S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

08/21/2016 - 06:13

టాలీవుడ్‌లో తాజాగా విడుదలైన ‘పెళ్ళి చూపులు’తో అందరి దృష్టిని ఆకర్షించిన భామ రీతూవర్మ. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతో రీతూకు అవకాశాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఆమె ఖాతాలో మరో అవకాశం వచ్చిచేరింది. అదే ‘గూడాచారి’. శశితిక్క, రాహుల్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో రీతూ అవకాశం దక్కడంతో ఎగిరిగంతేసింది. ఈ చిత్రం కోసం దర్శక, నిర్మాతలు ఎందరో కథానాయికలను పరిశీలించారు.

08/21/2016 - 06:11

ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన అందాలతార నికిషాపటేల్‌కు కాలం కలిసిరాలేదు సరికదా..వచ్చిన అనేక అవకాశాలు వెనక్కు వెళ్లిపోయాయి. పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ సరసన ‘పులి’లో మెరుపులు కురిపించిన ఈ బ్యూటీ ఆ చిత్రంతో యువతరం గుండెల్లో కాస్తంత స్థానానే్న సంపాదించుకుంది. అటు తర్వాత అడపా దడపా అవకాశాలు లభించినా ఈ భామ అనుకున్నంత మాత్రం క్రేజ్‌ని సంపాదించుకోలేకపోయింది.

08/13/2016 - 03:43

బాలీవుడ్‌లో ‘దబాంగ్’ బ్యూటీగా విశేష ప్రాచుర్యం పొందిన అందాలతార సోనాక్షి సిన్హా హాట్ హాట్‌గా అందరి హృదయాలను గిలిగింతలు పెడుతోంది. చేస్తున్న చిత్రాలు..పోషిస్తున్న పాత్రలు వేటికవే భిన్నంగా వుండేలా చూసుకుంటూ కెరీర్‌లో ముందుకు పరుగులు తీస్తోంది. గ్లామర్ ఒక్కటే కాదు.. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల కోసం వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఓ శైలిని ఏర్పరచుకుంటోంది.

08/13/2016 - 03:39

అందాలతార శ్రుతిహాసన్ ఆలోచనలు...అలవాట్లు.. జీవనశైలి...అన్నీ భిన్నంగానే వుంటాయి. ఈ విషయంలో ఇతర తారలకంటే ఈ భామ ముందుంటుంది. అలా వుండబట్టే వెండితెరపై వెలిగిపోతోంది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మరోసారి పవన్‌కళ్యాణ్‌తో జోడీ కడుతోంది. ప్రస్తుతం నాగ చైతన్యతో ‘ప్రేమమ్’లోనూ ఆడి పాడుతోంది. ఎలా వుంది కెరీర్ అని శ్రుతిని కదిలిస్తే- ‘‘చాలా సాఫీగా సాగుతోంది. ఈ విషయంలో నా ప్రయాణం నాదే.

08/13/2016 - 03:37

బాలీవుడ్ అంతా ఇప్పుడు సన్నీలియోన్‌ని చూసి ‘ప్చ్..సన్నీ’అంటున్నారంతా. అందుకు కారణాలు లేకపోలేదు. శృంగారతారగా ఓ వెలుగు వెలిగి యువతరం గుండెల్లో గుప్పెడు మనసును దోచుకున్న ఈభామ అటు తర్వాత బాలీవుడ్‌లో ప్రవేశించి తన సత్తాను చాటింది. హిందీ చిత్రపరిశ్రమకు వచ్చిన కొత్తల్లో అందరూ సన్నీ చూసి హేళనగా మాట్లాడుకున్నారు. పోర్న్‌స్టార్ భామ బాలీవుడ్‌లోకా? అంటూ అందరూ ఎగతాళి కూడా చేశారట.

08/07/2016 - 01:03

‘జోరుగా..హుషారుగా షికారు చేద్దామా..హాయి హాయిగా..’ అంటూ భలే హుషారైన జోష్‌తో అందర్నీ అలరిస్తోంది అందాల భామ రాశీఖన్నా. టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే భలే క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ‘సుప్రీమ్’తో ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీకి మంచి మంచి అవకాశాలు.. టాప్ హీరోల సరసన ఆడిపాడే ఛాన్స్ దక్కుతోంది. తాజాగా గోపీచంద్‌తో ఓ చిత్రం చేస్తోంది.

08/07/2016 - 01:01

బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా గురించే ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు. ఆమె తాజాగా నటించిన ‘డిషూమ్’ చిత్రంలోని ‘జానే మన్ ఆ..’పాట ఎక్కడ విన్నా మారుమోగిపోతోంది. ఈ పాటపై వరుణ్‌ధావన్‌తో జతకట్టిన పరిణితి పండించిన కెమిస్ట్రీ అంతా ఇంతా కాదు అంటున్నారు బాలీవుడ్ జనాలు. ‘డిషూమ్’లో ప్రత్యేక గీతమైన ఈ పాట అందరి నోళ్లలో అంతగా నానడానికి కారణం పరిణితి-వరుణ్‌ల లిప్‌లాకేనని చెప్పుకుంటున్నారు.

08/07/2016 - 00:58

స్టార్..స్టార్ అంటున్నారు ఇప్పుడు అనుష్కశర్మను చూసి బాలీవుడ్. ‘పీకే’ చిత్రంతో స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ తాజా చిత్రం ‘సుల్తాన్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దాంతో మరోసారి అనుష్కకు భలే క్రేజ్ వచ్చింది. ‘సుల్తాన్’తో వచ్చిన క్రేజ్‌తో ఇప్పుడు బాలీవుడ్‌లో అగ్ర కథానాయికల లిస్టులో చేరిపోయింది.

08/07/2016 - 00:56

‘‘నేను ఏదైనా చేశాకే చెబుతా. చేయక ముందు ఏదీ చెప్పడం నాకు చేతకాదు. చాలామంది తారలు నేను ఇది చేస్తున్నా.. అది చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటుంటారు. తీరా అదీ..ఇదీ చేయక పప్పులో కాలేసి బోల్తాకొడతారు. అందుకే వాళ్లు చేస్తున్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింటున్నాయి. అంతేకాదు... వాళ్ల కెరీర్ కూడా అదే స్థాయిలో దిగజారుతోంది’’ అంటూ పెద్ద పెద్ద కబుర్లే చెబుతోంది అందాల భామ సమంత.

07/30/2016 - 21:40

‘జోడి కట్టిందే నీ కోసం..’ అంటూ వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘లక్ష్మి’ చిత్రంలో వెంకటేష్ సరసన ఆడిపాడి యువతను తనవైపునకు తిప్పుకున్న అందాల తార నయనతార మరో సారి అతడితోనే జత కట్టబోతోంది. ఇద్దరి కలయికలో వచ్చిన ‘లక్ష్మి’, ‘తులసి’ చిత్రాలు ఈ జంటకు భలే క్రేజ్‌ని తెచ్చిపెట్టాయి. ఈ సినిమాల తర్వాత నయనతారకు తెలుగులో భలే అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి.

Pages