S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

02/26/2017 - 03:22

ప్రపంచంలో గొర్రెలు ఎక్కువగా ఉన్నది చైనాలోనే. అయితే మనుషులు, గొర్రెల నిష్పత్తి ప్రకారం అవి ఎక్కువగా ఉన్నది మూడు దేశాల్లో. న్యూజిలాండ్, మంగోలియా, ఆస్ట్రేలియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. సగటున ఒక మనిషికి 7 నుంచి 22 గొర్రెల చొప్పున అక్కడ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా అవసరాల్లో ఎక్కువ భాగం ఈ దేశాలే తీరుస్తున్నాయి.

02/26/2017 - 03:20

చిన్నగా, అందంగా ఉడతలా కనిపించే ‘స్క్విరల్ మంకీ’ తన జీవితకాలంలో 99 శాతం చెట్లపై భాగంలోనే జీవిస్తాయి. నిరంతరం ఒకచెట్టు మీంచి మరో చెట్టుమీదకు తిరుగుతూ ఉంటాయి. ఆహారానే్వషణ కోసం ఎక్కడెక్కడికో వెళతాయి. అయితే తన కుటుంబంలో మిగతా సభ్యులు తనను అనుసరించేందుకు అవి ఒక పద్ధతి పాటిస్తాయి. ఇది వింతగా అనిపిస్తుంది కానీ వాటికి అదో భద్రతా ఏర్పాటన్నమాట.

02/26/2017 - 03:17

నిజమే. ఈ చిత్రంలో అచ్చం తోడేలులా కనిపిస్తున్నప్పటికీ వాటికీ దీనికీ పోలిక లేదు. ఇది కుక్క జాతికి చెందిన ‘కొయెట్’. కుక్కల తరువాత, తోడేలుకు ముందు జరిగిన పరిణామ దశకు సాక్ష్యం ఇవి. నక్కలా కుచ్చుతోక ఉంటుంది. పసుపురంగు కళ్లుంటాయి. నిటారైన గుండ్రటి చెవులతో వినికిడి శక్తి ఎక్కువ. మైలు దూరంలో ఆహారం లేదా శత్రువుల కదలికలను ఇవి పసిగట్టగలవు. ఈతలో ఇవి మేటి. గంటకు 65 కి.మి.

02/19/2017 - 01:34

శీతాకాలం ముగిసి వసంతం వచ్చేసినట్లు తెలియాలంటే వాతావరణంలో వచ్చిన మార్పులు, పంచాంగాలపై మనం ఆధారపడతాం కదా! కానీ ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ‘గ్రౌండ్‌హగ్స్’ కదలికల ఆధారంగా వసంతం ఎప్పుడు వచ్చేదీ తెలుసుకుంటారు అక్కడి వారు. శీతాకాలంలో సుషుప్తావస్థలో గడిపేసే ఈ ఉడతజాతి జీవులు మత్తు వదిలి బొరియల్లోంచి బయటకు వచ్చి తమ నీడ పడే తీరును చూసి వసంతం మొదలయ్యే రోజును లెక్కిస్తాయట.

02/19/2017 - 01:32

పెంపుడు జంతువులు, ఉడకని మాంసాహారం తినడం ద్వారా ఇతర జీవుల్లోకి చేరే పరాన్నజీవి టేపేవార్మ్. అతిధేయి తినే ఆహారాన్ని తిని బతికే టేప్‌వార్మ్ (బద్దెపురుగు) చాలా సన్నగా, తెల్లగా పొడవుగా ఉంటుంది. పెద్దచిన్న పేగుల్లో ఆశ్రయించి తన పబ్బం గడుపుకునే ఇవి అతిధేయి జీవిని బట్టి పొడవు పెరుగుతుంది. మనుషుల్లో నాలుగైదు అడుగుల మేరకు పెరిగితే కొన్ని జంతువుల్లో 30 అడుగుల మేర పొడవు ఉంటుంది.

