S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

03/26/2017 - 09:16

‘డస్కీ లీఫ్ మంకీ’ అని, ‘డయామెడ్ మంకీ’ అని పిలిచే ఈ కోతుల కళ్లవద్ద తెల్లటి వలయాలు ఉంటాయి. ఇవి పుట్టినప్పుడు కాషాయం లేదా పసుపురంగుతో ఆకర్షణీయంగా ఉంటాయి. పెరిగే కొద్దీ గ్రేకలర్‌లోకి బొచ్చు రంగు మారుతుంది. రోజుకు కనీసం 2 కేజీల ఆహారాన్ని తింటాయి. వీటికళ్లవద్ద తెల్లటి వలయాలు ఉండటం వల్ల వీటిని ‘స్పెక్టాకిల్ లంగూర్’ అని కూడా అంటారు.

03/18/2017 - 23:02

కొన్నిరకాల పక్షులు ఎగురుతూ వెళ్లి నీళ్లలో ఆహారాన్ని అందిపుచ్చుకోవడం తెలుసు. కానీ ‘స్వాలో’ పక్షులు నీటి ఉపరితలంపై ఎగురుతూ దాహార్తిని తీర్చుకుంటాయి. అది వీటి ప్రత్యేకత. అందమైన రంగులు, విభిన్నమైన ఈకలతో కూడిన తోకలు వీటికి ప్రత్యేక ఆకర్షణ. ఆ విభిన్నతే వాటి ప్రాణాలకు ప్రమాదంగా పరిణమించింది. టోపీల తయారీలో వీటి ఈకలను వాడేందుకు ఈ పక్షులను వేటాడంవల్ల వాటి సంఖ్య తగ్గిపోతోంది.

03/18/2017 - 23:00

అంటార్కిటికా, అలస్కా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ఈ సముద్ర పక్షి పేరు అల్బట్రాస్. 50 అంగుళాలవరకు పెరిగే ఈ పక్షి రెక్కలు విప్పితే 12 అడుగుల పొడవుంటాయి. పొడవైన, పెద్దవైన రెక్కలున్న పక్షుల్లో ఇది మొదటిది. గాలుల ఆధారంగా రెక్కలు కదలించకుండా రోజుల తరబడి ఎగురగలగడం వీటి ప్రత్యేకత. సంతానోత్పత్తి సమయంలో మినహా మిగతా జీవితమంతా సముద్రంపైనే ఇది గడిపేస్తుంది.

03/18/2017 - 22:58

‘స్వాలో’ పక్షులకు తోకవద్ద పొడవైన రెండు ఈకలు ఉన్నట్లు ఈ సీతాకోక చిలుకల రెక్కలు వెనుకభాగం కొనలు రెండువైపులా పొడవుగా ఉంటాయి. అందుకే ఈ పక్షులను ‘స్వాలోటెయిల్డ్’ సీతాకోక చిలుకలుగా పిలుస్తారు. జీవితచక్రంలో ఇవి గొంగళిపురుగుగా ఉన్నప్పుడు ప్రమాదం ఎదురైతే నోటిలోంచి ఆరెంజ్ రంగులో ఉండే రసాయన ద్రవాన్ని స్రవిస్తాయి. అది దుర్వాసనతోకూడి అసహ్యం కలిగిస్తుంది. దాంతో శత్రువులు దూరంగా వెళ్లిపోతాయి.

03/15/2017 - 23:04

ఆర్కిటిక్ ప్రాంతంలో ఉండే నక్కలు కుక్క జాతిలో అతి చిన్నవి. వేసవిలో గోధుమవర్ణంలో ఉండే బొచ్చుతో కనిపించే ఈ నక్కలు మిగతా కాలంలో తెల్లగా అందంగా కనిపిస్తాయి. మైనస్ 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతనూ తట్టుకోగలిగే ఇవి మంచు అడుగున వెళ్లే ఆహారాన్ని కూడా కనిపెట్టి దాడిచేయగలవు. ఇవి తన జీవితంలో ఎన్నడూ సుషుప్తావస్థలోకి వెళ్లవు. వందేళ్లనాటి బొరియల్లోనే అవి నివసిస్తాయి.

