S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

03/13/2016 - 08:00

బ్రిటన్‌లో కన్పించే ఈ ఎర్ర ఉడతలకు పైన్‌కోన్ అంటే చాలా ఇష్టం. సాధారణంగా ఆహారాన్ని రెండుచేతులతో గట్టిగా పట్టుకుని తినడం వీటి అలవాటు. కానీ పైన్‌కోన్ అంటే తెగ ఇష్టపడే ఇది ఏదో ఒక చేత్తోనే దానిని పట్టుకుని ఆస్వాదిస్తూ ఆరగిస్తుంది. వీటి శరీరంపై బొచ్చు ఎర్రగా ఉంటుంది. అదే దీని ప్రత్యేకత. సంవత్సరానికి రెండుసార్లు శరీరంపై బొచ్చును విడుస్తుంది.

03/05/2016 - 20:10

మనం షికాకాయ్‌ని తలంటుకోవడానికి, హెయిర్ కండిషనర్‌గా ఉపయోగిస్తాంకదా. కానీ దానికంటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఔషధాల్లోను, షాంపూల తయారీలోను, బట్టలు ఉతికే పదార్థంగానూ, ఆహార పదార్థాల తయారీలోనూ వాడతారు. తుమ్మజాతికి చెందిన షికాకాయ్ చెట్ల ఆకులు, బెరడు, కాయలు, గింజలు అన్నీ ఉపయోగకరమైనవే. వీటి బెరడులో ఉండే సపోనిన్ చర్మరక్షణకు పనికొస్తుంది. వీటి ఆకులు కొన్ని రకాల పచ్చళ్లలో వాడతారు.

02/28/2016 - 16:32

అమెరికాలోని అమెజాన్, ఒరినాకో అడవులు, నదీ ప్రాంతాల్లో కన్పించే అనకొండ పాములు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. సినిమాల్లో చూపించినంత భయంకరమైన పాములు కాదుకానీ ఆహారాన్ని ఒక్కసారిగా మింగేయడం వాటికి ఇష్టం. వీటికి విషం ఉండదు. ఆహారంగా భావించే వాటిని చుట్టచుట్టేసి, ఊపిరాడకుండా చంపి మింగేయడం వాటికి అలవాటు. ఎక్కువగా నీటిలోపలే ఉండి రాత్రిపూట ఆహారంకోసం వేటాడతాయి.

02/22/2016 - 22:26

ప్రపంచంలో అతి చిన్నకోతిగా చెప్పుకునే ‘పిగ్మీ మంకీ’ మహా అయితే నాలుగు అంగుళాలు పెరుగుతుంది. మన అరచేతిలో ఇమిడిపోయే అంత సైజులో ఉండే ఇవి చెట్ల శిఖరాన ఉండటానికి ఇష్టపడతాయి. అవసరమైతే ఒక్కగెంతులో 15 అడుగుల దూరాన్ని దూకే శక్తి వీటికి ఉంది. చెట్ల బెరడును నోటితో తొలిచి, రసాన్ని ఇష్టంగా చప్పరిస్తాయి. మగవాటికన్నా ఆడవి కాస్త ఒకటిరెండు సెంటీమీటర్లు పెద్దవిగా ఉంటాయి.

02/14/2016 - 18:20

చాలా మందికి జీడిపప్పు అంటే బాగా ఇష్టం. నిజానికి ఇది బలవర్దకమైన ఆహారమే. కానీ ఇందులో ఉండే కొన్ని ప్రొటీన్లు కొందరికి పడవు. పాలు, పాలపదార్థాలు కొందరికి పడనట్టే ఇదీను. అందువల్ల జీడిపప్పు పడనివారు తింటే అజీర్తి, ఒళ్లంతా రాషెస్ వస్తాయి. అన్నట్లు బ్రెజిల్‌లో పుట్టి ప్రపంచం అంతా జీడిమామిడి సాగు అల్లుకుంది. జీడిపప్పు ఉత్పత్తిలో నైజీరియా, వియత్నాం మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.

02/09/2016 - 23:06

కాకికి దగ్గరిబంధువైన ఈ పక్షులు దాదాపు వాటిలాగే ఉంటాయి. రంగు, సైజులో కొంత తేడా ఉన్నా బుద్ధులన్నీ ఒక్కటే. ఒక్కసారి జతకలిస్తే మరణించేవరకూ జంటగానే గడిపే ఈ పక్షులను ‘మాగ్‌పై బర్డ్’గా పిలుస్తారు. నలుపు, తెలుపు రంగులో, పొడవైన తోకతో దాదాపు కాకిలా కన్పించే ఈ పక్షులు అవసరమైనప్పుడు ఇతర పక్షుల గూళ్లలోని గుడ్లను దొంగిలించి ఆరగిస్తాయి.

01/31/2016 - 20:15

-ఎస్.కె.కె.రవళి
-------------------
డేగ అరుపును అనుకరించే పక్షులు

01/23/2016 - 18:22

జపనీస్ స్పైడర్ కాబ్‌గా పిలిచే ఈ పీత భూమీద ఉండే అతిపెద్ద పీత. వీటి కాళ్ల పొడవు 12 అడుగుల దాకా ఉంటుంది. ఎరుపుఛాయ, తెల్లని చుక్కలతో కూడిన వీటి మేని, రూపం భయపెడతాయి. జపాన్ సముద్రజలాల్లో మాత్రమే ఇవి కన్పిస్తాయి. అన్నట్లు అతిదీర్ఘకాలం బతికే జంతువల్లో ఇది రెండోది. తాబేళ్ల తరువాతి స్థానం దీనిదే. కనీసం వందేళ్లు బతకడం వీటి ప్రత్యేకత. వీటి కాళ్ల పొడవు ఎంతున్నా వీటి పరిమాణం అడ్డంగా ఒక అడుగుకు మించదు.

01/14/2016 - 17:58

ఇప్పుడు మనకు దొరుకుతున్న వజ్రాల వయసెంతో తెలుసా. కనీసం 350 మిలియన్ సంవత్సరాలు. భూమిలోపల 192 కి.మీ. అడుగున విపరీతమైన ఒత్తిడి, వేడి మధ్య కర్బన పదార్థాలే వజ్రాలుగా రూపొందుతాయి. భూమిలోపల అగ్నిపర్వతాలు పేలినప్పుడు లేదా లావా ఉప్పొంగినపుడు భూమి పైపొరల్లోకి వస్తాయి. తవ్వకాల్లో వాటిని బయటకు తీస్తారు. ఒక కారెట్ వజ్రం ఉత్పత్తి చేయడానికి 250 టన్నుల మట్టిని తవ్విపోయాలి తెలుసా.

01/09/2016 - 18:28

పసుపురంగుతో మెరిసిపోతున్న ఈ వృక్షాన్ని, చెట్టుకింద ఉన్న పసుపువర్ణంలో కన్పిస్తున్న వాటిని చూసి అవి ఆ చెట్టు పుష్పాలు అనుకుంటే తప్పులో కాలేసినట్లే. నిజానికి అవన్నీ ఆ చెట్టు ఆకులే. పెద్దసంఖ్యలో ఆకులు అలా రంగుమారి జారిపోతూంటే ఆ శోభను తిలకించేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌లోని గ్జియన్ ప్రాంతంలో ఉన్న అతి పురాతన ‘గింగ్‌కో’ వృక్షం ఇలా మెరిసిపోయింది మరి.

Pages