S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

05/28/2016 - 22:18

టాలీవుడ్‌లో ఇప్పుడు రాశీఖన్నా కెరీర్ యమజోరుమీదుంది. ఎవ్వరి నోటా విన్నా రాశీ కబుర్లే కబుర్లు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలో యమక్రేజ్‌ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఎన్నో ఆశలతో వెండితెరపై అడుగుపెట్టే భామలు మరెన్నో కలలుగనడం సర్వసాధారణం. అయితే అందరికీ అదృష్టం కలిసివస్తుందా? అంటే ఆలోచించాల్సిందే. కానీ రాశీఖన్నా విషయంలో మాత్రం అదృష్టం బాగానే కలిసి వస్తోంది.

05/28/2016 - 22:17

పోర్న్ స్టార్‌గా సన్నీలియోన్ ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో తెలియంది కాదు. ఆ ఇమేజ్‌తోనే అటుపై బాలీవుడ్‌కి పరిచయం అయింది. ‘బిగ్ బాస్’ కార్యకమ్రం ద్వారా బాలీవుడ్‌లో ప్రవేశించిన సన్నీ ఎంతటి పాపులారిటీ సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. పాపులారిటీ..ఇమేజ్..ఇలా ఒకటేమిటి? ఎంతో మంది యువతరం ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంది. ఇదంతా సరే..మరి చిక్కులేమిటి? అని ఆలోచిస్తున్నారా? అదే..మరి!

05/28/2016 - 21:48

సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు అందరితోనూ ఆడిపాడిన అందాలభామ నయనతార హవా మళ్లీ ఊపందుకుంది. తమిళంలో అయితే ఎప్పటికప్పుడు తన క్రేజ్‌ని పెంచుకుంటూనే వుంటోంది. టాలీవుడ్‌లో సైతం మంచి ప్రాజెక్టులే చేసి, అగ్రహీరోలందరి సరసన గ్లామర్‌ని చిందించి ప్రేక్షకులను మైమరపింపజేసింది. తాజాగా తెలుగులో ఈ మధ్య చిరంజీవితో నటించే అవకాశం వచ్చినా, డేట్స్ కుదరక ఆ చిత్రానికి దూరమయింది.

05/21/2016 - 22:21

దక్షిణాది చిత్రాల్లో నటించడమంటే పరిణీతి చోప్రాకు మహా ఇష్టమట. అనుష్క, ఇలియానా, హన్సిక, తాప్సీ ఇలా చాలామంది ఉత్తరాది భామలు దక్షిణాదిలో అడుగుపెట్టి అందరి అభిమానాలను చూరగొన్న విషయం తెలిసిందే. అలా వారి దారిలో పరిణీతి చోప్రా కూడా చేరబోతోందిట. ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా, కత్రీనాకైఫ్ లాంటి అందాల సుందరాంగులు సైతం దక్షిణాది చిత్రాల్లో నటించి తమ ప్రతిభను చాటుకున్న తారలే కావడం గమనార్హం.

05/21/2016 - 22:20

చాలా మంది బాలీవుడ్ తారలు జిమ్మిక్కులతో కాలం గడిపేస్తుంటారు. అలాంటి జిమ్మిక్కులు వారి కెరీర్‌ను కాపాడతాయని వారి గట్టి నమ్మకం కూడా. ఇలాంటి జిమ్మిక్కుల విషయంలో కంగనా రనౌత్ మాత్రం ఎంతో దూరంగా వుంటుందిట. ‘‘తారల కెరీర్‌కు ఇలాంటి జిమ్మిక్కులు ఏ మాత్రం ఉపయోగపడవు. ఆన్‌లైన్‌లో ఎక్కువ హిట్స్ తెచ్చుకోవడమే ఇప్పుడు సూపర్‌స్టార్ అన్నట్టుగా మారిపోయింది.

05/21/2016 - 22:17

ప్రస్తుతం చాలా మంది తారలు గ్లామర్‌ను కాపాడుకోవడానికి చూపిస్తున్న శ్రద్ధ నటనపై పెట్టడం లేదని బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ అంటోంది. అంతేకాదు, నేటి తారలు జీరోసైజ్, సిక్స్‌ప్యాక్‌ల వెంట పరుగులు తీస్తూ కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారని కూడా వాపోయింది. పెళ్లి తర్వాత అభినయానికి ఆస్కారం వున్న పాత్రలకు ప్రాధాన్యతనిస్తోంది ఈ అమ్మడు.

05/14/2016 - 21:21

అందం, అభినయం, అందాల ఆరబోత..ఇలా అన్నింటికీ ఎంతో ముందున్న బ్యూటీ రెజీనా పరిస్థితి మాత్రం టాలీవుడ్‌లో ఏ మాత్రం ఆశాజనకంగా లేదంటే లేదు. అంతేకాదు, లిప్ టు లిప్, లిప్‌లాక్‌లకు కూడా తలుపులు తెరిచే ఉంది. అయినా కెరీర్‌లో ఎదుగూ బొదుగూ లేకుండాపోయింది. రెజీనా పరిస్థితి చూసిన వారంతా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ అవ్వడం ఖాయం అని భావించారు. తను ఈ విషయంలో ఎన్నో కలలుకన్నది.

05/08/2016 - 06:55

బాలీవుడ్‌లో ఎవ్వరి నోట విన్నా ఒకటే మాట..అదే దీపికా పదుకొనే గురించి. ఆమె వెండితెరపై అడుగుపెట్టినప్పటి నుంచి ఎప్పుడూ వార్తల్లోనే వుంటూ తన కెరీర్‌ను కాపాడుకుంటూ వస్తోంది. విభిన్నమైన చిత్రాల్లో వెరైటీ పాత్రలు చేసి అందరి మనసులను కొల్లగొట్టిన ఈ భామ తాజాగా సల్మాన్‌తో చిందేయనుందట. ఇదే ఇప్పుడు బాలీవుడ్ అంతా హాట్ హాట్ టాపిక్‌గా మారిందట.

04/30/2016 - 22:49

మోడల్‌గా, నటిగా అందరిచేత ప్రశంసలందుకున్న అందాల తార బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ కళ్లు ఇప్పుడు ‘బాహుబలి’ ప్రభాస్‌పై పడ్డాయట. ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సాధించిన అఖండ విజయం ఆమె మనసు కొల్లగొట్టిందట. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఈ చిత్రం బాక్సాఫీస్‌ను కొల్లగొట్టడం తెలిసిందే. అంతేకాదు, ఈ చిత్రంలో ‘బాహుబలి’ పాత్రలో ఉరిమిన ప్రభాస్ ఎందరో యువతులకు రాకుమారుడై పోయాడంటే ఆశ్చర్యం లేదు.

04/24/2016 - 07:27

‘‘బాలీవుడ్‌లో ఇప్పుడొస్తున్న చిత్రాలన్నీ ఒకే మూస పద్ధతిలో వుంటున్నాయి. కొత్తదనం మచ్చుకైనా కనిపించడం లేదు. అలా వస్తున్నాయి..ఇలా పోతున్నాయి. ఏవో వేళ్లమీద లెక్కపెట్టుకునే మంచి చిత్రాలు అన్నవి అప్పుడప్పుడు మాత్రమే తొంగిచూస్తున్నాయి’’ అంటోంది అందాలతార సోనమ్‌కపూర్. ఈ భామ ఇటీవల నటించిన చిత్రం ‘నీర్జా’లో ఎయిర్‌హోస్టర్స్ నీర్జా భనోట్ జీవిత కథను వెండితెరపై చూపించారు.

Pages