03/15/2017 - 23:02

స్నోయివోల్స్‌గా పిలిచే ఈ మంచు గుడ్లగూబలకు ఎలుకజాతికి చెందిన ‘లెమ్మింగ్స్’ అంటే మహాఇష్టం. మంచుతో నిండిన ఆర్కిటిక్ ప్రాంతంలో నివసించే ఈ తెల్లటి గుడ్లగూబలు రోజుకు మూడు నుంచి ఐదు లెమ్మింగ్స్‌ను తినేస్తాయి. ఏడాదికి కనీసం 1600 లెమ్మింగ్స్‌ను సగటున ఒక గుడ్లగూబ తింటుందంటే వీటికి అవంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది. మగపక్షులు పూర్తిగా తెల్లగాను, ఆడపక్షులు నల్లటి మచ్చలున్న తెలుపువర్ణంలోను కనిపిస్తాయి.

03/15/2017 - 22:59

ఆహారం కోసమే, సంతానోత్పత్తి కోసమే పక్షులు, జంతువులు వలస వెళతాయని అందరికీ తెలుసు. కానీ ఎలుకజాతికి చెందిన ‘లెమ్మింగ్స్’ సామూహికంగా వలస వెళ్లడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఒక ప్రాంతంలో లెక్కకుమించి వాటి సంఖ్య పెరిగినప్పుడు కొత్తతరానికి ఆహారం కొరత లేకుండా ఉండేందుకు వయసులో పెద్దవిగా ఉన్న లెమ్మింగ్స్ వలసకు సిద్ధమవుతాయి. కొత్త ప్రాంతంలో ఆహారానికి తగిన వనరులు ఉన్నదీ లేనిదీ చూసుకుని అక్కడ స్థిరపడతాయి.

03/04/2017 - 23:19

అమెరికాకు చెందిన ‘స్కువా’ సముద్రపక్షి. సీగల్స్‌కు దగ్గరి జాతి. ఇతర పక్షుల ఆహారాన్ని దొంగిలించడం వీటి ప్రధాన లక్షణం. స్కిమ్మర్స్, పఫిన్స్ వంటి పక్షులు ఆహారాన్ని తీసుకువెళుతున్నప్పుడు ఆకాశంలో వెంటాడి దొంగిలిస్తాయి. చాలా దూకుడుగా వ్యవహరించే ఈ పక్షులు సంతానోత్పత్తి సమయంలో మాత్రం స్వయంగా ఆహారాన్ని వేటాడి సంపాదిస్తాయి. జర్మన్ భాషలో ‘స్కువా’ అంటే ‘హంటర్’ అని అర్థం.

03/04/2017 - 23:17

‘బిస్కట్’ అంటే అసలు అర్థం తెలుసా! లాటిన్‌లో ‘బిస్’ అంటే రెండుసార్లు అని, ‘కిట్’ అంటే ఉడికించడం (బేకింగ్) అని అర్థం. అసలు ఇంగ్లీషు డిక్షనరీ (ఆక్స్‌ఫర్డ్)లో ‘బిస్కట్’ అన్న పదానికి స్పెల్లింగ్ ‘బిఐఎస్‌కెఐటి’ అని ఉంటుదట. ఇంగ్లీషులో ఇప్పుడు వాడుతున్న స్పెల్లింగ్ ఇందుకు భిన్నంగా ఉంటుంది. సరే, బిస్కట్లు ఎలా తినాలో, ఎలా తింటే మేలో ఓ అధ్యయనం నిర్వహించి తేల్చారు.

03/04/2017 - 23:15

ఉత్తర అమెరికాకు చెందిన ‘స్నో గూస్’కు వాటి రంగును బట్టి అలా పిలుస్తున్నారు. తెల్లటి పొడవైన రెక్కలతో అవి ఆకర్షణీయంగా ఉంటాయి. వాటి రెండు రెక్కల పొడవు గరిష్టంగా ఆరు అడుగులు ఉంటాయి. అవి రెక్కలు విప్పార్చి ఎగిరితే వింతగా ఉంటుంది. లక్షల సంఖ్యలో కలసి గుంపుగా వేలాది మైళ్ల దూరం వలస వెళ్లడం వీటి ప్రత్యేకత. ఆ సమయంలో తెల్లటి మబ్బు కదులుతున్నట్లుగా అవి కనిపిస్తాయి.

Pages