02/12/2017 - 04:17

మనదేశంలో చాలాచోట్ల సంక్రాంతి సందర్భంగా కనుమనాడు పశువులకు పూజ చేయడం రివాజు. కానీ వియత్నాంలో ఏటా ఫిబ్రవరి మొదటి వారంలో పశువులకు రంగులద్ది పండుగ చేసుకోవడం ఆనవాయితీ. దీనికోసం హనమ్ ప్రావిన్స్‌లో జరిగే పశువుల రంగుల పండుగకు దేశం నలుమూలల నుంచి వచ్చే రైతులు పోటీల్లో పాల్గొంటారు. తాము పెంచిన పశువులకు విభిన్నమైన రంగులతో అలంకరించి పోటీలోకి దించుతారు.

02/12/2017 - 04:16

ఉత్తర అమెరికా, కెనడాల్లో కనిపించే ఈ ‘రెడ్ కార్డినల్’ పక్షులను అలా పిలవడానికి అసలు కారణం తెలుసా. రోమన్ కాథలిక్ చర్చిలలో ‘కార్డినల్స్’ ధరించే వస్త్రాలు, టోపీ ఎర్రటి రంగులో ఉంటాయి. అలా ఎర్రటి రంగులో ఉండే ఈ పక్షులను కూడా ‘రెడ్‌కార్డినల్ బర్డ్స్’గా పిలవడం అలవాటైంది. కాంతివంతమైన ఎరుపు రంగుతో మెరిసిపోయే ఈ పక్షులు మగవి. ఆడపక్షులు ఇంత మెరుపు, ఎరుపుతో ఉండవు.

02/05/2017 - 01:09

ఉత్తర అమెరికా, మెక్సికో, కెనడాల్లో మాత్రమే కనిపించే ‘ప్రెయరీ డాగ్స్’ నిజానికి కుక్కలు కావు. కనీసం అవి కుక్కల జాతికి చెందినవి కూడా కాదు. వాటి రూపురేఖలు కూడా కుక్కలతో పోలి ఉండవు. కేవలం పేరులో మాత్రమే ‘డాగ్’ అన్న పదం ఉంటుంది. నిజానికి ఇవి ‘ఉడత’ (గ్రౌండ్ స్క్విరల్) జాతికి చెందినవి. సమూహాలుగా జీవించే వీటి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది.

02/05/2017 - 01:07

సాధారణ ‘్ఫంచ్’ పక్షులు ఒక్క ఆస్ట్రేలియాలో తప్ప ప్రపంచం అంతటా కనిపిస్తాయి. అక్కడి వాతావరణ పరిస్థితులు వాటికి అనుకూలం కాదు. నాలుగు ఉపజాతులు, 40 రకాల ‘్ఫంచ్’ పక్షుల్లో కామన్ ట్రూ ఫించ్ పక్షుల సంఖ్య ఎక్కువ. ఆడపక్షులు కాస్త లేత రంగుల్లో ఉంటే మగపక్షులు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. సాధారణంగా ఎర్రటి ముఖంతో ఉండే మగపక్షులంటే ఆడపక్షులకు ఎంతో ఇష్టం.

02/05/2017 - 01:04

పిస్తా ఉత్పత్తిలో ఇరాన్ అగ్రస్థానంలో ఉన్నా వినియోగంలో మాత్రం చైనాయే టాప్. అక్కడి వారికి పిస్తా పప్పులంటే పిచ్చి. ఆరోగ్యం కోసం వాటిని ఎక్కువగా వినియోగిస్తారు. ఈ పిస్తా పప్పుల ఉత్పత్తిలోను, వినియోగంలోను అమెరికా రెండో స్థానంలో ఉంది. ఒక పిస్తా చెట్టు రెండేళ్లకు ఓసారి 50 కిలోల పప్పులను లేదా 50వేల పప్పుగింజలను ఇస్తుంది. మొదట

Pages