అని తాప్సీని కదిలిస్తే- ‘‘చాలా హ్యాపీగా వున్నా. ‘నామ్ షబానా’ నాకు నచ్చిన పాత్ర. అందరూ వావ్..తాప్సీ అంటున్నారు.

03/30/2017 - 03:21

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా రోజురోజుకీ చేసే చిత్రాలు.. వేసే క్యారెక్టర్ల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటోంది. అందుకే ఆమె చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని నమోదు చేసుకుంటున్నాయి. శత్రుఘ్నసిన్హా తనయగా పరిశ్రమలోకి వచ్చినా.. అటు తర్వాత ఆమె చేసే చిత్రాల ద్వారా తనకంటూ ఓ క్రేజ్‌ని సృష్టించుకుంది.

03/30/2017 - 03:19

అందాలభామ కేథరిన్ ఆశలు ఇప్పటికీ నెరవేరడం లేదు. వెండితెరపై ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది. ఎంతగానో ఎదిగిపోవాలని కలలుగన్నది. అయితే ఈ అమ్మడు అనుకున్న ఆశలు నీరుగారిపోయాయి. వచ్చిన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. చేసిన కొద్ది చిత్రాలే అయినా ఆయా చిత్రాల్లో పోషించిన క్యారెక్టర్లు మాత్రం నటిగా కేథరిన్‌కు మంచి పేరునే తెచ్చిపెట్టాయి.

03/30/2017 - 03:17

బాలీవుడ్ బ్యూటీ కత్రీనాకైఫ్ యమజోరుమీదుంది. తన కెరీర్‌ని అదే జోరుతో హుషారుగా మలుచుకుంటోంది. తాజాగా సల్మాన్‌ఖాన్‌కు జోడీగా ‘టైగర్ జిందాహై’లో హొయలు ఒలకబోస్తోన్న ఈ ‘కైఫ్’ మరో ఖాన్‌తోనూ చెట్టాపట్టాలేయడానికి సిద్ధమవుతోందిట. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో కత్రీనాకైఫ్‌ని కథానాయికగా ఎంపిక చేసుకున్నారట.

03/18/2017 - 22:07

అందాల భామ అనుష్కశర్మ నటించిన ‘పీకే’, ‘సుల్తాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని అందుకోవడంతో మంచి ఊపుమీదుంది. బాలీవుడ్‌లో ఇప్పుడు అనుష్కశర్మ అంటే యమక్రేజీ. ఆమె నిర్మాతగా తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘్ఫలౌరి’. ఇందులో అనుష్క ఆత్మగా నటించింది. కెరీర్ విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటోంది. స్లో అండ్ స్టడీగా సాగిపోతున్న ఈ అమ్మడి కెరీర్ మంచి రేంజ్‌లో వుంది.

03/18/2017 - 22:05

బాలీవుడ్ భామ విద్యాబాలన్ దృష్టి ఎప్పుడూ వైవిధ్యమైన క్యారెక్టర్లవైపే వుంటుందనేది మరోసారి రుజువవుతోంది. ‘డర్టీ పిక్చర్’తో హాట్ హాట్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చి అందర్నీ తన పాత్ర ద్వారా అందర్నీ ఆకట్టుకోవడమేగాక, విమర్శకుల్ని సైతం మెప్పించేలా చేసింది. తాజాగా మరో సంచలనమైన పాత్ర ద్వారా పలకరించబోతోంది. అదే ‘బేగం జాన్’ ‘మై బాడీ.. మై హౌస్.. మై కంట్రీ మై రూల్స్’ అనేది ఉపశీర్షిక.

03/18/2017 - 22:04

అవును.. ఇప్పుడు శృతిహాసన్ జోరుగా..హుషారుగా వుంది. అందుకు కారణం లేకపోలేదు.. పవన్‌కళ్యాణ్‌కు జోడీగా తొలిసారిగా ‘గబ్బర్‌సింగ్’లో ఆడిపాడింది. ఆ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ విజయంలో శృతిహాసన్ పాత్రకూ మంచి మార్కులే పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద జోరుగా కలెక్షన్లు రాబట్టిన ఆ చిత్రంలో నటించిన నటీనటులకూ మంచి ఇమేజే వచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి పవర్‌స్టార్‌తో ఈ అందాలభామ జోడీ కడుతోంది.

03/16/2017 - 00:03

అందాలభామ కాజల్ అగర్వాల్ తాజాగా టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెం.150’ చిత్రంలో నటించి మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చినా అవకాశాలు మాత్రం ఆమెను చేరలేకపోతున్నాయి. ఈ సినిమాలో చేస్తున్నప్పుడు ఆమెలో ఎన్నో ఆశలు.. అవన్నీ ఇప్పుడు నీరుగారిపోయాయి. తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోలందరి సరసన నటించి కథానాయికగా మంచి మార్కుల్నే కొట్టేసింది. అటు తర్వాత బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది.

03/16/2017 - 00:01

‘‘నటి అన్నాక అన్ని భాషల్లో నటించాలి. నటనకు భాషాబేదం అంటూ ఏదీ లేదు. అవకాశాలు ఎక్కడ వచ్చినా చేయాలి. అలాంటప్పుడే ఓ నటికి మంచి గుర్తింపుతో పాటు తన కెరీర్ కూడా ఆశాజనకంగానే సాగుతుంది అనేది నా గట్టినమ్మకం’’అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి. ప్రస్తుతం నటులు భిన్నమైన పాత్రల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు, ప్రయోగాత్మక పాత్రలపై దృష్టిసారిస్తున్నారు.

Pages